KTR | ఇది యాచించి తెచ్చుకున్న తెలంగాణ కాదు.. శాసించి తెచ్చుకున్న తెలంగాణ : కేటీఆర్
KTR | తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కల అంత సునాయాసంగా సాకారం కాలేదని.. ఎన్నో పోరాటాలు, బలిదానాల ఫలితంగా చివరకు రాష్ట్రం సిద్ధించిందని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పార్టీ పెట్టిన కేసీఆర్ 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత లక్ష్యాన్ని సాధించారని గుర్తుచేశారు.
KTR : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కల అంత సునాయాసంగా సాకారం కాలేదని.. ఎన్నో పోరాటాలు, బలిదానాల ఫలితంగా చివరకు రాష్ట్రం సిద్ధించిందని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పార్టీ పెట్టిన కేసీఆర్ 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత లక్ష్యాన్ని సాధించారని గుర్తుచేశారు. ఇవాళ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరు చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన ‘దీక్షా దివస్’ స్ఫూర్తి బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభమైన రోజు తనకు బాగా గుర్తున్నదని, దీక్షకు బయలుదేరిన ఆయన కారును పోలీసులు వెంబడించారని కేటీఆర్ తెలిపారు. అలుగునూరు వద్ద కారును అడ్డుకున్నారని చెప్పారు. కేసీఆర్ చేసిన 11 రోజుల దీక్ష ఒక ప్రభంజనం అయ్యిందన్నారు. ఆ దీక్షతో రాష్ట్రం అగ్నిగుండంగా మారిందని చెప్పారు. యూనివర్సిటీలు యుద్ధ భూములుగా మారాయన్నారు.
కేసీఆర్ అరెస్టు విషయం తెలిసి శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకున్నారని, నిరాహారదీక్ష కొనసాగిస్తే కేసీఆర్ బ్రెయిన్‌డెడ్ అవుతారని ఆనాడు వైద్యులు చెప్పారని కేటీఆర్ గుర్తుచేశారు. ఎవరెన్ని చెప్పినా వినకుండా మొండి పట్టుదలతో కేసీఆర్ దీక్ష కొనసాగించారని చెప్పారు. రాష్ట్రంలో జరిగిన మహోద్ధృత ఉద్యమంతో కేంద్రం దిగివచ్చిందని అన్నారు. తెలంగాణ సాకారం ఎవరి భిక్ష కాదని, యావత్ తెలంగాణ ప్రజల పోరాట ఫలితమని చెప్పారు.
ఇది యాచించి తెచ్చుకున్న తెలంగాణ కాదని, శాసించి తెచ్చుకున్న తెలంగాణ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మన రాష్ట్రం మనం సాధించుకునేందుకు 60 ఏళ్లు ఎందుకు పట్టింది..? ఎప్పుడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం లేచినా కాంగ్రెస్ పాలకులు కుట్రలతో అణగదొక్కడంవల్లే పట్టింది..! అని అన్నారు. కేసీఆర్ దేశంలో 32 పార్టీలను ఒప్పించి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ కలను సాకారం చేశారని చెప్పారు. నాడు ప్రత్యేకంగా ఉన్న తెలంగాణను 1956లో ఏపీతో కలిపిందే కాంగ్రెస్ పార్టీ అని ఆయన విమర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఇది యాచించి తెచ్చుకున్న తెలంగాణ కాదు.. శాసించి తెచ్చుకున్న తెలంగాణ : కేటీఆర్
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Jagadish Reddy | తెలంగాణ నీటి హక్కులను సీఎం తన గురువు చంద్రబాబు చేతిలో పెట్టిండు : జగదీష్‌రెడ్డి
KTR | బక్క పలచని యోధుడు బానిస సంకెళ్లు తెంచిన కథ.. మన తెలంగాణ జాతి కథ : కేటీఆర్
Health Tips | నిమ్మరసాన్ని దేంట్లో పడితే దాంట్లో వాడుతున్నారా .. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

