KTR | తీగలగుట్టపల్లిలో పోలీసోళ్లు ఎట్లా వస్తరని రాత్రంతా మేల్కొని ఉన్నం : కేటీఆర్
KTR | తీగలగుట్టపల్లిలో కేసీఆర్ నివాసంలో చుట్టూ 1000 మందిమి ఎట్లా పోలీసోళ్లు వస్తరని ఏం చేస్తరని రాత్రంతా మేల్కొని ఉన్నం.. ఆ రోజు నాకు యాదికుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేసుకున్నారు.
KTR | ఇయ్యాళ్ల అలుగునూరు సభలో నిలబడి మాట్లాడుతుంటే నా గుండెల నిండా కొంత సంతోషం. కొంత బాధ .. కొంత ఉద్వేగం ఉన్నది.. నాకింకా ఆ రోజు యాదికొస్తున్నదని దీక్షాదివస్ ముందు రోజు ఏం జరిగిందో చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
కరీంనగర్ అలుగునూరులో ఏర్పాటు చేసిన “దీక్షా దివస్” స్ఫూర్తి సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. 2009 నవంబర్ 28 అంటే ఒక్క రోజు ముందు దినమంతా అయ్యప్ప స్వాములు వచ్చిర్రు.. అందరం కలిసి పడి పూజ చేసినం. జరిగిన తర్వాత ఆ అయ్యప్ప స్వాములు సార్ మీ సంకల్పం నెరవేరుతదని కేసీఆర్‌కు కడుపునిండా ఆశీర్వాదం ఇచ్చిర్రు.. మళ్లీ వెంటనే టీవీల్లో బ్రేకింగ్ న్యూస్‌లు వస్తున్నయి.. కేసీఆర్‌ను అరెస్ట్ చేస్తరు.. తీసుకపోతరు.. అందరు పడుకోగానే తలుపులు పగుల గొట్టి కేసీఆర్‌ను తీసుకుపోతరు.. దీక్షకు పోనియ్యరు.. అని వార్తలు వస్తున్నాయి.. ఆ రోజు రాత్రి ఎవరికీ నిద్ర లేదు.. తీగలగుట్టపల్లిలో కేసీఆర్ నివాసంలో చుట్టూ 1000 మందిమి ఎట్లా పోలీసోళ్లు వస్తరని ఏం చేస్తరని రాత్రంతా మేల్కొని ఉన్నం.. ఆ రోజు నాకు యాదికుంది.. కొంతమంది తమ్ముళ్లు చేతుల్లో పెట్రోల్ డబ్బాలు పట్టుకొని కూర్చున్నరు.. గంభీరావు పేట నుంచి కమలాకర్ అనే తమ్ముడు, జక్కుల నాగారజు, రవీందర్ రెడ్డి, పొన్నం అనిల్ ఇట్లా ఎంతోమంది ఆ రోజు కాపలా కాశారన్నారు.
దీక్ష చేస్తానంటే ఎట్లా ఆపుతురని రోడ్డు మీద బైఠాయించారు..
ఆ రోజు కేసీఆర్ దీక్ష ప్రారంభమైన రోజు.. తీగలగుట్టపల్లి నుంచి సిద్దిపేట వైపు 300-400 కార్లలో పోతున్నాం.. పోలీసోళ్లు మా వెంబడి వందల బండ్లల్లో వాళ్లు కూడా బయలు దేరారు.. సార్ వెంబడే మేం కూడా పోతున్నం.. పోలీసోళ్లు మొత్తానికి సార్‌ను దారి మళ్లించి రాంగ్ రూట్లో తీసకొని సార్ కారును ముందటికి రయ్ మని తీసుకుని పోయారు.. మేం కూడా చేజ్ చేసుకుంటూ వస్తే మమ్మల్ని మానేడు బ్రిడ్జి అవతల బండ్లు పెట్టి, బారికేడ్లు అడ్డు పెట్టి మమ్మల్ని ఆపేశారు.. కేసీఆర్ కారును, ఆయన వెంబడి 4 కార్లను మాత్రం ముందటికి పోనిచ్చి అలుగునూరు దగ్గర కేసీఆర్ కారును ఆపేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నమన్నారు.
కేసీఆర్ వెంటనే దిగి కింద కూర్చొని ఎట్లా అరెస్ట్ చేస్తరు.. నేను రాష్ట్రపతికి చెప్పిన.. ప్రధానమంత్రికి చెప్పిన. తెలంగాణకు జరిగిన ధోఖా గురించి లోకమంతా చెప్పిన సత్యాగ్రాహం చేస్తున్నా నేను.. గాంధేయ పద్దతిలో నిరాహార దీక్ష చేస్తానంటే ఎట్లా ఆపుతురని అక్కడనే రోడ్డు మీద బైఠాయించారు.. మేం బ్రిడ్జి మీదినుంచి ఉరుక్కుంటూ వచ్చే లోపల కేసీఆర్‌ను అరెస్ట్ చేసి తీసుకొని పోతనే ఉన్నరు.. మేమొచ్చే వరకు సార్ వెంబడి ఉండేవాళ్లందరినీ కార్లలో ఎక్కించుకున్నరు.. ఒక్క జయశంకర్ సార్ మాత్రమే అక్కడ మిగిలిపోయారు. మేం పోయి జయశంకర్ సార్‌ను పట్టుకొని.. కేసీఆర్‌ను ఎక్కడికి తీసుకుపోయిర్రో వరంగల్ పోయిర్రంటే వాళ్ల కార్ల వెంబడి మేం కూడా పోయినం. ఆ రోజు నాకింకా కండ్ల ముందు కదులుతూ ఉంది.. ఆ 11 రోజులు ప్రజాస్వామిక ఉద్యమాల చరిత్రలో ఉజ్వల సన్నివేశాలవని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు.
LIVE: “దీక్షా దివస్” స్ఫూర్తి సభ
📍 అలుగునూరు, కరీంనగర్ https://t.co/pyk40wd0nX
— BRS Party (@BRSparty) November 29, 2026
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తీగలగుట్టపల్లిలో పోలీసోళ్లు ఎట్లా వస్తరని రాత్రంతా మేల్కొని ఉన్నం : కేటీఆర్
KTR | ఇది యాచించి తెచ్చుకున్న తెలంగాణ కాదు.. శాసించి తెచ్చుకున్న తెలంగాణ : కేటీఆర్
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Jagadish Reddy | తెలంగాణ నీటి హక్కులను సీఎం తన గురువు చంద్రబాబు చేతిలో పెట్టిండు : జగదీష్‌రెడ్డి
KTR | బక్క పలచని యోధుడు బానిస సంకెళ్లు తెంచిన కథ.. మన తెలంగాణ జాతి కథ : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

