Stalin rejects Oppn pitch | డీలిమిటేషన్‌పై వెనక్కి తగ్గని స్టాలిన్.. ‘ఇండియా’ కూటమి నేతల చర్చలు విఫలం
Stalin rejects Oppn pitch | తమిళనాడు మాజీ సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, డీలిమిటేషన్ బిల్లుపై తన వైఖరిని స్పష్టం చేశారు. ఆయనతో చర్చలు జరిపిన ‘ఇండియా’ కూటమి నేతలు విఫలమయ్యారు. డీఎంకే మద్దతు ఉపసంహరణపై స్టాలిన్‌ను ఒప్పించలేకపోయారు.
చెన్నై: తమిళనాడు మాజీ సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, డీలిమిటేషన్ బిల్లుపై తన వైఖరిని స్పష్టం చేశారు. ఆయనతో చర్చలు జరిపిన ‘ఇండియా’ కూటమి నేతలు విఫలమయ్యారు. డీఎంకే మద్దతు ఉపసంహరణపై స్టాలిన్‌ను ఒప్పించలేకపోయారు. (Stalin rejects Oppn pitch) కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో ఆ పార్టీ అధినేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఇతర సీనియర్ నేతలతో కూడిన ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి బృందం ఆదివారం చెన్నై చేరుకున్నది. డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్‌ను ఆయన నివాసంలో వారు కలిశారు. ఈ బృందానికి ఆయన స్వాగతం పలికారు. సుమారు గంటపాటు వారితో చర్చలు జరిపారు. డీఎంకే యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్, సీనియర్ నాయకురాలు కనిమొళి, దయానిధి మారన్, పలువురు పార్లమెంటు సభ్యులు అక్కడ ఉన్నారు.
కాగా, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ బిల్లుకు ప్రత్యామ్నాయం ఏమిటి, ముందుకు వెళ్లే మార్గం ఏమిటి అని ‘ఇండియా బ్లాక్’ నాయకులను డీఎంకే నేతలు అడిగారు. అయితే ఈ బిల్లును ఓడించాల్సిన అవసరం ఉందని మాత్రమే వారి నుంచి సమాధానం వచ్చినట్లు తెలుస్తున్నది. ఆ తర్వాత ఏమి చేయాలనే దానిపై స్పష్టమైన వ్యూహం ఏదీ లేదని ‘ఇండియా’ కూటమి నేతలు చెప్పినట్లు సమాచారం. దీంతో డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతును ప్రకటించిన ఎంకే స్టాలిన్‌ను ఒప్పించడంలో ‘ఇండియా బ్లాక్’ నాయకులు విఫలమయ్యారు.
మరోవైపు తమ పార్టీ వైఖరిని, డిమాండ్లను తాను వివరించినట్లు ఈ సమావేశం తర్వాత డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తెలిపారు. ‘మేము మా ఆలోచనలను పంచుకున్నాం. ఒకవేళ మనం ఈ అవకాశాన్ని చేజార్చుకుంటే, డీలిమిటేషన్ దానంతట అదే అమలవుతుంది. కాబట్టి, తమిళనాడు ప్రయోజనాలను కాపాడుకోవడానికి కనీస హామీ కూడా ఉండదు అన్నదే మా ఆందోళన’ అని మీడియాతో ఆయన అన్నారు.
🚨 BIG BREAKING: Sonia Gandhi and INDIA bloc leaders to meet DMK Chief M. K. Stalin in Chennai shortly over the proposed Delimitation Bills—a move the DMK has already endorsed.
@mkstalin @RahulGandhi @SoniaGandhi
#MKStalin #DelimitationBill #Delimitation2026 https://t.co/gT3eX6CGMB— Manakdeep Singh (किसान पुत्र 🌾) (@ManakdeepSingh) November 29, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- change
- Convince
- Delimitation
- DMK
RELATED ARTICLES
తాజా వార్తలు
Stalin rejects Oppn pitch | డీలిమిటేషన్‌పై వెనక్కి తగ్గని స్టాలిన్.. ‘ఇండియా’ కూటమి నేతల చర్చలు విఫలం
Health tips | శుభ్రం చేసేటప్పుడు పచ్చి చేప కళ్లను తీసిపారేస్తున్నారా.. అయితే ఈ ప్రయోజనాలను కోల్పోతున్నట్లే..!
KTR | తీగలగుట్టపల్లిలో పోలీసోళ్లు ఎట్లా వస్తరని రాత్రంతా మేల్కొని ఉన్నం : కేటీఆర్
KTR | ఇది యాచించి తెచ్చుకున్న తెలంగాణ కాదు.. శాసించి తెచ్చుకున్న తెలంగాణ : కేటీఆర్
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

