Pochampally Srinivas Reddy : దేశ రాజకీయాలను శాసించి తెలంగాణను సాధించిన మహానేత కేసీఆర్
తెలంగాణ వచ్చుడో...కేసీఆర్ సచ్చుడో అనే తెగింపుతో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేపట్టిన దీక్షా దివస్ సబ్బండ వర్గాల తెలంగాణ ప్రజలను ఏకం చేసిందని శాసన మండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివారెడ్డి పేర్కొన్నారు.
- నర్సంపేట దీక్షా దివస్‌లో శాసనమండలి లో బీఆర్ఎస్ డిప్యూటీ లీడర్ పోచంపల్లి
నర్సంపేట, నవంబర్29: తెలంగాణ వచ్చుడో…కేసీఆర్ సచ్చుడో అనే తెగింపుతో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేపట్టిన దీక్షా దివస్ సబ్బండ వర్గాల తెలంగాణ ప్రజలను ఏకం చేసిందని శాసన మండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నర్సంపేట పట్టణంలోని రెడ్డి ఫంక్షన్హాల్లో జరిగిన దీక్షా దివస్ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా శాసన మండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ జలవనరుల శాఖ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వీ.ప్రకాష్ హాజరైనారు. తొలుత పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

అదేవిధంగా దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి చిత్రపటానికి నివాళ్లు అర్పించారు. అక్కడి నుండి భారీ ర్యాలీగా దీక్షా దివస్ సభా స్థలికి చేరుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, ఉద్యమ నాయకుడు కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా 2009 నవంబర్ 29న ఆమరణ నిరహార దీక్ష ప్రారంభించిన రోజు అని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన ఒక అపూర్వ ఘట్టం, యావత్ తెలంగాణ ప్రజలని తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలకు ఏకం చేసింది దీక్షా దివస్ అని కొనియాడారు. తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర సాధనలో అత్యంత కీలకమైన గట్టంగా దీక్ష దివాస్ నిలుస్తుందని పేర్కొన్నారు.

దీక్షా దివస్ మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి స్వరాష్ట్ర సాధనకు బలమైన పునాదులు వేసిందని గుర్తు చేశారు. కేసీఆర్ దశాబ్ధాల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చారని తెలిపారు. దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి లేకుండా నర్సంపేటలో మొదటి కార్యక్రమం నిర్వహించడం బాధ కలిగిందన్నారు. 2001 నుండి కేసీఆర్ మాటే వేధంగా బాటే మార్గంగా పెద్ది ముందుకు నడిచారని గుర్తు చేశారు. పెద్ది సుదన్న జీవితమే ఒక పోరాటమని, ఉద్యమ దశ నుంచి నేటి వరకు తనను నమ్ముకున్న ప్రజల కోసం పోరాడారని అన్నారు.

ఆయన సేవలు ఎప్పటికి మరువలేనివని కొనియాడారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి, మెప్పించి కులాలకు, మతాలకు అతీతంగా అందరినీ కలిపిన సందర్భమే ఈదీక్షా దివాస్ అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్రలో దీక్షా దివస్ అత్యంత కీలకమైన రోజు అని తెలంగాణ జలవనరుల శాఖ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వీ.ప్రకాష్ గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన నిరహార దీక్షకు గుర్తుగా ప్రతీ సంవత్సరం నవంబర్ 29న దీక్షా దివస్‌ను జరుపుకుంటున్నామని వివరించారు.

ఈకార్యక్రమంలో మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ముఖ్య నాయకులు రాయిడి రవిందర్ రెడ్డి, గుగులోతు రామస్వామినాయక్, నల్లా మనోహర్‌రెడ్డి, డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, మునిగాల వెంకట్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, నాడెం శాంతికుమార్, బీఆర్ఎస్ పట్టణ, మండల మాజీ అధ్యక్షులు నాగేళ్లి వెంకటనారాయణగౌడ్, నామాల సత్యనారాయణ, నాయకులు గోనె యువరాజ్, వేనుముద్దల శ్రీధర్‌రెడ్డి, నాగిశెట్టి ప్రసాద్, దార్ల రమాదేవి, మండల శ్రీనివాస్, శివరాత్రి స్వామి, రాయిడి దుశ్యంత్‌రెడ్డి, పెండ్యాల యాదగిరి, దొమ్మటి సంతోష్, శానబోయిన రాజ్‌కుమార్, సుకినే రాజేశ్వర్‌రావు, కాట్ల భద్రయ్య, జైపాల్‌రెడ్డి, బాల్నే వెంకన్న, జక్క అశోక్‌యాదవ్, చెట్టుపల్లి మురళీధర్, కొమ్ము రమేష్‌యాదవ్, గటిక అజయ్ కుమార్ తదితరులున్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pochampally Srinivas Reddy : దేశ రాజకీయాలను శాసించి తెలంగాణను సాధించిన మహానేత కేసీఆర్
Watch: దివ్యాంగుల కోచ్‌లోకి ఎక్కనీయకపోవడంతో.. రాళ్లు రువ్విన వ్యక్తులు, వీడియో వైరల్
KTR | కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్ర పోరాటాన్ని చూసిన మనం అదృష్టవంతులం : కేటీఆర్
TB | టీబీ వచ్చి తగ్గిన తరువాత శరీరంలో జరిగే మార్పులేమిటి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
Stalin rejects Oppn pitch | డీలిమిటేషన్‌పై వెనక్కి తగ్గని స్టాలిన్.. ‘ఇండియా’ కూటమి నేతల చర్చలు విఫలం
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

