KTR | కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్ర పోరాటాన్ని చూసిన మనం అదృష్టవంతులం : కేటీఆర్
KTR | ఒక బక్క పలచని యోధుడు ఒక మహా రుషిలాగా తపస్సు చేస్తుంటే మరణం అంచుల దాకా పోతుంటే అగ్నిగుండమై భగభగ మండింది తెలంగాణ అని 2009 నవంబర్ 29 దీక్షా దివస్ నుద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
KTR | ముక్కోటి గొంతుకలు ఒక్కటై.. నాలుగు దిక్కులు ఏకమై పంచభూతాలు పంతం పట్టి ప్రభంజనమైందని 2009 నవంబర్ 29 దీక్షా దివస్ నుద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
కరీంనగర్ అలుగునూరులో ఏర్పాటు చేసిన “దీక్షా దివస్” స్ఫూర్తి సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఆ రోజు పోరాటం.. ఒక బక్క పలచని యోధుడు ఒక మహా రుషిలాగా తపస్సు చేస్తుంటే మరణం అంచుల దాకా పోతుంటే అగ్నిగుండమై భగభగ మండింది తెలంగాణ. యూనివర్సిటీలు యుద్దభూములైనయన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో బాల్క సుమన్‌తో పాటు మిగితా తమ్ముళ్లు.. పల్లెల్లో రైతులు, పట్నంలో విద్యార్థులు, నల్లకోటు వేసుకున్న లాయర్లు, తెల్లకోటు వేసుకున్న డాక్టర్లు, కంపెనీలో పని చేసే కార్మికులు, ఆఫీసుల్లో పని చేసే ఉద్యోగులు, మా ఆడబిడ్డలు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఎన్నారైలతో సహా ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ బిడ్డలు ఉద్యమించి బిడ్డా మా తెలంగాణ మాకు ఇస్తావా లేదా… మీ ఢిల్లీ అహంకారం, మీ కండ కావరం ఇంకెన్ని రోజులు అని బరిగీసి కొట్లాడిన అరుదైన సందర్భం ఈ నవంబర్ 29 అన్నారు కేటీఆర్.
మనం భారత స్వాతంత్ర్య సంగ్రామం గురించి విన్నమే తప్ప చూడలేదు.. కానీ స్వరాజ్య సమరాన్ని తలపించేలా స్వరాష్ట్ర పోరాటాన్ని పెద్దలు కేసీఆర్ నాయకత్వంలో చూసిన మనందరం అదృష్టవంతులమన్నారు కేటీఆర్. ఇక్కడ కేసీఆర్ అరెస్ట్ అయిండు అనగానే సోదరుడు శ్రీకాంత్ చారి ఎల్బీ నగర్ చౌరస్తాలో పెట్రోల్ పోసుకుని కాలపెట్టుకున్నడు.. మరోవైపు కామారెడ్డిలో అమరుడు పోలీస్ కానిస్టేబుల్ కిష్టయ్య వల వల ఏడ్చిండని గుర్తు చేసుకున్నారు..
చస్తే నేను చస్తా తెలంగాణ కోసం.. పిల్లలు చావొద్దు దండం పెడుతున్నా అని కేసీఆర్ బతిలాడిండని అన్నారు. మీరు చనిపోతే మీకేమైనా అయితే రాష్ట్రం ఆగమైతని మీరు బతకాలి.. మీరుండాలే అని ఎంతమంది వేడుకున్నా.. కేసీఆర్ ఒకటే మాటన్నడు.. ఇంకెవ్వరు చావొద్దు..నేను చచ్చినా ఫర్వాలేదు.. కానీ అని తెలంగాణ వచ్చేదాకా నేను లెవ్వ అని ఏదైనా సరే నా దీక్ష విరమించను.. అని ఆ రోజు కేసీఆర్ మొండి ప్రతిజ్ఞ చేశారన్నారు కేటీఆర్.
LIVE: “దీక్షా దివస్” స్ఫూర్తి సభ
📍 అలుగునూరు, కరీంనగర్ https://t.co/pyk40wd0nX
— BRS Party (@BRSparty) November 29, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్ర పోరాటాన్ని చూసిన మనం అదృష్టవంతులం : కేటీఆర్
TB | టీబీ వచ్చి తగ్గిన తరువాత శరీరంలో జరిగే మార్పులేమిటి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
Stalin rejects Oppn pitch | డీలిమిటేషన్‌పై వెనక్కి తగ్గని స్టాలిన్.. ‘ఇండియా’ కూటమి నేతల చర్చలు విఫలం
Health tips | శుభ్రం చేసేటప్పుడు పచ్చి చేప కళ్లను తీసిపారేస్తున్నారా.. అయితే ఈ ప్రయోజనాలను కోల్పోతున్నట్లే..!
KTR | తీగలగుట్టపల్లిలో పోలీసోళ్లు ఎట్లా వస్తరని రాత్రంతా మేల్కొని ఉన్నం : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

