YouTuber Madhumitha | యూట్యూబర్ మధుమిత ఇంట్లో బంగారం చోరీ కేసు.. 98 సవర్ల బంగారం స్వాధీనం
YouTuber Madhumitha : తమిళనాడుకు చెందిన యూట్యూబర్ మధుమిత ఇంట్లో చోరీకి గురైన బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 98 సవర్ల (784 గ్రాములు) బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
YouTuber Madhumitha : తమిళనాడుకు చెందిన యూట్యూబర్ మధుమిత ఇంట్లో చోరీకి గురైన బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 98 సవర్ల (784 గ్రాములు) బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటివరకు నలుగురిని అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలివి. కన్యాకుమారి జిల్లా, రాజక్కమంగళం పోలీస్ స్టేషన్ పరిధి, తమ్మతుకోణంలో ఉన్న వీఐపీ గార్డెన్లోని ఒక ఇంట్లో యూట్యూబర్ మధుమిత, ఆమె భర్త వినోద్ కుమార్ కలిసుంటున్నారు.
మధుమిత తనకు ఉన్న నగల్ని, సంపదను ఎప్పుడూ యూట్యూబ్లో, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. దీంతో మధుమి దగ్గర ఉన్న నగలు, సంపదపై దొంగల కన్ను పడింది. గత గురువారం దంపతులు ఇంటి నుంచి బయటకు వెళ్లారు. రాత్రికి ఇంటికి వచ్చి చూసేసరికి తలుపులు పగలగొట్టి ఉన్నాయి. ఇంట్లోని 118 సవర్ల బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. అలాగే, కొంత నగదు, ఇతర ఆభరణాల్ని కూడా దోచుకెళ్లారు. దీంతో మధుమిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపారు. 16ం సీసీ కెమెరాలు, వివిధ కాల్ డేటాలు విశ్లేషించి దొంగల్ని పట్టుకున్నారు.
నలుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 98 సవర్ల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై ఇంకా విచారణ జరుగుతోందని కన్యాకుమారి జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. మరోవైపు తమ ఇంట్లో అంత బంగారం చోరికి గురైనప్పటికీ మధుమతి ఆ తర్వాత కూడా తన నగలు, సంపదకు సంబంధించిన వీడియోల్ని యూట్యూబ్లో పోస్టు చేయడం విశేషం.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- gold
- madhumitha
- Tamil Nadu
- Youtuber
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్లో తరుణ్ భాస్కర్!
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

