Cancer | మధుమేహం ఉన్నవారికి 21 రకాల క్యాన్సర్ల ముప్పు.. అధ్యయనంలో వెల్లడి..
ఇటీవలే ప్రచురితమైన ఒక సమీక్ష ప్రకారం.. మధుమేహం ఉన్నవారిలో సాధారణంగా కనిపించే 24 రకాల క్యాన్సర్లలో 21 రకాల ముప్పు ఎక్కువగా ఉందని వెల్లడైంది. దాదాపు 50 లక్షల మందిపై నిర్వహించిన విశ్లేషణలో ఈ సంబంధాన్ని గుర్తించారు.
Cancer | ఇటీవలే ప్రచురితమైన ఒక సమీక్ష ప్రకారం.. మధుమేహం ఉన్నవారిలో సాధారణంగా కనిపించే 24 రకాల క్యాన్సర్లలో 21 రకాల ముప్పు ఎక్కువగా ఉందని వెల్లడైంది. దాదాపు 50 లక్షల మందిపై నిర్వహించిన విశ్లేషణలో ఈ సంబంధాన్ని గుర్తించారు. ముఖ్యంగా కాలేయం, క్లోమగ్రంథి క్యాన్సర్లతోపాటు పెద్దపేగు, రొమ్ము, గర్భాశయ లోపలి పొర, మూత్రాశయం, మూత్రపిండాలు, థైరాయిడ్, జీర్ణాశయం, అండాశయ క్యాన్సర్ల ముప్పు కూడా ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అయితే మధుమేహమే నేరుగా ఈ క్యాన్సర్లకు కారణమని ఈ అధ్యయనం నిర్ధారించలేదు. రెండు వ్యాధులకు ఉమ్మడిగా ఉండే ప్రమాద కారకాలు కూడా ఇందుకు కారణమై ఉంటాయి. భారత్‌లో సుమారు 10.1 కోట్ల మంది మధుమేహంతో, మరో 13.6 కోట్ల మంది మధుమేహానికి ముందు దశలో ఉన్న నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది.
జీవ సంబంధ కారణాలే..
మధుమేహం క్యాన్సర్ ముప్పును పెంచడానికి పలు జీవసంబంధ కారణాలు ఉన్నాయని సమీక్ష వివరించింది. టైప్-2 మధుమేహంలో శరీరం ఇన్సులిన్‌కు సరిగా స్పందించకపోవడంతో రక్తంలో ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి. ఇవి కణాల పెరుగుదల, విభజనను ప్రేరేపించే మార్గాలను ప్రభావితం చేసి కణితుల అభివృద్ధికి తోడ్పడతాయి. దీర్ఘకాలంగా రక్తంలో చక్కెర అధికంగా ఉండడం వల్ల కణాలపై ఒత్తిడి పెరిగి డీఎన్ఏ దెబ్బతినే అవకాశం ఉంటుంది. మధుమేహం, ముఖ్యంగా ఊబకాయంతో కలిసినప్పుడు, శరీరంలో దీర్ఘకాలిక వాపు కూడా ఏర్పడుతుంది. జన్యువులు పనిచేసే తీరులో మార్పులు రావడం కూడా క్యాన్సర్ అభివృద్ధికి అనుకూల పరిస్థితులను కల్పిస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు.
నోటి క్యాన్సర్ ఉంటే మధుమేహం..
దక్షిణ భారతదేశంలో నిర్వహించిన కొన్ని పరిశోధనల్లో నోటి క్యాన్సర్ ఉన్నవారిలో మధుమేహం ఎక్కువగా కనిపించినట్లు సమీక్ష తెలిపింది. ఇన్సులిన్, ఐజీఎఫ్-1 సంబంధిత మార్పులు నోటి క్యాన్సర్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని పరిశోధకులు భావిస్తున్నారు. మరోవైపు క్యాన్సర్, దానికి ఇచ్చే చికిత్సలు కూడా రక్తంలో చక్కెర నియంత్రణను దెబ్బతీస్తాయి. క్లోమగ్రంథి క్యాన్సర్, శస్త్రచికిత్సలు, రేడియేషన్, స్టెరాయిడ్లు, కొన్ని లక్ష్యిత చికిత్సలు, ఇమ్యూనోథెరపీ, ప్రోస్టేట్ క్యాన్సర్‌కు ఇచ్చే హార్మోన్ చికిత్సలు మధుమేహానికి దారితీస్తాయి. క్యాన్సర్ చికిత్స పొందుతున్నవారిలో, చికిత్స పూర్తయినవారిలో కూడా రక్తంలో చక్కెర స్థాయిలను పర్యవేక్షించడం అవసరం.
తరచూ పరీక్షలు అవసరం..
మధుమేహం ఉన్నవారు వయస్సు, వ్యక్తిగత ప్రమాద స్థాయికి తగిన క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. కారణం తెలియకుండా బరువు తగ్గడం, రక్తహీనత, కామెర్లు వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన బరువును కొనసాగించడం, సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచుకోవచ్చు. మెట్ఫార్మిన్ క్యాన్సర్‌కు సంబంధించిన కొన్ని జీవసంబంధ మార్గాలపై చూపే ప్రభావాలపై పరిశోధనలు జరుగుతున్నప్పటికీ, క్యాన్సర్ నివారణకు ఈ మందు ఉపయోగపడుతుందని ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు. మధుమేహం, క్యాన్సర్ మధ్య సంబంధం సంక్లిష్టమైనది. కాబట్టి రక్తంలో చక్కెర నియంత్రణతోపాటు తగిన క్యాన్సర్ పరీక్షలు, చికిత్స సమయంలో ఆరోగ్య పర్యవేక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer | మధుమేహం ఉన్నవారికి 21 రకాల క్యాన్సర్ల ముప్పు.. అధ్యయనంలో వెల్లడి..
Bandla Ganesh | చెక్ బౌన్స్ కేసు.. నిర్మాత బండ్ల గణేష్‌కు ఏడాది జైలుశిక్ష.. రూ.95 లక్షల జరిమానా..!
Acidity | ఎసిడిటీ, అజీర్తి సమస్యలు తరచూ వస్తున్నాయా..? అయితే అందుకు కారణాలు ఇవే..!
Man Throws Sons Into Canal | ఇద్దరు కుమారులను కాలువలోకి విసిరేసిన తండ్రి.. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై రాళ్ల దాడి
Litton Das | టెస్టు క్రికెట్ చరిత్రలో బంగ్లాదేశ్ వికెట్ కీపర్ సరికొత్త రికార్డు..!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

