Bandla Ganesh | చెక్ బౌన్స్ కేసు.. నిర్మాత బండ్ల గణేష్‌కు ఏడాది జైలుశిక్ష.. రూ.95 లక్షల జరిమానా..!
Bandla Ganesh | సినీయర్ నటుడు (Senior Actor), నిర్మాత (Producer) బండ్ల గణేశ్ (Bandla Ganesh) కు ఒంగోలు కోర్టు (Ongole Court) షాకిచ్చింది. చెక్ బౌన్స్ కేసులో నిందితుడిగా ఉన్న ఆయనకు ఏడాది జైలుశిక్ష వేసింది. జైలుశిక్షతోపాటు రూ.95 లక్షల జరిమానా కూడా విధించింది. బండ్ల గణేశ్ 2018లో ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు గ్రామానికి చెందిన జానకి రామయ్య వద్ద రూ.95 లక్షలు అప్పుగా తీసుకున్నారు.
Bandla Ganesh : సినీయర్ నటుడు (Senior Actor), నిర్మాత (Producer) బండ్ల గణేశ్ (Bandla Ganesh) కు ఒంగోలు కోర్టు (Ongole Court) షాకిచ్చింది. చెక్ బౌన్స్ కేసులో నిందితుడిగా ఉన్న ఆయనకు ఏడాది జైలుశిక్ష వేసింది. జైలుశిక్షతోపాటు రూ.95 లక్షల జరిమానా కూడా విధించింది. బండ్ల గణేశ్ 2018లో ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు గ్రామానికి చెందిన జానకి రామయ్య వద్ద రూ.95 లక్షలు అప్పుగా తీసుకున్నారు. అయితే జానకి రామయ్య మరణించడంతో ఆయన తండ్రి జెట్టి వెంకటేశ్వర్లుకి బండ్ల గణేశ్ ‘పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్’ పేరుతో రూ.95 లక్షల చెక్ ఇచ్చారు.
కానీ ఆ చెక్ బౌన్స్ అయ్యింది. దాంతో జెట్టి వెంకటేశ్వర్లు ఒంగోలు కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఇవాళ జైలుశిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. బాధితుడికి కోర్టు ఖర్చులు కూడా చెల్లించాలని ఆదేశించింది. అదేవిధంగా ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు కోర్టు నెల రోజుల గడువు ఇచ్చింది. కాగా ఒంగోలు కోర్టు తీర్పుపై బండ్ల గణేశ్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.
‘భారత రాజ్యాంగం, న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థలపై తనకు అపారమైన గౌరవం ఉందన్నారు. జిల్లా కోర్టు నుంచి హైకోర్టుకు, అక్కడి నుంచి సుప్రీంకోర్టు వరకు న్యాయం కోరేందుకు రాజ్యాంగం అవకాశం కల్పించిందని, న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసంతో చట్టాన్ని గౌరవిస్తూ ముందుకు సాగడమే తన పని అని పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bandla Ganesh | చెక్ బౌన్స్ కేసు.. నిర్మాత బండ్ల గణేష్‌కు ఏడాది జైలుశిక్ష.. రూ.95 లక్షల జరిమానా..!
Acidity | ఎసిడిటీ, అజీర్తి సమస్యలు తరచూ వస్తున్నాయా..? అయితే అందుకు కారణాలు ఇవే..!
Man Throws Sons Into Canal | ఇద్దరు కుమారులను కాలువలోకి విసిరేసిన తండ్రి.. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై రాళ్ల దాడి
Litton Das | టెస్టు క్రికెట్ చరిత్రలో బంగ్లాదేశ్ వికెట్ కీపర్ సరికొత్త రికార్డు..!
Professor Teja Sri | నా కూతురికి న్యాయం చేయండి.. అసిస్టెంట్ ప్రొఫెసర్ తేజశ్రీ తల్లి నిరాహార దీక్ష
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

