Professor Teja Sri | నా కూతురికి న్యాయం చేయండి.. అసిస్టెంట్ ప్రొఫెసర్ తేజశ్రీ తల్లి నిరాహార దీక్ష
Professor Teja Sri | రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో లైంగిక వేధింపులకు గురైన అసిస్టెంట్ ప్రొఫెసర్ తేజశ్రీకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె తల్లి లక్ష్మీముసారాంబాగ్లో నిరాహార దీక్ష చేపట్టారు.
Professor Teja Sri | మహిళా ప్రొఫెసర్లపై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్డాస్ జానయ్య వేధింపులకు పాల్పడటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో లైంగిక వేధింపులకు గురైన అసిస్టెంట్ ప్రొఫెసర్ తేజశ్రీకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె తల్లి లక్ష్మీముసారాంబాగ్లో నిరాహార దీక్ష చేపట్టారు.
నా కూతురికి న్యాయం చేయండి. లైంగిక వేధింపుల ఫిర్యాదుపై FIR నమోదు చేయాలని, వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 24 గంటల్లో చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. లక్ష్మీ దీక్షకు సహచర అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు సంఘీభావం తెలిపారు.
నలుగురు సభ్యులతో కమిటీ..
వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే తోటి ప్రొఫెసర్లు, యూనివర్సిటీ సిబ్బంది, విద్యార్థులు ఆందోళన కూడా చేపట్టగా.. వీసీ అల్డాస్ జానయ్యకు తెలంగాణరాష్ట్ర మహిళాకమిషన్ నోటీసులు కూడా జారీ చేసింది.
మరోవైపు వీసీ జానయ్యపై విచారణకు గవర్నర్ ఆదేశాలు కూడా జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వీసీ అల్డాస్ జానయ్య వ్యవహారంపై విచారణకు నలుగురు సభ్యులతో కమిటీ వేసింది. గిడ్డంగి సంస్థ ఎండీ లక్ష్మి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయగా.. గోపి, రాహుల్ రాజ్, ప్రజ్వల స్వచ్చంద సంస్థ ప్రతినిధి సునీత కృష్ణాన సభ్యులుగా ఉన్నారు. 15 రోజుల్లో పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వం కమిటీకి ఆదేశాలు జారీ చేసింది.
Read Also :
‘ఎన్నికల ప్రక్రియపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి’
Protests | సోనియాగాంధీ ఆత్మకథపై ఏక్నాథ్ షిండే వర్గం శివసేన ఆగ్రహం.. Video
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Professor Teja Sri | నా కూతురికి న్యాయం చేయండి.. అసిస్టెంట్ ప్రొఫెసర్ తేజశ్రీ తల్లి నిరాహార దీక్ష
TTD | 8.34 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం.. సామాన్య భక్తులకు ప్రాధాన్యత : టీటీడీ
Bird flu | బర్డ్‌ఫ్లూ నియంత్రణకు తొలి స్వదేశీ టీకా.. ఈ నెల 20న దేశానికి అంకితం..!
Suicide Attempt | షాకింగ్ వీడియో .. ఐదంతస్తుల భవనంపై నుంచి దూకిన మహిళ
KTR | మీ మాటలు, మీరు చేసిన సాయమే నాకు స్ఫూర్తి.. కేటీఆర్‌తో చంద్రకాంత్ సాగర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

