KTR | మీ మాటలు, మీరు చేసిన సాయమే నాకు స్ఫూర్తి.. కేటీఆర్‌తో చంద్రకాంత్ సాగర్.. వీడియో
KTR | ఉద్యోగం చేయడం కాదు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని మీరు చెప్పిన మాటలు, చేసిన సాయమే నాకు స్ఫూర్తి అని కేటీఆర్‌తో ప్రణవ్ ఎంటర్ప్రైజెస్ అధినేత చంద్రకాంత్ సాగర్ అన్నారు.
KTR | ప్రణవ్ ఎంటర్ప్రైజెస్ అధినేత చంద్రకాంత్ సాగర్ బుధవారం తెలంగాణ భవన్లో బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చంద్రకాంత్ సాగర్‌తో కేటీఆర్ ఆత్మీయంగా మాట్లాడుకుంటూ కలిసి భోజనం చేశారు. అనంతరం చంద్రకాంత్ సాగర్ స్థాపించిన స్వయంకృషి ఫౌండేషన్ లోగోను కేటీఆర్ ఆవిష్కరించారు.
ఉద్యోగం చేయడం కాదు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని మీరు చెప్పిన మాటలు, చేసిన సాయమే నాకు స్ఫూర్తి అని ఈ సందర్భంగా కేటీఆర్‌తో చంద్రకాంత్ సాగర్ అన్నారు. మీరే నా బ్యాక్ బోన్.. 90 శాతం అంగవైకల్యంతో ఉన్న నేను కోటి రూపాయల టర్నోవర్ చేసే స్థాయికి ఎదిగానన్నారు.
90 శాతం వైకల్యాన్ని అధిగమించి పారిశ్రామికవేత్తగా ఎదిగి.. పలువురు దివ్యాంగులకు ఉపాధి కల్పిస్తున్న చంద్రకాంత్ సాగర్‌ను కేటీఆర్ మనస్ఫూర్తిగా అభినందించారు. కేటీఆర్ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చంద్రకాంత్ సాగర్‌కు అండగా నిలిచి పరిశ్రమ అభివృద్ధికి సహకరించారని తెలిసిందే.
ఉద్యోగం చేయడం కాదు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని మీరు చెప్పిన మాటలు, చేసిన సాయమే నాకు స్ఫూర్తి
మీరే నా బ్యాక్ బోన్.. 90 శాతం అంగవైకల్యంతో ఉన్న నేను కోటి రూపాయల టర్నోవర్ చేసే స్థాయికి ఎదిగాను
90 శాతం వైకల్యాన్ని అధిగమించి పారిశ్రామికవేత్తగా ఎదిగి.. పలువురు దివ్యాంగులకు ఉపాధి కల్పిస్తున్న చంద్రకాంత్ సాగర్‌ను అభినందించిన కేటీఆర్
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చంద్రకాంత్ సాగర్‌కు అండగా నిలిచి పరిశ్రమ అభివృద్ధికి సహకరించిన కేటీఆర్
ఈరోజు తెలంగాణ భవన్లో ప్రణవ్ ఎంటర్ప్రైజెస్ అధినేత చంద్రకాంత్ సాగర్ మర్యాదపూర్వకంగా కలిసి.. ఈ సందర్భంగా ఇరువురు ఆత్మీయంగా మాట్లాడుకుంటూ కలిసి భోజనం చేసి చంద్రకాంత్ సాగర్ స్థాపించిన స్వయంకృషి ఫౌండేషన్ లోగోను ఆవిష్కరించిన కేటీఆర్
— Telugu Scribe (@TeluguScribe) November 18, 2026
Read Also :
‘ఎన్నికల ప్రక్రియపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి’
Protests | సోనియాగాంధీ ఆత్మకథపై ఏక్నాథ్ షిండే వర్గం శివసేన ఆగ్రహం.. Video
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | మీ మాటలు, మీరు చేసిన సాయమే నాకు స్ఫూర్తి.. కేటీఆర్‌తో చంద్రకాంత్ సాగర్.. వీడియో
Condolense | అచ్చా విద్యాసాగర్ మృతి పట్ల మాజీ ఎంపీ వినోద్ కుమార్ సంతాపం
Army captain killed | నదిలో పడిన ఆర్మీ వాహనం.. ఆర్మీ కెప్టెన్ మృతి, ముగ్గురు సిబ్బందికి గాయాలు
Notification | రోస్టర్ పాయింట్లను సవరించిన తర్వాతనే అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ ఇవ్వాలి
Air Pollution | వాయు కాలుష్యానికి చెక్ పెడితే.. ఏటా 90 లక్షల ప్రాణాలను కాపాడొచ్చు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

