Army captain killed | నదిలో పడిన ఆర్మీ వాహనం.. ఆర్మీ కెప్టెన్ మృతి, ముగ్గురు సిబ్బందికి గాయాలు
Army captain killed | ఒక ఆర్మీ వాహనం నదిలో పడింది. ఆ వాహనంలో ఉన్న ఆర్మీ కెప్టెన్ ఈ ప్రమాదంలో మరణించారు. మరో ముగ్గురు సిబ్బంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముగ్గురు సిబ్బంది పరిస్థితి కూడా విషయంగా ఉన్నట్లు తెలుస్తున్నది.
ఇంఫాల్: ఒక ఆర్మీ వాహనం నదిలో పడింది. ఆ వాహనంలో ఉన్న ఆర్మీ కెప్టెన్ ఈ ప్రమాదంలో మరణించారు. మరో ముగ్గురు సిబ్బంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముగ్గురు సిబ్బంది పరిస్థితి కూడా విషయంగా ఉన్నట్లు తెలుస్తున్నది. (Army captain killed) మణిపూర్‌లోని ఇంఫాల్ తూర్పు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం మధ్యాహ్నం 8వ బీహార్ రెజిమెంట్‌కు చెందిన ఆర్మీ సిబ్బంది ఒక వాహనంలో ప్రయాణించారు. లామ్లాయ్ చల్లౌ వద్ద ఆ వాహనం అదుపుతప్పింది. ఇటమ్ నదిలోకి దూసుకెళ్లింది.
కాగా, ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. నదిలో పడిన ఆర్మీ సిబ్బందిని బయటకు తీశారు. గాయపడిన వారిని బాబినా ఆసుపత్రికి తరలించారు.
అయితే 29 ఏళ్ల ఆర్మీ కెప్టెన్ హనుమాన్ రామ్ చికిత్స పొందుతూ మరణించారు. మిగతా ముగ్గురు సిబ్బంది అయిన 24 ఏళ్ల సిపాయి మాలి జయేష్ హిమ్మత్, 37 ఏళ్ల సిపాయి రాకేష్ సర్పటే, 19 ఏళ్ల అగ్నివీర్ అఖిలేష్ కుమార్ షా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. వీరి పరిస్థితి కూడా విషయంగా ఉన్నట్లు వివరించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- army captain
- Falls
- Injured
- Killed
RELATED ARTICLES
తాజా వార్తలు
Army captain killed | నదిలో పడిన ఆర్మీ వాహనం.. ఆర్మీ కెప్టెన్ మృతి, ముగ్గురు సిబ్బందికి గాయాలు
Notification | రోస్టర్ పాయింట్లను సవరించిన తర్వాతనే అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ ఇవ్వాలి
Air Pollution | వాయు కాలుష్యానికి చెక్ పెడితే.. ఏటా 90 లక్షల ప్రాణాలను కాపాడొచ్చు.. అధ్యయనంలో వెల్లడి..
BSNL | బీఎస్ఎన్ఎల్ వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్స్.. స్టార్టింగ్ ప్లాన్ ధర ఎంతంటే..!
Traffic Challans | ట్రాఫిక్ చలాన్లలో సెంచరీ దాటేశాడు.. ఒకే బైక్‌పై ఎన్ని చలాన్లున్నాయో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

