Air Pollution | వాయు కాలుష్యానికి చెక్ పెడితే.. ఏటా 90 లక్షల ప్రాణాలను కాపాడొచ్చు.. అధ్యయనంలో వెల్లడి..
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిర్దేశించిన గాలి నాణ్యత ప్రమాణాలను అమలు చేస్తే ఏటా 90 లక్షలకు పైగా మరణాలను నివారించవచ్చని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో వాయు కాలుష్యం కారణంగా సంభవిస్తున్న అకాల మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపింది.
Air Pollution | ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిర్దేశించిన గాలి నాణ్యత ప్రమాణాలను అమలు చేస్తే ఏటా 90 లక్షలకు పైగా మరణాలను నివారించవచ్చని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో వాయు కాలుష్యం కారణంగా సంభవిస్తున్న అకాల మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపింది. వాయు కాలుష్యాన్ని నియంత్రించడం ద్వారా లక్షలాది మంది ప్రాణాలను కాపాడడమే కాకుండా, గుండె జబ్బులు, పక్షవాతం, ఊపిరితిత్తుల వ్యాధులు, డిమెన్షియా వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కూడా తగ్గించవచ్చని పరిశోధకులు వెల్లడించారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు 136 తక్కువ, మధ్య ఆదాయ దేశాలకు సంబంధించిన వాయు కాలుష్యం, జనాభా, ఆరోగ్య గణాంకాలను విశ్లేషించారు. ఈ అధ్యయనం ఎన్విరాన్మెంట్ ఇంటర్నేషనల్ జర్నల్లో ప్రచురితమైంది.
పీఎం 2.5 అంటే..?
ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం పీఎం2.5 వార్షిక సగటు పరిమాణం ప్రతి ఘనపు మీటరు గాలిలో 5 మైక్రోగ్రాములకు, నైట్రోజన్ డయాక్సైడ్ (ఎన్ఓ2) పరిమాణం 10 మైక్రోగ్రాములకు మించకూడదు. పీఎం2.5 అనేవి 2.5 మైక్రాన్లు లేదా అంతకంటే తక్కువ పరిమాణంలో ఉండే అతి సూక్ష్మ ధూళి కణాలు. వాహనాల పొగ, విద్యుత్ కేంద్రాలు, పారిశ్రామిక కార్యకలాపాలు, నిర్మాణ పనులు, ఇంధనాల దహనం వీటి ఉత్పత్తికి ప్రధాన కారణాలు. నైట్రోజన్ డయాక్సైడ్ ప్రధానంగా శిలాజ ఇంధనాల దహనం, డీజిల్ వాహనాల పొగ, పరిశ్రమలు, గ్యాస్ స్టవ్లు, హీటర్ల నుంచి వెలువడుతుంది. పీఎం2.5 స్థాయిలను ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన పరిమితికి తగ్గిస్తే ఏటా సుమారు 94 లక్షల మరణాలను నివారించవచ్చని లేదా వాయిదా వేయవచ్చని అధ్యయనం అంచనా వేసింది.
తక్కువ స్థాయి లక్ష్యాలతోనూ ప్రయోజనం..
అదే విధంగా నైట్రోజన్ డయాక్సైడ్ కాలుష్యాన్ని నిర్దేశిత స్థాయికి తగ్గిస్తే మరో 11 లక్షల మరణాలను నివారించవచ్చని తెలిపింది. తక్కువ స్థాయి లక్ష్యాలను సాధించినా గణనీయమైన ప్రయోజనాలు ఉంటాయని, పీఎం2.5 కారణంగా సంభవించే మరణాల్లో సుమారు 66 లక్షలు, నైట్రోజన్ డయాక్సైడ్ కారణంగా సంభవించే మరణాల్లో 4.35 లక్షలను తగ్గించవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణతో కొత్తగా నమోదయ్యే దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి (సీఓపీడీ) కేసులు 28 లక్షలు, డిమెన్షియా కేసులు 11 లక్షలు, గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులకు సంబంధించిన వ్యాధి కేసులు 73 లక్షలు, పక్షవాతం కేసులు 23 లక్షల వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేశారు. సూక్ష్మ ధూళి కణాలు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి వాపును కలిగించడంతోపాటు రక్తనాళాలు, గుండె సంబంధిత వ్యవస్థపై ప్రభావం చూపుతాయని వివరించారు.
ఆర్థికంగా కూడా భారీగా ఆదా..
కాలుష్య నియంత్రణ వల్ల ఆరోగ్య ప్రయోజనాలతోపాటు ఆర్థికంగా కూడా భారీ ఆదా సాధ్యమవుతుందని అధ్యయనం వెల్లడించింది. పీఎం2.5 మార్గదర్శకాలను అమలు చేస్తే గుండె సంబంధిత వ్యాధులకు సంబంధించిన ప్రత్యక్ష వైద్య ఖర్చుల్లో ఏటా 11.8 బిలియన్ డాలర్లు, పక్షవాతం చికిత్సకు 5.9 బిలియన్ డాలర్లు, డిమెన్షియా చికిత్సకు 8.6 బిలియన్ డాలర్లు ఆదా చేయవచ్చని అంచనా వేసింది. వేగంగా పట్టణీకరణ, ఆర్థిక అభివృద్ధి, వ్యక్తిగత వాహనాల వినియోగం పెరగడం తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో వాయు కాలుష్యం తీవ్రతకు కారణమవుతున్నాయని పరిశోధకులు తెలిపారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ అన్నాలన్ నవారత్నం మాట్లాడుతూ.. ప్రపంచంలో అత్యధిక బహిరంగ వాయు కాలుష్యం ఉన్న దేశాల్లో డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాలను అమలు చేస్తే ప్రాణాలను కాపాడడంతోపాటు ఆర్థిక, సామాజిక ప్రయోజనాలు కూడా లభిస్తాయని పేర్కొన్నారు. రవాణా వ్యవస్థ, పట్టణ ప్రణాళిక, ఇంధన విధానాల్లో మార్పులు తీసుకురావడం ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించవచ్చని డాక్టర్ హనీన్ ఖ్రీస్ అభిప్రాయపడ్డారు. ఆర్థిక అభివృద్ధికి ఆటంకం కలగకుండా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించేందుకు కాలుష్య నియంత్రణ కీలకమని పరిశోధకులు స్పష్టం చేశారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Air Pollution | వాయు కాలుష్యానికి చెక్ పెడితే.. ఏటా 90 లక్షల ప్రాణాలను కాపాడొచ్చు.. అధ్యయనంలో వెల్లడి..
BSNL | బీఎస్ఎన్ఎల్ వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్స్.. స్టార్టింగ్ ప్లాన్ ధర ఎంతంటే..!
Traffic Challans | ట్రాఫిక్ చలాన్లలో సెంచరీ దాటేశాడు.. ఒకే బైక్పై ఎన్ని చలాన్లున్నాయో తెలుసా..?
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Aurobindo Pharma Foundation | యంగ్ ఇండియా పోలీస్ స్కూల్కు అరోబిందో ఫార్మా ఫౌండేషన్ రూ.కోటి విరాళం
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

