Notification | రోస్టర్ పాయింట్లను సవరించిన తర్వాతనే అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ ఇవ్వాలి
Notification | కాకతీయ యూనివర్సిటీ లో త్వరలో విడుదల చేయనున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల నోటిఫికేషన్‌ను, రోస్టర్ పాయింట్లను శాస్త్రీయంగా సవరించిన తర్వాతనే జారీ చేయాలని మాల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని, యూనివర్సిటీ అధికారులను డిమాండ్ చేశారు.
హనుమకొండ చౌరస్తా : కాకతీయ యూనివర్సిటీ (KU ) లో త్వరలో విడుదల చేయనున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ (Assistant Professor ) నియామకాల నోటిఫికేషన్ ( Notification ) ను, ఎస్సీ వర్గీకరణలో భాగంగా రోస్టర్ పాయింట్లను శాస్త్రీయంగా సవరించిన తర్వాతనే జారీ చేయాలని మాల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని, యూనివర్సిటీ అధికారులను డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం మాల సంఘం ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.
మాల సంఘం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రప్రభుత్వం 2025 ఏప్రిల్ 14న తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణ చట్టం ప్రకారం రూపొందించిన రోస్టర్ విధానం వలన ఎస్సీ గ్రూప్-3 పరిధిలోని 26 మాల కులాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు రాష్ట్రప్రభుత్వం విడుదల చేసిన 25 వివిధ నోటిఫికేషన్లలో గ్రూప్-3లోని కులాలకు రావాల్సిన ఉద్యోగాలు దక్కలేదని, ఈ చట్టపరమైన లోపాలను సరిదిద్దాలని కోరుతూ 20 నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ రూపాలలో శాంతియుత ఉద్యమాలు చేస్తున్నామని వెల్లడించారు.
అయినప్పటికీ రోస్టర్ పాయింట్లలో తగిన సవరణలు చేయకుండా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి ముద్రవేయడం మాల కులాలకు వ్యతిరేకంగా జరుగుతున్న అన్యాయమే అవుతుందని నాయకులు హెచ్చరించారు. వినతిపత్రం అందజేసినవారిలో ఆల్ మాల స్టూడెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గుండు రాజేష్, కాంట్రాక్ట్ ప్రొఫెసర్ డాక్టర్ కర్రె సదాశివ, మాల సంఘాల సీనియర్ నాయకులు డాక్టర్ జెట్టి రాజేందర్, డాక్టర్ చందర్రావు, డాక్టర్ విష్ణువర్ధన్, చంద్రమౌళి, పీజీ స్టూడెంట్స్ అరుణ్ ఉన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Notification | రోస్టర్ పాయింట్లను సవరించిన తర్వాతనే అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ ఇవ్వాలి
Air Pollution | వాయు కాలుష్యానికి చెక్ పెడితే.. ఏటా 90 లక్షల ప్రాణాలను కాపాడొచ్చు.. అధ్యయనంలో వెల్లడి..
BSNL | బీఎస్ఎన్ఎల్ వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్స్.. స్టార్టింగ్ ప్లాన్ ధర ఎంతంటే..!
Traffic Challans | ట్రాఫిక్ చలాన్లలో సెంచరీ దాటేశాడు.. ఒకే బైక్‌పై ఎన్ని చలాన్లున్నాయో తెలుసా..?
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

