TTD | 8.34 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం.. సామాన్య భక్తులకు ప్రాధాన్యత : టీటీడీ
TTD | డిసెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు 8.34 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ సాధికారిక మండలి ఛైర్మన్ ముద్దాడ రవిచంద్ర తెలిపారు.
తిరుమల : తిరుమల ( Tirumala ) శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు 8.34 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం (Vaikuntha Dwara Darshan ) కల్పించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ సాధికారిక మండలి ఛైర్మన్ ముద్దాడ రవిచంద్ర తెలిపారు.
తిరుమల అన్నమయ్య భవనంలో బుధవారం సాయంత్రం టీటీడీ సాధికారిక మండలి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. వైకుంఠ ఏకాదశికి సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజులకు సంబంధించి ఎస్ఎస్డీ టోకెన్లను ఆన్ లైన్ లో విడుదల చేస్తామన్నారు. తొలి రెండు రోజులు సర్వ దర్శనం ఉండదని, తర్వాత 8 రోజులు భక్తులకు సర్వ దర్శనం అమలు చేస్తామని వివరించారు.
అలిపిరి–ఎస్.వి. జూ పార్క్ రోడ్డుకు సమీపంలోని టీటీడీ స్థలంలో రూ.2,750 కోట్ల శ్రీవాణి ట్రస్ట్ నిధులతో నిర్మించనున్న యాత్రికుల టౌన్షిప్ కోసం డీపీఆర్, డిజైన్ల తయారీ, ప్రాజెక్టు పర్యవేక్షణ కోసం కన్సల్టెన్సీ సంస్థను ఎంపిక చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయింపులో భాగంగా సీనియారిటీ జాబితా 2007 ఆధారంగా ఫేజ్-IIIలో రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి వారసులకు పల్లం గ్రామంలో ప్లాట్లు కేటాయించడానికి ఆమోదం తెలిపామని వివరించారు.
తిరుమలలో పారిశుద్యాన్ని మరింత మెరుగు పరచేందుకు అదనంగా 321 మంది పారిశుధ్య కార్మికులు, 27 మంది సూపర్ వైజర్లు కలిపి పొరుగు సేవల క్రింద మొత్తం 348 మంది అదనపు సిబ్బంది నియామకానికి మండలి ఆమోదించిందని తెలిపారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ కార్యదర్శి కె. కన్నబాబు, ఆర్థిక శాఖ కార్యదర్శి వి. వినయ్‌చంద్, టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, జేఈవోలు ,పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TTD | 8.34 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం.. సామాన్య భక్తులకు ప్రాధాన్యత : టీటీడీ
Bird flu | బర్డ్‌ఫ్లూ నియంత్రణకు తొలి స్వదేశీ టీకా.. ఈ నెల 20న దేశానికి అంకితం..!
Suicide Attempt | షాకింగ్ వీడియో .. ఐదంతస్తుల భవనంపై నుంచి దూకిన మహిళ
KTR | మీ మాటలు, మీరు చేసిన సాయమే నాకు స్ఫూర్తి.. కేటీఆర్‌తో చంద్రకాంత్ సాగర్.. వీడియో
Condolense | అచ్చా విద్యాసాగర్ మృతి పట్ల మాజీ ఎంపీ వినోద్ కుమార్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

