Man Throws Sons Into Canal | ఇద్దరు కుమారులను కాలువలోకి విసిరేసిన తండ్రి.. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై రాళ్ల దాడి
Man Throws Sons Into Canal | చాక్లెట్లు కొనిస్తానని చెప్పి ఒక వ్యక్తి తన ఇద్దరు పిల్లలను స్కూటర్‌పై కాలువ వద్దకు తీసుకెళ్లాడు. వారిని నీటిలోకి తోసేశాడు. అక్కడున్న కొందరు రైతులు అతడ్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిపై రాళ్లతో దాడి చేశాడు.
ముంబై: చాక్లెట్లు కొనిస్తానని చెప్పి ఒక వ్యక్తి తన ఇద్దరు పిల్లలను స్కూటర్‌పై కాలువ వద్దకు తీసుకెళ్లాడు. వారిని నీటిలోకి తోసేశాడు. అక్కడున్న కొందరు రైతులు అతడ్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిపై రాళ్లతో దాడి చేశాడు. కాలువలో గల్లంతైన పిల్లల కోసం ఈతగాళ్ల సహాయంతో పోలీసులు గాలిస్తున్నారు. (Man Throws Sons Into Canal) మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పైఠాన్ పట్టణానికి చెందిన 40 ఏళ్ల సోమనాథ్ దామోదర్ రోడ్గే దారుణానికి పాల్పడ్డాడు. సోమవారం సాయంత్రం తన ఇద్దరు కుమారులైన 7 ఏళ్ల ఆర్యన్, 5 ఏళ్ల శ్యామ్‌లకు చాక్లెట్లు, వడా పావ్ కొనిస్తానని చెప్పి స్కూటర్‌పై బయటకు తీసుకెళ్లాడు. కాలువలోకి వారిని విసిరేసేందుకు సిద్ధం కాగా, ఆ పిల్లలు భయంతో వణికిపోయారు. ‘నాన్నా, మేము చనిపోతాం, దయచేసి అలా చేయకండి’ అని వారు వేడుకున్నారు. ఏమాత్రం పట్టించుకోని సోమనాథ్ తన ఇద్దరు పిల్లలను కాలువలోకి తోసేశాడు.
కాగా, ఆ సమయంలో అక్కడ ఉన్న కొందరు రైతులు సోమనాథ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే అతడు వారిపై రాళ్లు రువ్వడంతో పాటు అసభ్య పదజాలంతో దూషించాడు. ఆ రైతులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడకు చేరుకున్నారు. ఇద్దరు కుమారులను కాలువలోకి విసిరేసిన తండ్రి సోమనాథ్‌ను అరెస్ట్ చేశారు. గల్లంతైన ఇద్దరు పిల్లల కోసం ఈతగాళ్ల సహాయంతో సోమవారం రాత్రి నుంచి ఆ కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇప్పటి వరకు వారి ఆచూకీ లభించలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Canal
- Cried
- Maharashtra
- MAN
RELATED ARTICLES
తాజా వార్తలు
Man Throws Sons Into Canal | ఇద్దరు కుమారులను కాలువలోకి విసిరేసిన తండ్రి.. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై రాళ్ల దాడి
Litton Das | టెస్టు క్రికెట్ చరిత్రలో బంగ్లాదేశ్ వికెట్ కీపర్ సరికొత్త రికార్డు..!
Professor Teja Sri | నా కూతురికి న్యాయం చేయండి.. అసిస్టెంట్ ప్రొఫెసర్ తేజశ్రీ తల్లి నిరాహార దీక్ష
TTD | 8.34 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం.. సామాన్య భక్తులకు ప్రాధాన్యత : టీటీడీ
Bird flu | బర్డ్‌ఫ్లూ నియంత్రణకు తొలి స్వదేశీ టీకా.. ఈ నెల 20న దేశానికి అంకితం..!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

