Litton Das | టెస్టు క్రికెట్ చరిత్రలో బంగ్లాదేశ్ వికెట్ కీపర్ సరికొత్త రికార్డు..!
Litton Das | టెస్టు క్రికెట్ చరిత్రలో బంగ్లాదేశ్ వికెట్ కీపర్ (Bangla Wicket Keeper) లిటన్ దాస్ (Litton Das) సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక ఔట్లలో భాగమైన వికెట్‌కీపర్‌గా అతడు ప్రపంచ రికార్డు (World Record) సృష్టించాడు.
Litton Das : టెస్టు క్రికెట్ చరిత్రలో బంగ్లాదేశ్ వికెట్ కీపర్ (Bangla Wicket Keeper) లిటన్ దాస్ (Litton Das) సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక ఔట్లలో భాగమైన వికెట్‌కీపర్‌గా అతడు ప్రపంచ రికార్డు (World Record) సృష్టించాడు. బుధవారం జోహన్నెస్‌బర్గ్ (Johannesburg) లో దక్షిణాఫ్రికా (South Africa) తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో లిటన్ దాస్ ఈ ఘనత సాధించాడు.
ఈ మ్యాచ్‌లో అతను ఆరు క్యాచ్‌లు, రెండు స్టంపింగ్‌లతో మొత్తం 8 ఔట్లలో బాగస్వామి అయ్యాడు. ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక మందిని ఔట్ చేసిన రికార్డు ఇప్పటివరకు పాకిస్థాన్‌కు చెందిన వసీం బారి, ఇంగ్లండ్ ఆటగాడు బాబ్ టేలర్, న్యూజిలాండ్ క్రికెటర్ ఇయాన్ స్మిత్‌ల పేరిట సంయుక్తంగా ఉంది. వారంతా ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో ఏడు ఔట్లలో భాగమయ్యారు. ఇప్పుడు లిటన్ దాస్ 8 ఔట్లలో భాగమై వారి రికార్డును బద్దలు కొట్టాడు.
ఈ మ్యాచ్‌లో లిటన్ దాస్ వికెట్‌కీపర్‌గానే కాకుండా బ్యాటర్‌గానూ సత్తాచాటాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతను 179 బంతులను ఎదుర్కొని 120 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 557, బంగ్లాదేశ్ 400 పరుగులకు ఆలౌటయ్యాయి. నాలుగో రోజైన బుధవారం ఆట ముగిసేసమయానికి రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 27/2 పరుగులతో ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Litton Das | టెస్టు క్రికెట్ చరిత్రలో బంగ్లాదేశ్ వికెట్ కీపర్ సరికొత్త రికార్డు..!
Professor Teja Sri | నా కూతురికి న్యాయం చేయండి.. అసిస్టెంట్ ప్రొఫెసర్ తేజశ్రీ తల్లి నిరాహార దీక్ష
TTD | 8.34 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం.. సామాన్య భక్తులకు ప్రాధాన్యత : టీటీడీ
Bird flu | బర్డ్‌ఫ్లూ నియంత్రణకు తొలి స్వదేశీ టీకా.. ఈ నెల 20న దేశానికి అంకితం..!
Suicide Attempt | షాకింగ్ వీడియో .. ఐదంతస్తుల భవనంపై నుంచి దూకిన మహిళ
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

