Vikram | క్యాటరింగ్ బిజినెస్ వెనుక అసలు కథేంటి .. చియాన్ విక్రమ్ ‘పవర్ హౌస్’ టైటిల్ గ్లింప్స్ అదుర్స్
Vikram | విభిన్నమైన కథలను ఎంచుకోవడంలో చియాన్ విక్రమ్‌ది ప్రత్యేకమైన శైలి. పాత్ర ఏదైనా అందులో పూర్తిగా ఒదిగిపోవడం ఆయనకు అలవాటు. తమిళంతో పాటు తెలుగులోనూ తన నటనతో ప్రత్యేక అభిమానులను సంపాదించుకున్న విక్రమ్.. మరో ఆసక్తికరమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
Vikram | విభిన్నమైన కథలను ఎంచుకోవడంలో చియాన్ విక్రమ్‌ది ప్రత్యేకమైన శైలి. పాత్ర ఏదైనా అందులో పూర్తిగా ఒదిగిపోవడం ఆయనకు అలవాటు. తమిళంతో పాటు తెలుగులోనూ తన నటనతో ప్రత్యేక అభిమానులను సంపాదించుకున్న విక్రమ్.. మరో ఆసక్తికరమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న 63వ చిత్రానికి ‘పవర్ హౌస్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా చిత్రబృందం విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. దాదాపు మూడున్నర నిమిషాల నిడివి ఉన్న ఈ గ్లింప్స్‌లో విక్రమ్‌ను తొలుత పూర్తిగా భిన్నమైన పాత్రలో చూపించి.. చివర్లో ఊహించని ట్విస్ట్‌తో అసలు కథపై ప్రశ్నలు రేకెత్తించారు.
‘పవర్ హౌస్’ గ్లింప్స్ ప్రారంభంలో విక్రమ్‌ను పెళ్లిళ్లకు క్యాటరింగ్ చేసే వ్యాపారిగా పరిచయం చేశారు. కుటుంబంతో కలిసి సాధారణ జీవితాన్ని గడిపే వ్యక్తిగా ఆయన కనిపిస్తారు. ఆయన కుమార్తె పాత్రలో ‘సర్వం మాయ’తో గుర్తింపు తెచ్చుకున్న రియా షిబు నటిస్తున్నారు. ప్రారంభ సన్నివేశాలను చూస్తే ఇదొక కుటుంబ కథా చిత్రమేమో అన్న భావన కలుగుతుంది. క్యాటరింగ్ వ్యాపారం, కుటుంబ సభ్యుల మధ్య జరిగే సన్నివేశాలతో కథ ప్రశాంతంగా సాగుతుంది. కానీ స్టోరేజ్ యూనిట్ వైపు విక్రమ్ వెళ్లిన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోతుంది. స్టోరేజ్ ప్రాంతంలోకి వెళ్లిన విక్రమ్ అక్కడ ఇద్దరు వ్యక్తులు బంధించబడి ఉన్న పరిస్థితిని గమనిస్తారు. వారి శరీరాల నుంచి వచ్చిన రక్తాన్ని శుభ్రం చేసే పనిలో ఆయన కనిపించడం గ్లింప్స్‌లో అసలు హైలైట్‌గా నిలిచింది.
ఇక్కడే సినిమాపై ఎన్నో ప్రశ్నలు మొదలవుతున్నాయి. అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? వారిని అక్కడ ఎందుకు బంధించారు? విక్రమ్ నిజంగా క్యాటరింగ్ వ్యాపారమే చేస్తుంటారా? లేక ఆయన జీవితంలో ఎవరికీ తెలియని మరో కోణం ఉందా? అనే విషయాలను చిత్రబృందం సస్పెన్స్‌గా ఉంచింది. గ్లింప్స్‌లో ఈ అంశాలకు సమాధానం ఇవ్వకుండా కథపై మరింత ఆసక్తి పెంచేలా సన్నివేశాలను కట్ చేయడం విశేషం. విక్రమ్‌తో గతంలో ‘ఇరు ముగన్’ వంటి చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ఆనంద్ శంకర్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. విక్రమ్‌ను మరోసారి కొత్త తరహా పాత్రలో చూపించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రంలో సీనియర్ నటి ఊర్వశి, వీటీవీ గణేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విక్రమ్‌తో పాటు వీరి పాత్రలు కూడా కథలో ప్రాధాన్యత కలిగి ఉండనున్నట్లు తెలుస్తోంది.. ‘పవర్ హౌస్’ను 2027లో థియేటర్లలో విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఖచ్చితమైన విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Land Scam | మాజీ డీజీపీ భూమికి ఎసరు.. 4.27 ఎకరాల పట్టాభూమి రియల్టర్ పేరు పైకి!
KTR | 5 లక్షల కోట్ల అవినీతి.. రేవంత్‌రెడ్డి దందాలను సొంత ఎమ్మెల్యేలే బయటపెడుతున్నరు: కేటీఆర్
Horoscope | 20-11-2026 శుక్రవారం.. మీ రాశి ఫలాలు
Revanth Reddy | ప్రజల సొమ్ముతో రేవంత్ ఫుట్‌బాల్..తనను కోసినా రూపాయిలేదన్న సీఎం వ్యాఖ్యలపై సెటైర్లు
Revanth Reddy | సీఎం సభ అట్టర్‌ఫ్లాప్.. రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తుండగానే సభ నుంచి వెళ్లిపోయిన జనం
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

