Allari Naresh | టాలీవుడ్ కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’ (Ramba Oorvasi Menaka). చంద్రమోహన్ చింతడ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో అల్లరి నరేష్ సరసన నలుగురు కథానాయికలు రాశిసింగ్, విష్ణు ప్రియా, సురభి, ప్రిషా సింగ్ నటిస్తున్నారు. తన వంశ పారపర్యంగా వచ్చిన కోరికల బుక్‌తో భుమి మీదకి రంభ, ఊర్వశి, మేనకలను పిలిచిన అనంతరం జరిగిన పరిణామలు ఏంటి అనేది ఈ సినిమా స్టోరీ.
ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios) బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమా పూర్తిగా వినోదాత్మక నేపథ్యంలో రూపొందుతోంది. విడుదలైన టీజర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తూ, అల్లరి నరేష్ మార్క్ కామెడీ ఎంటర్టైనర్గా ఉండబోతుందని స్పష్టం చేస్తోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 04న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.