Amit Rahul | ఢిల్లీ: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) ఎంపీ (లోక్‌సభ) సుప్రియా సూలే కూతురు రేవతి సూలే వివాహం నాగపూర్‌కు చెందిన పారిశ్రామికవేత్త సారంగ్ లఖానితో జూన్ నెలలో ముంబైలో జరిగింది. వివాహ విందు కార్యక్రమం జన్‌పథ్ 6లోని శరాద్ పవార్ నివాసంలో సోమవారం రాత్రి అత్యంత ప్రముఖుల మధ్య నిర్వహించారు.
ఈ వివాహ విందుకు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ, సమాజ్‌వాదీ పార్టీ (SP) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రఫుల్ పటేల్ హాజరయ్యారు. దీంతో ఈ విషయం దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. రాజకీయంగా ఎప్పుడూ మాటలతో యుద్ధంతో చేసే వీరు ఈ కార్యక్రమానికి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించడం విశేషం.

Amit Sha, Rahul