ఉన్నావ్: ఉత్తరప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు రూ. 36 వేల కోట్ల వ్యయంతో నిర్మించిన గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై నీరు నిలిచిపోయింది. ఉన్నావ్‌లో గంగా ఎక్స్‌ప్రెస్‌వేను పాత కాన్పూర్ రోడ్డు(ఎన్‌హెచ్ 27)తో కలిపే ఇంటర్‌చేంజ్‌లో సుమారు 50 మీటర్ల మేర నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు, పాదచారుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బషీరత్గంజ్ ఎగ్జిట్ టోల్ ప్లాజా సమీపంలో నాలుగు అడుగుల లోతు వరకు నీరు నిలిచింది.
దీంతో స్థానికులు అక్కడ వలలతో చేపలు పడుతున్న దృశ్యాలు కనిపించాయి. ఈ పరిస్థితి గంగా ఎక్స్‌ప్రెస్‌వేలోని డ్రైనేజీ వ్యవస్థపై పలు ప్రశ్నలు లేవనెత్తింది. దీంతో బీజేపీ సర్కార్‌పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే గంగా ఎక్స్‌ప్రెస్‌వే ప్రధాన క్యారేజ్‌వేపై నీటిముంపు ప్రభావం లేదని ఉత్తరప్రదేశ్ ఎక్స్‌ప్రెస్‌వేస్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ(యూపీఈఐడీఏ) తెలిపింది.