రాష్ట్ర ప్రయోజనాలు పట్టని రేవంత్
- అధిష్ఠానం మెప్పు కోసం రాష్ట్ర సీట్లను తాకట్టు పెడుతున్న ముఖ్యమంత్రి
- రాహుల్ ప్రతిపాదిత డీలిమిటేషన్‌కు వంత పాడుతూ రాష్ర్టానికి ద్రోహం
- చెన్నై సమావేశంలో ఒకమాట.. రాహుల్‌గాంధీ హిందీ ట్వీట్‌కు మద్దతుగా సీఎం మరో మాట
- నిన్నటి దాక తెలంగాణ నీళ్లు ఆంధ్రప్రదేశ్‌కు తాకట్టు.. నేడు చట్ట సభల సీట్లు బలిపెట్టు
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి పీఠాన్ని కాపాడుకోవడానికి, ఢిల్లీ అధిష్ఠానం ముందు తన విధేయతను నిరూపించుకోవడానికి రేవంత్‌రెడ్డి తెలంగాణ భవిష్యత్తునే పణంగా పెడుతున్నారు. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) వంటి చారిత్రాత్మక, అత్యంత సున్నితమైన అంశంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం గళమెత్తాల్సిన ముఖ్యమంత్రి, అందుకు విరుద్ధంగా రాహుల్‌గాంధీ ప్రతిపాదన ముందు మోకరిల్లిపోయారు. తెలంగాణకు గంపగుత్తగా 50 శాతం సీట్ల పెంపు వద్దు, 2027 జనాభాకు తగినట్టు వాటా తీసుకోవాలని రాహుల్‌గాంధీ చేసిన సిఫారసుకు రేవంత్‌రెడ్డి తల ఊపుతున్నారు. ఇప్పటిదాకా కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టి, గోదావరి జలాలను సడీచప్పుడు లేకుండా పొరుగు రాష్ట్రానికి వదిలేసిండు.
పల్నాడు ప్రాజెక్టు కడుతుంటే తెలిసి మౌనం దాల్చి తెలంగాణ రైతాంగం నోట్లో మట్టి కొట్టిండు. ఇప్పుడు ఏకంగా పార్లమెంటులో రాష్ట్ర ప్రాతినిధ్యానికే ఉరితాడు బిగించే కుట్రలో భాగస్వామిగా మారుతున్నారు. వ్యక్తిగత రాజకీయ ఎజెండా తప్ప, తెలంగాణ ఆత్మగౌరవం పట్ల ఏమాత్రం సోయిలేని రేవంత్‌రెడ్డి ఢిల్లీ కాళ్ల వద్ద రాష్ట్ర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే చారిత్రక ద్రోహానికి తెగబడ్డారు. రాహుల్‌గాంధీ శనివారం ఎక్స్ వేదికగా హిందీలో పెట్టిన ఒకే ఒక పోస్టుతో కాంగ్రెస్ పార్టీ అసలు కుట్ర బయటపెట్టింది. నిష్పక్షపాత డీలిమిటేషన్ ఎలా ఉండాలో వివరిస్తూ ఆయన లోక్‌సభ స్థానాలను 850కి పెంచకూడదని, కేవలం 543 సీట్లనే కొనసాగించాలని పట్టుబట్టారు. అదే సమయంలో 2011 జనాభా లెకలకు బదులుగా 2027లో నిర్వహించే కులగణన, జనాభా లెకల ఆధారంగా పునర్విభజన జరగాలని డిమాండ్ చేశారు.
దక్షిణ భారతీయులకు హిందీ సరిగ్గా అర్థం కాదనే ఉద్దేశంతోనే ఆయన ఈ పోస్టును హిందీలో పెట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైకి సామాజిక న్యాయం అన్నట్టు కనిపిస్తున్న ఈ వాదన వెనుక దక్షిణాది రాష్ట్రాల గొంతు కోసే అత్యంత ప్రమాదకరమైన గణిత సూత్రం దాగి ఉన్నదని రాజకీయ పరిశీలకులు అందోళన వ్యక్తంచేస్తున్నారు. భారతదేశ జనాభా గణాంకాలను శాస్త్రీయంగా పరిశీలిస్తే.. 1971 జనాభా లెకల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కుటుంబ నియంత్రణ పిలుపును దక్షిణ భారత రాష్ట్రాలు అత్యంత బాధ్యతాయుతంగా అమలు చేశాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు విద్య, వైద్యం, మహిళా సాధికారతపై దృష్టి సారించి జనాభా వృద్ధి రేటును విజయవంతంగా నియంత్రించాయి. 1971లో దేశ జనాభాలో దక్షిణ భారత రాష్ట్రాల వాటా సుమారు 25 శాతంగా ఉండగా, నేడు అది 20 శాతం కంటే తకువకు పడిపోయింది. దీనికి పూర్తి భిన్నంగా ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి ఉత్తరాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను విస్మరించడంతో అకడ జనాభా భారీగా పెరిగిపోయింది.
రాహుల్‌ది దక్షిణాదిని ముంచే ఎత్తుగడ
ఇప్పుడు రాహుల్‌గాంధీ కోరుతున్నట్టు లోక్‌సభ స్థానాలను 543 వద్దే పరిమితం చేసి, 2027 జనాభా లెకల ప్రకారం పునర్విభజన చేపడితే జనాభా పెరిగిన ఉత్తరాది రాష్ట్రాలకు సీట్లు భారీగా పెరుగుతాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 ప్రకారం ప్రతి నియోజకవర్గంలో జనాభా నిష్పత్తి సమానంగా ఉండాలి కాబట్టి, మొత్తం సీట్లు 543 వద్దే ఉన్నప్పుడు ఉత్తరాదికి పెరిగే ప్రతి సీటూ దక్షిణాది రాష్ట్రాల ఖాతాల్లోంచి కోత పడాల్సిందే. దీనివల్ల దక్షిణ భారతదేశం మొత్తం మీద కనీసం 25 నుంచి 30కి పైగా లోక్‌సభ స్థానాలను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇందులో తెలంగాణకు జరిగే నష్టం మరింత తీవ్రం.
ప్రస్తుతం తెలంగాణకు ఉన్న 17 ఎంపీ స్థానాల్లో కనీసం 3 నుంచి 4 సీట్లు శాశ్వతంగా తగ్గిపోయే దుస్థితి ఏర్పడుతుంది. దక్షిణాది రాష్ట్రాలకు జరగబోయే ఈ చారిత్రక అన్యాయాన్ని గుర్తించిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఇప్పటికే చెన్నై వేదికగా దక్షిణాది రాష్ట్రాల నేతలతో కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. 1971 జనాభా లెకల ప్రాతిపదికనే సీట్ల నిష్పత్తి ఉండాలని, ప్రస్తుత జనాభా ఆధారంగా పునర్విభజన జరిపి దక్షిణాది సీట్లకు కోత పెట్టడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తమిళనాడు, కేరళ, కర్ణాటక నేతలు స్పష్టమైన వైఖరి తీసుకున్నారు.
నిన్నటి దాక నీళ్ల కుట్ర.. ఇప్పుడు సీట్ల కుతంత్రం
రేవంత్‌రెడ్డి పాలనలో తెలంగాణ ప్రయోజనాలు తాకట్టుకు గురికావడం ఇదే మొదటిసారి కాదు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ఆయన తెలంగాణ జీవనాడి అయిన కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా ఎండబెట్టి, రాష్ట్ర రైతాంగాన్ని సంక్షోభంలోకి నెట్టారు. మరోవైపు కృష్ణా నదీ జలాల విషయంలోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దాసోహమంటూ తెలంగాణ హకులను కాలరాస్తున్నారు. పొరుగు రాష్ట్రం అక్రమంగా ప్రాజెక్టులు కడుతున్నా, కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయకుండా మౌన ప్రేక్షకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు అత్యంత స్పష్టమైన నిదర్శనం కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పల్నాడు వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు. ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచి, ఏడాది కాలంగా పనులు చేస్తున్నా తెలంగాణ ప్రభుత్వం కండ్లు మూసుకుని నిద్రపోయింది. నిజానికి ఇదంతా ఆంధ్రప్రదేశ్ నాయకత్వంతో రేవంత్‌రెడ్డి చేసుకున్న రహస్య ఒప్పందంలో భాగమేనని, అందుకే పల్నాడు ప్రాజెక్టు విషయంలో ఏడాది పాటు మౌనం వహించి సహకరించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నీళ్ల విషయంలో తెలంగాణ నోట్లో మట్టి కొట్టినట్టే, ఇప్పుడు చారిత్రాత్మక డీలిమిటేషన్ విషయంలోనూ రేవంత్‌రెడ్డి అదే ద్రోహానికి ఒడిగడుతున్నారు. 1976లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ, 2001లో వాజపేయి ప్రభుత్వం జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోకూడదనే ఉదాత్త ఆశయంతో డీలిమిటేషన్‌పై నిషేధం విధించారు.
నేడు ఆ రక్షణ కవచాన్ని తొలగిస్తూ రాహుల్‌గాంధీ 2027 జనాభా లెకల ప్రకారం 543 సీట్ల పునర్విభజన చేయాలని పట్టుబడుతుంటే, తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి దానిని గట్టిగా వ్యతిరేకించాలి. కానీ అందుకు భిన్నంగా రాహుల్ ప్రతిపాదనలకు మడుగులు ఒత్తుతూ తెలంగాణకు దకాల్సిన ఎంపీ సీట్లను ఉత్తరాదికి ధారాదత్తం చేసేందుకు సిద్ధపడటం క్షమించరాని నేరం. పదవి కోసం సొంత రాష్ట్ర ప్రయోజనాలను బలిపెట్టే నాయకత్వం తెలంగాణకు ఎంత ప్రమాదకరమో రేవంత్‌రెడ్డి చర్యలు కండ్లకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. అటు నీటి వాటాలను ఆంధ్రప్రదేశ్‌కు వదిలేసి, ఇటు పార్లమెంటు సీట్లను ఉత్తర భారతదేశానికి తాకట్టు పెడుతూ తెలంగాణను రాజకీయంగా, ఆర్థికంగా బలహీనపరిచే కుట్రకు ముఖ్యమంత్రి వంత పాడుతున్నారు. రాష్ట్ర హకులను కాలరాస్తూ, భవిష్యత్తు తరాల ప్రాతినిధ్యాన్ని దెబ్బతీస్తున్న ఈ ద్రోహపూరిత రాజకీయాలకు తెలంగాణ ప్రజలు తగిన సమయంలో గట్టి బుద్ధి చెప్పడం ఖాయం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
చెన్నై సమావేశంలో తొడగొట్టి
అప్పట్లో జరిగిన జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశానికి తెలంగాణ నుంచి సీఎం రేవంత్‌రెడ్డితోపాటు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాల్గొని దక్షిణాది హకుల కోసం గళమెత్తారు. ఆ వేదికపై కేటీఆర్ మాట్లాడుతూ, కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసి దేశాభివృద్ధిలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలను జనాభా ప్రాతిపదికన సీట్లు తగ్గించి శిక్షించడం అన్యాయమని స్పష్టంచేశారు. అదే సమావేశంలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి కూడా నాడు దక్షిణాది రాష్ట్రాల ఐక్యతకు, సీట్ల రక్షణకు మద్దతుగా నిలిచినట్టు నటించారు. కానీ, ఇప్పుడు పరిణామాలు మారగానే కేటీఆర్ తన తొలి నాటి వైఖరికే కట్టుబడి దక్షిణాది ప్రయోజనాలను కాపాడే బిల్లును సమర్థిస్తుండగా, రేవంత్‌రెడ్డి మాత్రం ఢిల్లీ అధిష్ఠానం ఒత్తిడికి తలొగ్గి రాహుల్‌గాంధీ ప్రతిపాదించిన 2027 జనాభా ఆధారిత డీలిమిటేషన్‌కు వంత పాడుతూ, చెన్నై వేదికపై తాను చేసిన వాగ్దానాలకు తానే తూట్లు పొడుస్తున్నారు. జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరిగితే తెలంగాణ తీవ్రంగా నష్టపోతుందని తెలిసి కూడా, కేవలం తన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడానికి, రాహుల్‌గాంధీ మెప్పు పొందడానికి రేవంత్‌రెడ్డి ఈ కుట్రలో భాగస్వామిగా మారారు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

