ఇది కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన కరువు
- సాగునీటి ప్రాజెక్టులపై గోబెల్స్ ప్రచారం
- ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ తొండిమాటలు
- మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజం
- జనగామలో సాగునీటిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్
సమ్మక బరాజ్ వద్ద 1,456 టీఎంసీల వరద వచ్చినా..35 టీఎంసీలు ఎత్తే సామర్థ్యం ఉన్న దేవాదులలో కేవలం 15 టీఎంసీలే ఎత్తి, 20 టీఎంసీలు చంద్రబాబుకు వదిలిపెట్టి గురుదక్షిణ చెల్లించుకున్నారు. కాళేశ్వరం కూలిపోయిందన్న రేవంత్‌రెడ్డి, 11 నియోజకవర్గాలకు మల్లన్నసాగర్ నీళ్లు, మూసీకి రూ.8వేల కోట్లతో పైప్‌లైన్ ఎందుకు వేస్తున్నారు. రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతే కరువు మండలాలు ప్రకటించి చేతులు దులుపుకొన్నారే తప్ప ఒక రూపాయి సాయం చేయలే. వారానికో మీటింగ్ పెడుతూ ఒకో మీటింగ్‌కు రూ.50 కోట్లు ఖర్చు చేస్తున్నారు. సిద్దిపేట మీటింగ్ కోసం 500 కోట్లు వృథా చేశారు.
– హరీశ్‌రావు
నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా తెలంగాణకు, ఏఎంఆర్ ఎస్ఎల్ బీసీ ద్వారా నల్లగొండ జిల్లాకు సాగు, తాగునీరు అందుతున్నది. హైదరాబాద్‌కు సగం మంచినీళ్లు సాగర్ నుంచే వస్తాయి. అలాంటి జాయింట్ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొక కొట్టి జనవరిలో టెండర్లు పిలిచి పల్నాడు వాటర్‌గ్రిడ్ పనులు మొదలుపెట్టినా రేవంత్‌కు సోయిలేదు.
– హరీశ్‌రావు
జనగామ, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో వచ్చింది కాలం తెచ్చిన కరువు కాదని.. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని తెచ్చిన కరువు అని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. గోదావరిలో వృథాగా దిగువకు పోతున్న నీటిని ఎత్తిపోయకుండా కుంటిసాకులతో కాలయాపన చేసి రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌రెడ్డి మైండ్ దొబ్బి తొండిమాటలతో గోబెల్స్ ప్రచారం చేస్తున్నాడని దుయ్యబట్టారు.
ఆదివారం జనగామలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన దీక్షా దివస్ సభలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో కలిసి పాల్గొన్న ఆయన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా పార్టీ శ్రేణులకు సవివరంగా చెప్పి అవగాహన కల్పించారు.
రైతులకు కరువు.. రేవంత్‌కు కమీషన్లు
రాష్ట్రంలో రైతులకేమో కరువు, రేవంత్‌రెడ్డికి కమీషన్ల పంట పండుతున్నదని హరీశ్‌రావు ఆరోపించారు. దేవాదుల మోటర్లు ఆన్‌చేసి నీటిని ఎత్తిపోయకుండా లేని కరువును ఉమ్మడి వరంగల్ జిల్లా రైతాంగంపై రుద్దిన రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో గుడ్డెద్దు పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. గోదావరి నీళ్లను మూసీలో పోసి ప్రక్షాళన చేయాలన్నది కేసీఆర్ ఆలోచన అని.. ఇప్పుడు కొత్తగా రేవంత్‌రెడ్డి చేసింది కాదని చెప్పారు. సమ్మక బరాజ్ వద్ద 1,456 టీఎంసీల వరద వచ్చినా..35 టీఎంసీలు ఎత్తే సామర్థ్యం ఉన్న దేవాదులలో కేవలం 15 టీఎంసీలే ఎత్తి, 20 టీఎంసీలు చంద్రబాబుకు వదిలిపెట్టి గురుదక్షిణ చెల్లించుకున్నారని ఆరోపించారు.
కాళేశ్వరం కూలిపోయిందన్న రేవంత్‌రెడ్డి 11 నియోజకవర్గాలకు మల్లన్నసాగర్ నీళ్లు, మూసీకి రూ.8వేల కోట్లతో పైప్‌లైన్ ఎందుకు వేస్తున్నారని ప్రశ్నించారు. మిడ్ మానేరుకు కాళేశ్వరం నీళ్లు తెచ్చి ఉంటే ఎస్సారెస్పీ కింద వరంగల్ సహా 13 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగేదని, నాగార్జునసాగర్‌కు ఏపీ పొక కొట్టి పల్నాడు లిఫ్ట్ కడుతుంటే రేవంత్ మొద్దునిద్ర పోయాడని విమర్శించారు.
కాంగ్రెస్ సర్కార్ అబద్ధాలను ప్రచారం చేసుకునేందుకే గోబెల్స్ సమ్మిట్ ఏర్పాటు అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతే కరువు మండలాలు ప్రకటించి చేతులు దులుపుకొన్నారు తప్ప ఒక రూపాయి సాయం చేయలేదని తెలిపారు. వారానికో మీటింగ్ పెడుతూ ఒకో మీటింగ్‌కు రూ.50 కోట్లు ఖర్చు చేస్తున్నాడని ఆరోపించారు. సిద్దిపేట మీటింగ్ కోసం రూ. 500 కోట్లు తగలేసిండని మండిపడ్డారు.
అవకాశంఉన్నా..నీళ్లు ఎత్తలేదు..

దేవాదుల మూడు ఫేజుల్లోని 10 మోటర్ల ద్వారా రోజుకు 2,600 క్యూసెకుల చొప్పున 6.9 టీఎంసీల నీళ్లు ఎత్తుకునే అవకాశం ఉన్నా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కనీసం స్విచ్ ఆన్ చేసి చుక నీరు ఎత్తలేదని హరీశ్‌రావు ఆరోపించారు. కరువు ముంచుకొస్తున్నదని దివంగత పెద్ది సుదర్శన్‌రెడ్డి , వరంగల్ నాయకులు వచ్చి తనతోపాటు హైదరాబాద్ తెలంగాణ భవన్లో ప్రెస్‌మీట్ పెట్టి నిలదీసినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని మండిపడ్డారు. కరెంట్ బిల్లు కట్టాల్సి వస్తుందనే కకుర్తితో కేవలం 15 టీఎంసీలే ఎత్తిపోశారని, మిగిలిన 20 టీఎంసీల నీళ్లను తన గురువు చంద్రబాబు కోసం కిందికి వదిలేశాడని ఆరోపించారు.
20 టీఎంసీలు ఎత్తి ఉంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో వానకాలం పంట ఎండేది కాదని, యాసంగి పంట కూడా బ్రహ్మాండంగా పండేదని వెల్లడించారు. కరువు వచ్చినా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు ఎత్తే అవకాశం ఉన్నదని రిటైర్డ్ ఇంజినీర్లు ప్రభుత్వానికి లేఖ రాశారని గుర్తుచేశారు. మేడిగడ్డ బరాజ్‌లో రెండు పిల్లర్లు కుంగి గేట్లు తెరిచి ఉంచినా సరే, గోదావరి నదిలో 20 వేల క్యూసెకులకు పైగా వరద ప్రవహిస్తే సహజంగానే నీటి మట్టం 93 మీటర్ల కంటే పైకి చేరుతుందని, అప్పుడు గేట్లు మూయాల్సిన అవసరం లేకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ మోటర్ల ఫుట్ వాల్వ్‌లకు నీళ్లు అందుతాయని వివరించారు.
ఈ ఏడాది ఐదు నెలల పాటు నదిలో 20 వేల నుంచి 10 లక్షల క్యూసెకుల వరద పారినా మోటర్లు ఆన్ చేయలేదని మండిపడ్డారు. అన్నారం, సుందిళ్ల బరాజ్ సురక్షితంగా ఉన్నాయని, వాటి గేట్లు మూసి నీళ్లు ఎత్తవచ్చని సీడబ్ల్యూపీఆర్ఎస్ నివేదిక ఇచ్చిందని తెలిపారు. 18 రిజర్వాయర్లు, 200 కిలోమీటర్ల టన్నెళ్లు, 1,400 కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు, 18 పంప్ హౌస్‌లు, 18 సబ్ స్టేషన్లతో 99 శాతం కాళేశ్వరం వ్యవస్థ పటిష్టంగా ఉన్నదని చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కింద 18.31 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు 18.61 లక్షల ఎకరాల స్థిరీకరణతో మొత్తం 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నదని, కాళేశ్వరం నీళ్లను మిడ్ మానేరుకు తెచ్చి అకడి నుంచి ఎస్సారెస్పీ కాలువలకు వదిలితే, వరంగల్ జిల్లాలోని కమలాపూర్, జమ్మికుంట, వరంగల్ వెస్ట్, నర్సంపేట, భూపాలపల్లి ప్రాంతాల్లోని 13 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగేదని పేర్కొన్నారు.
మేడిగడ్డ వద్ద 8,190 క్యూసెకుల నీళ్లు వృథాగా కిందికి పోతున్నాయని, కాపర్ డ్యామ్ గానీ, రబ్బర్ డ్యామ్ గానీ వేసి ఉంటే ఆ నీటిని ఆపి మోటర్లతో ఎత్తిపోసే అవకాశం ఉండేదని చెప్పారు. సకాలంలో నీళ్లు ఎత్తకపోవడం వల్ల మల్లన్నసాగర్ నిండక హైదరాబాద్‌లో తాగునీటి కరువు మొదలైందని, హైదరాబాద్‌లోని ఒక గేటెడ్ కమ్యూనిటీలోని 4వేల అపార్ట్మెంట్లకు రాబోయే నాలుగైదు నెలలు నీళ్లు ఉండవని జలమండలి నోటీసులు ఇచ్చిందని చెప్పారు. నీళ్లు లేక కొందరు ఊర్లకు వెళ్లిపోతుంటే, అమెరికా నుంచి రావాల్సిన వాళ్లు వానకాలం వచ్చాకే వస్తామని ఆగిపోతున్నారని చెప్పారు.
కాళేశ్వరం కూలిపోయిందని, లక్ష కోట్లు కొట్టుకుపోయాయని పచ్చి అబద్ధాలు చెబుతున్న ముఖ్యమంత్రి మరి కాళేశ్వరమే కూలిపోతే నేడు జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్, మేడ్చల్, దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్ సహా 11 నియోజకవర్గాల ప్రజలు తాగుతున్న మల్లన్నసాగర్ నీళ్లు ఎకడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. కూలిపోయిన కాళేశ్వరంలోని మల్లన్నసాగర్ నుంచే గజ్వేల్, ప్రజ్ఞాపూర్, శామీర్‌పేట మీదుగా హైదరాబాద్ మూసీకి రూ.8వేల కోట్లు ఖర్చు పెట్టి పైప్ లైన్ ఎందుకు వేస్తున్నారు? దీన్నిబట్టే కాళేశ్వరం కూలలేదని, రేవంత్ మైండ్ దొబ్బిందని అర్థమవుతున్నదని పేర్కొన్నారు. కృష్ణా నదిలో జూరాల, శ్రీశైలం మీదుగా నాగార్జునసాగర్‌కు నీళ్లు వస్తాయని, ఉమ్మడి రాష్ట్రంలో పోతిరెడ్డిపాడు ద్వారా రోజుకు 88 వేల క్యూసెకులు రాయలసీమకు తరలించుకుపోయి అన్యాయం చేశారని మండిపడ్డారు.
కేసీఆర్ దూరదృష్టితో సమ్మక్క బరాజ్…
కేసీఆర్ దూరదృష్టితో సమ్మక బరాజ్‌ను నిర్మించారని హరీశ్‌రావు తెలిపారు. దేవాదుల ఫేజ్-1 (5 టీఎంసీలు), ఫేజ్-2 (12 టీఎంసీలు), ఫేజ్-3 (25 టీఎంసీలు) కలిపి మొత్తం 42 టీఎంసీల నీళ్లు తెచ్చేలా ప్రాజెక్టును తీర్చిదిద్దారని చెప్పారు. దేవాదుల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏండ్లలో రూ.6,338 కోట్లు ఖర్చు చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం మూడేండ్లలో పెట్టింది రూ.595 కోట్లు మాత్రమే అని వివరించారు.
భూసేకరణలో బీఆర్ఎస్ ప్రభుత్వం 6,231 హెక్టార్లు సేకరిస్తే, కాంగ్రెస్ కేవలం 739 ఎకరాలు సేకరించిందని చెపారు. 2001 నుంచి 2014 వరకు 13 ఏండ్ల టీడీపీ, కాంగ్రెస్ పాలనలో దేవాదుల కింద 45వేల ఎకరాలకు మాత్రమే నీళ్లిచ్చారని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏండ్లలో 2.71 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది 16వేల ఎకరాలకు మాత్రమే అని పేర్కొన్నారు.
ఏపీ దోపిడీ చేస్తున్నా.. మొద్దునిద్ర
నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా తెలంగాణకు, ఏఎంఆర్ ఎస్ఎల్ బీసీ ద్వారా నల్లగొండ జిల్లాకు సాగు, తాగునీరు అందుతున్నదని, హైదరాబాద్‌కు సగం మంచినీళ్లు సాగర్ నుంచే వస్తాయని హరీశ్‌రావు లిపారు. అలాంటి జాయింట్ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొక కొట్టి, జనవరి 2026లో టెండర్లు పిలిచి పల్నాడు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు మొదలుపెట్టిందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం, కేంద్రం అనుమతి లేకుండా ఆంధ్రప్రదేశ్ అక్రమంగా ప్రాజెక్టు కడుతుంటే సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి నిలదీశాక రేవంత్‌రెడ్డి హడావుడిగా 16వ తేదీతో బ్యాక్ డేట్ వేసి ఢిల్లీకి లేఖ రాశారని చెప్పారు. తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి 2022 నాటి జీవో 56 చూపిస్తూ కేసీఆర్ హయాంలోనే అనుమతి ఇచ్చారని రేవంత్ బురదజల్లే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక, 04.08.2026న ఏపీ ప్రభుత్వం జీవో 453 ద్వారా నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి 1.865 టీఎంసీల నీటిని నేరుగా తోడుకునేందుకు అనుమతి ఇచ్చిందని ఆరోపించారు.
రేవంత్‌కు సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష
నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించి, 11 రోజుల పాటు దీక్ష చేసి ఢిల్లీ మెడలు వంచడం వల్లే తెలంగాణ వచ్చిందని గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డికి ముఖ్యమంత్రి పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అని తెలిపారు. ఉద్యమకారులపై తుపాకీ గురిపెట్టిన తెలంగాణ ద్రోహి రేవంత్‌రెడ్డి అని మండిపడ్డారు.
కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి, జేఏసీ ఏర్పాటు చేసి, తెలంగాణను సాధించారని పేర్కొన్నారు. పరిపాలనా దక్షతతో రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపారని వెల్లడించారు. రేవంత్‌రెడ్డి మూడేండ్ల పాలనలో మళ్లీ రైతుల ఆత్మహత్యలు, కరెంట్ కోతలు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

