క్రిమినల్ వేస్ట్ అంటూనే సీట్ల పెంపు !
- ఇంజినీరింగ్ విద్యపై ముఖ్యమంత్రి మాటలకు చేతలకు పొంతన కరువు
- సీఎస్ఈ వద్దంటూనే కొత్త సీట్లకు అనుమతులు
- 10శాతం మందికీ ఉద్యోగాలు వస్తలేవన్నప్పుడు కొత్త సీట్లకు అనుమతి ఇవ్వడం ఎందుకు?
- రేవంత్ తీరుపై విద్యారంగ నిపుణుల విస్మయం
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ) : ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు క్రిమినల్ వేస్ట్. ఏటా 1.10 లక్షల మంది పట్టాలు పొందుతున్నా.. దరఖాస్తు కూడా రాయలేకపోతున్నారు. 10శాతం మందికి కూడా ఉద్యోగాలు దక్కడం లేదు. కేవలం కంప్యూటర్ సైన్స్‌పైనే దృష్టిపెట్టకుండా సివిల్, మెకానికల్ కోర్సులను ప్రోత్సహించాలి. ఏటా 10-20వేల సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. ఇంజినీరింగ్ కాలేజీలు నిరుద్యోగులను తయారుచేసే ఫ్యాక్టరీలుగా మారిపోయాయి. ఇవి పలు సందర్భాల్లో ఇంజినీరింగ్ విద్యపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు. అయితే సీఎం మాటలకు.. సర్కార్ చేతలకు పొంతన ఉండటం లేదు. ఒకవైపు సీఎస్ఈ కోర్సుల్లో అవసరానికి మించి సీట్లున్నాయని అంటూనే.. మరోవైపు అదే కోర్సుల్లో కొత్త సీట్లకు అనుమతులిస్తున్నారు. ఇంజినీరింగ్‌లో అడ్డగోలుగా సీట్లు పెంచుతున్నారు.
మూడేండ్లలో 7,067 సీట్ల పెంపు
రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల పెంపు జోరు కొనసాగుతున్నది. 2024-25లో 87,184గా ఉన్న సీట్ల సంఖ్య 2025-26లో 91,909కి చేరింది. 2026-27 నాటికి మరో 2,342 పెరిగి 94,251కి చేరుకున్నది. మూడేండ్లలోనే 7,067 సీట్లు పెరిగాయి. కానీ తదనుగుణంగా ప్రవేశాలు పెరుగకపోగా.. భర్తీ శాతం క్రమంగా పడిపోతున్నది. 2024లో 91 శాతం సీట్లు భర్తీ కాగా.. 2025లో 86 శాతానికి, 2026లో ఏకంగా 79శాతానికి పడిపోయింది. 2024లో 79,224 మంది చేరగా.. 2026లో 74,510 మందే చేరారు.
మాటలకు చేతలకు పొంతనేది?
సీఎస్ఈలో ఇప్పటికే అధికంగా సీట్లు ఉన్నాయని, మారెట్ అవసరాలకు మించి కోర్సులను ప్రారంభిస్తే విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎస్ఈ, ఐటీ బ్రాంచీల్లో 2024లో 61,653 సీట్లుండగా, 2026కు వచ్చేసరికి 66,372కు పెరిగాయి. దాదాపు ఐదు వేల సీట్లు ఒక్క సీఎస్ఈలోనే పెరిగాయి. ఒకవైపు సీఎస్ఈ వద్దు అంటూనే.. మరోవైపు అదే కోర్సుల్లో కొత్త సీట్లకు అనుమతులు ఇవ్వడం విధానపరమైన వైరుధ్యాన్ని బయటపెడుతున్నది.
ఎవరిని రోడ్డుమీద వేసేందుకు..
పది శాతం మందికి ఉద్యోగాలు లభించని కోర్సుల్లో సీట్లు పెంచడం ఎందుకనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కొంతకాలం క్రితం సీట్లపై సర్కార్ ఏకంగా సీలింగ్ విధించింది. తర్వాత మళ్లీ ఎప్పటిలాగే గేట్లు తెరిచింది. ఇంజినీరింగ్‌లో సీట్లు పెంచడం కంటే విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం కీలకమని నిపుణులు సూచిస్తున్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు, ఆధునిక ప్రయోగశాలలు, అర్హత కలిగిన అధ్యాపకులు, ఇంటర్న్‌షిప్‌లు, పరిశోధన అవకాశాలు కల్పించకుండా కొత్త కోర్సులు, సీట్లకు అనుమతులు ఇవ్వడం వల్ల ఎంతమాత్రం ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వం ఈ దిశగా సంస్కరించాలని కోరుతున్నారు.
సీట్ల భర్తీ వివరాలిలా..
సంవత్సరం సీఎస్ఈ ఎలక్ట్రానిక్స్, సివిల్, ఇతర మొత్తం
ఐటీ ఎలక్ట్రికల్ మెకానికల్
2024 61,653 1 6,739 7,412 1,380 87,184
2025 65,143 17,800 7,629 1,337 91,909
2026 66,372 18,806 7,826 1,247 94,251
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

