బర్రెలకూ అవినీతి బురద!
మహిళలను కోటీశ్వరులను చేస్తామంటూ కాంగ్రెస్ సర్కార్ ప్రకటించిన ‘ఇందిరమ్మ మహిళా శక్తి డెయిరీ’ పథకం ఆదిలోనే అవినీతి ఊబిలో కూరుకుపోతున్నది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎమ్మెల్సీతో కలిసి తెలంగాణకు చెందిన ఓ మంత్రి కమీషన్ల దందాకు తెరతీశారు.
- ‘ఇందిరమ్మ డెయిరీ’ స్కీమ్‌లో కోట్లలో స్కామ్
- బర్రెల సప్లయ్‌లో ఆంధ్రా కాంట్రాక్టర్ పెత్తనం
- రూ.80 వేల బర్రెకు రూ.1.2 లక్షల బిల్లు
- లబ్ధిదారు నుంచి మరో 30 వేలు వసూలు
- నాసిరకం సరఫరా.. తిరిగి 65 వేలకే కొనుగోలు
- సీఎం, డిప్యూటీ సీఎం ఇలాకాల్లో బాగోతం
- ఓ మంత్రి, ఏపీ ఎమ్మెల్సీ.. కమీషన్ల దందా
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): మహిళలను కోటీశ్వరులను చేస్తామంటూ కాంగ్రెస్ సర్కార్ ప్రకటించిన ‘ఇందిరమ్మ మహిళా శక్తి డెయిరీ’ పథకం ఆదిలోనే అవినీతి ఊబిలో కూరుకుపోతున్నది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎమ్మెల్సీతో కలిసి తెలంగాణకు చెందిన ఓ మంత్రి కమీషన్ల దందాకు తెరతీశారు. ఆంధ్రాకు చెందిన కాంట్రాక్టర్‌తో కూడబలుక్కుని, స్థానిక పశువైద్యాధికారులను చెప్పుచేతల్లో పెట్టుకొని బర్రెల కొనుగోళ్లలో అక్రమాలు, రీసైక్లింగ్ దందాకు తెరతీశారు.
దీంతో బర్రెల పంపిణీ, యూనిట్ల ఏర్పాటు కాగితాల మీదనే తప్ప ఆచరణలో ఎక్కడా కనిపించడం లేదు. వాస్తవ ధరల కంటే అధిక ధరకు, అదీ నామమాత్రపు సంఖ్యలో బర్రెలను సప్లయ్ చేస్తూ, తిరిగి అవే బర్రెలను అతి తక్కువ ధరలకు అదే సప్లయర్ కొనుగోలు చేస్తున్నారు. వెరసి లబ్ధిదారులు రూ.లక్షల్లో నష్టపోతున్నారు. అక్రమాలు వెలుగుచూస్తు న్నా మంత్రి అండదండలుండటంతో ఉన్నతాధికారులు సైతం మౌనం వహిస్తున్నారు. సీఎం, డిప్యూటీ సీఎంల ఇలాకాల్లోనే ఈ దందా యథేచ్ఛగా కొనసాగుతుండటం గమనార్హం.
సీఎం, డిప్యూటీ సీఎం ఇలాకాల్లోనే అవినీతి
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు చెందిన 20 వేల మంది ఈ పథకంలో రూ.2,100 చొప్పున చెల్లించి సభ్యులుగా చేరారు. ఆ 20వేల మందికి విడతల వారీగా 40 వేల బర్రెలను అందించాల్సి ఉన్నది. ఇక్కడే అవినీతి దందాకు తెరతీశారు. ఒక్కో లబ్ధిదారుకు రెండు బర్రెలను అందించాలి. వాటిని గరిష్ఠంగా రూ.80 వేలకు కొనుగోలు చేయాలి. క్షేత్రస్థాయిలో సప్లయ్దారులు మాత్రం ఒక్కో బర్రెకు అదనంగా రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు వసూలు చేస్తున్నారు.
లేదంటే బర్రెలను ఇచ్చేది లేదని చెప్తున్నారని తెలుస్తున్నది. అనంతరం ట్యాగ్ వేసి తీసుకొనిరావడం, అనంతరం మళ్లీ వాటినే సదరు సప్లయ్దారుడే సదరు లబ్ధిదారుల నుంచి రూ.65 వేల కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయడం, ట్యాగ్‌ను తొలగించి తిరిగి మరో లబ్ధిదారుకు వాటినే సరఫరా చేయడం పరిపాటిగా మారింది. సూటిగా చెప్పాలంటే రీ సైక్లింగ్ దందా కొనసాగుతున్నది. ఈ పథకాన్ని అడ్డంపెట్టుకొని ఒక్కో బర్రెపై రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకూ సప్లయ్‌దారుడు కొల్లగొడుతున్నట్టు తెలుస్తున్నది. మధిర నియోజకవర్గంలో ఇప్పటివరకు దాదాపు 2వేల యూనిట్లు గ్రౌండింగ్ కాగా, అందులో 10% కూడా క్షేత్రస్థాయిలో అందుబాటులో లేని దుస్థితి నెలకొన్నది. రీసైక్లింగ్ ద్వారా దాదాపు రూ.16 కోట్లకుపైగా కొల్లగొట్టినట్టు తెలుస్తున్నది. కొడంగల్‌లోనూ ఇటీవలనే యూనిట్ల పంపిణీ ప్రారంభం కాగా, అక్కడే ఇదే దుస్థితి నెలకొన్నదని తెలుస్తున్నది.
ఏపీ ఎమ్మెల్సీ.. తెలంగాణ మంత్రి కమీషన్ల దందా
బర్రెల కొనుగోలు అక్రమాల వ్యవహారంలో తెలంగాణకు చెందిన ఓ మంత్రి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ఎమ్మెల్సీనే కీలకభూమిక పోషిస్తున్నట్టు అధికారవర్గాలు బాహాటంగా వెల్లడిస్తున్నాయి. మేలురకమైన, అత్యధిక పాలు ఇచ్చే బర్రెలకు హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, తమిళనాడు తదుపరి ఆంధ్రప్రదేశ్ పేరుపొందాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒకే ఒక వ్యక్తి నుంచే బర్రెలను కొనుగోళ్లు చేస్తున్నారు. తణుకు, జగయ్యపేట, ఉండీ, రావెళపాలెం, ద్రాక్షారామం నుంచి బర్రెలను తీసుకొస్తున్నారు. ఈ దందాలో తెలంగాణకు చెందిన ఓ మంత్రి కీలకభూమిక పోషిస్తున్నారు.
సదరు మంత్రికి, ఏపీకి చెందిన ఓ ఎమ్మెల్సీకి సన్నిహిత సంబంధాలున్నాయి. సదరు ఎమ్మెల్సీకి అత్యంత సన్నిహితంగా మెలిగే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ బర్రెల సప్లయ్దారుడికే గంపగుత్తగా బర్రెల కొనుగోళ్లను అప్పగించినట్టు తెలుస్తున్నది. పేరుకే ఒక ఎన్ప్యానల్ను ఏర్పాటు చేశారు తప్ప మరేమీ లేదని వివరిస్తున్నారు. ఎన్ప్యానెల్లో 10 మంది సప్లయ్దారులు ఉండగా, అందులో ఆరు సంస్థలు సదరు ఎమ్మెల్సీ సన్నిహితుడి బినామీవేనని అధికారవర్గాలు చెప్తున్నాయి. మొత్తంగా మంత్రి, ఏపీ ఎమ్మెల్సీ, సరఫరాదారులు కూడబలుక్కుని బర్రెల కొనుగోళ్లలో అవినీతికి తెరతీశారని తెలుస్తున్నది. ఈ అవినీతి దందాలో సరఫరాదారుతో పశువైద్యశాఖ అధికారులు సైతం వాటాలు పంచుకుంటున్నట్టు ఆరోపణలున్నాయి. లబ్ధిదారులను కేవలం ఒకే సరఫరాదారు వద్దకు పంపిస్తున్నారని తెలుస్తున్నది.
చేష్టలుడిగి చూస్తున్న ఉన్నతాధికారగణం
బర్రెల కొనుగోళ్ల వ్యవహారంలో మంత్రి హస్తం ఉండటంతో చేష్టలుడిగి చూడాల్సి వస్తున్నదని ఉన్నతాధికారులు సైతం వాపోతున్నారు. క్షేత్రస్థాయి అధికారులు, పశువైద్యాధికారులు సైతం వాస్తవాలను కలెక్టర్ దృష్టికి వెళ్లకుండా చూస్తున్నారని తెలుస్తున్నది. ఏపీ సప్లయ్దారుడిది ఆడింది ఆటగా, పాడింది పాటగా మారిందని వాపోతున్నారు. తనను కాదని బర్రెల కొనుగోలుకు లబ్ధిదారులను వేరే చోటుకు తీసుకెళ్తున్న అధికారులను సైతం బెదిరిస్తున్నారని వివరిస్తున్నారు.
మంత్రి ద్వారా ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి సదరు అధికారులను సస్పెండ్ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. లబ్ధిదారులకు తకువ నాణ్యత కలిగిన బర్రెలు అంటగడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వైద్యాధికారులు, అధికారులు బర్రెకు రూ.5 వేల వరకు డిమాండ్ చేస్తుండటంతో ఉద్దేశం పకదారి పడుతున్నది. అవినీతి దందాపై ప్రజావాణికి సైతం ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అయినప్పటికీ, ఉన్నతాధికారులు మౌనం వహిస్తున్నారు. ఈ దందా స్థానిక కాంగ్రెస్ నేతల భాగస్వామ్యం కూడా ఉన్నదని అధికారవర్గాలు బాహాటంగానే చర్చించుకుంటున్నాయి.
పథకం నిబంధనలు
‘ఇందిరా మహిళా శక్తి విధానాన్ని’ 2025లో ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా ఇందిరా మహిళా డెయిరీ పథకాన్ని ప్రవేశపెట్టింది. మహిళా స్వయం సహాయక బృందాలకు బర్రెలను పంపిణీ చేయాలని, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించడంతోపాటు పాల ఉత్పత్తిని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నది. పైలట్ ప్రాజెక్టుగా సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గం కొడంగల్, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క నియోజకవర్గం మధిర, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గం హుస్నాబాద్‌తోపాటు పరకాల నియోజకవర్గం దామెరలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కొడంగల్, మధిరలో గ్రౌండింగ్ ప్రారంభించారు.
ఈ పథకం కింద ఒక్కో మహిళకు 2 బర్రెలను అందిస్తారు. యూనిట్ విలువ రూ.2 లక్షలు. అందులో 1.6 లక్షలు ప్రభుత్వ సబ్సిడీ (80%) కాగా, మిగిలిన రూ.40 వేలు (20%) లబ్ధిదారు భరించాల్సి ఉంటుంది. ఇందులో ఒక్కో బర్రెకు ఇన్సూరెన్స్ రూ.3,400 చొప్పున, రెండు బర్రెలకు రూ.6,800, రవాణా ఖర్చుల కింద గరిష్ఠంగా రూ.11వేల వరకు ప్రభుత్వం చెల్లిస్తుంది. లబ్ధిదారుకు తన వాటా నిధులను చెల్లించే ఆర్థిక స్థోమత లేకపోతే బ్యాంకు రుణం ద్వారా వాటిని అందజేస్తారు. పాలు అమ్మడం ద్వారా వచ్చే ఆదాయంతో ఆ రుణాన్ని చెల్లించాలి. ఈ పైలట్ ప్రాజెక్టు అమలుకు రూ.781.82 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేయగా, ఇప్పటివరకు రూ.286 కోట్లు విడుదల చేశారు. కాగితాలపై అంతా సవ్యంగా కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో అవినీతిమయమైపోయింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

