TOSS : తెలంగాణ ఓపెన్ స్కూల్ (TOSS) పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల తేదీలు వచ్చేశాయి. అక్టోబర్ 11వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు తమ హాల్‌టికెట్లను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
తెలంగాణ ఓపెన్ స్కూల్ (TOSS) పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. అక్టోబర్ 11వ తేదీ ఆదివారం నుంచి పరీక్షలు షురూ కానున్నాయి. అక్టోబర్ 11నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకూ పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు తమ హాల్ టిక్కెట్లను అధికారిక TOSS వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. పరీక్షా కేంద్రానికి హాల్ టిక్కెట్‌తో పాటు ఒరిజినల్ ఆధార్ కార్డ్‌ను తప్పనిసరిగా తీసుకెళ్లాలి.