Supreme Court : సుప్రీంకోర్టు (Supreme Court) కు కొత్తగా ముగ్గురు న్యాయమూర్తుల (Judges) నియామకానికి రంగం సిద్ధమైంది. సీజేఐ (CJI) జస్టిస్ సూర్యకాంత్ (Justice Suryakanth) నేతృత్వంలో సమావేశమైన కొలీజియం (Collegium).. మూడు రాష్ట్రాల హైకోర్టుల సీజేల (High Courts CJs) పేర్లను కేంద్ర ప్రభుత్వానికి (Union Govt) సిఫార్సు చేయాలని నిర్ణయించింది.
వీరిలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ ఉన్నారు. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌తోపాటు జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ పీఎస్ నరసింహ సుప్రీంకోర్టు కొలీజియంలో భాగంగా ఉన్నారు.