Hathnoora | ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం.. విద్యార్థిని కాలుపై నుంచి వెళ్లిన టైర్…!
హత్నూర ,సెప్టెంబర్ 28: హత్నూర మండలం దౌల్తాబాద్ ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో డ్రైవర్ అజాగ్రత్తతో.. విద్యార్థిని కాలుపై నుంచి బస్సు చక్రం వెళ్లడంతో ఆమె కాలు వేలు విరిగింది.
హత్నూర, సెప్టెంబర్ 28: ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఓ విద్యార్థిని పాలిట శాపంలా మారింది. హత్నూర మండలం దౌల్తాబాద్ ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో డ్రైవర్ అజాగ్రత్తతో.. విద్యార్థిని కాలుపై నుంచి బస్సు చక్రం వెళ్లడంతో ఆమె కాలు వేలు విరిగింది. సోమవారం జరిగిన ఈ ఘటనలో కే.సంజన అనే అమ్మాయి కుడి కాలి వేలు విరిగింది.
నర్సాపూర్ మండలం కాగాజ్ మద్దూర్ గ్రామానికి చెందిన కే.సంజన దౌల్తాబాద్లోని సాయి రిషి ఒకేషనల్ ప్రైవేటు కళాశాలలో ఎంపీహెచ్ డబ్ల్యు కోర్స్ మొదటి సంవత్సరం చదువుతోంది. సోమవారం మధ్యాహ్నం కళాశాల తరగతులు ముగిసిన తర్వాత స్వగ్రామానికి వెళ్లేందుకు దౌల్తాబాద్ ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం వచ్చింది. అక్కడ జోగిపేట-నర్సాపూ బస్ కోసం వేచి ఉంది తను. అయితే.. నర్సాపూర్ డిపో ఆర్టీసీ డ్రైవర్ బస్సును అజాగ్రత్తగా నడపడంతో టైర్ సంజన కాలు పైనుంచి వెళ్లింది.
ఈ ప్రమాదంలో ఆమె కుడి కాలు వేలు ఎముక విరిగి తీవ్ర రక్తస్రావం అయ్యింది. అప్రమత్తమైన తోటి విద్యార్థులు బాధతో విలవిలలాడుతున్న ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఆపై ప్రైవేటు వాహనంలో చికిత్స నిమిత్తం సంగారెడ్డి సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యంపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహ వ్యక్తం చేశారు. అజాగ్రత్తగా బస్సు నడిపి విద్యార్థినిని గాయపరిచిన సదరు డ్రైవర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

