బాబు పగ.. రేవంత్ దగా.. తెలంగాణపై మొదటి నుంచీ విషం కక్కుతున్న చంద్రబాబు
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం వేసే ప్రతి అ డుగులోనూ కాళ్లలో కట్టె పెట్టేలా వ్యవహరించే వ్యక్తి, రాజకీయ శక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబునాయుడు మాత్రమే అని చిన్న పి ల్లగాడిని అడిగినా ఠక్కున సమాధానం చెప్తా డు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్నపుడు తెలంగాణ ప్రాంతంలో ఏ ఒక్క సాగునీటి ప్రా జెక్టును కూడా ముందుకు పోనీయలేదు.
- ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రాంతంపై వివక్ష
- 2014-19 మధ్య సాగునీటి ప్రాజెక్టులపై వరుస ఫిర్యాదులు
- 2024 నుంచి వివిధ రూపాల్లో తెలంగాణ హక్కులకు గండి
- రేవంత్ సర్కార్ పరోక్ష సహకారంతో రెచ్చిపోతున్న ఏపీ
- నాడు శ్రీశైలం, నేడు సాగర్‌ను చెరబట్టిన చంద్రబాబు
- బనకచర్లతో గోదావరి, పల్నాడుతో కృష్ణా నీళ్ల మళ్లింపు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణపై పగ సాధిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా వ్యవహరించింది మొదలు ఇప్పటివరకు తెలంగాణపై విషం కక్కుతూనే ఉన్నారు. ఉమ్మడి రాష్ట్ర పాలకుడిగా తెలంగాణ ప్రాంతంపై తీవ్ర వివక్ష ప్రదర్శించగా, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఐదేండ్లు ఏపీ సీఎంగా ఉన్నపుడు పదేపదే తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కుట్రలు పన్నారు. కేంద్రానికి వరుస ఫిర్యాదులు చేశారు. అయితే కేసీఆర్ ప్రభుత్వం ఉండటంతో ఆయన పాచికలు పారలేదు. కానీ ఇప్పుడు శిష్యుడు ఇక్కడ రాష్ట్ర పగ్గాలు చేపట్టడంతో తన దూకుడు కొనసాగిస్తున్నారు. మొదట గోదావరి, ఇప్పుడు కృష్ణమ్మను చెరబడుతున్నారు.
తెలంగాణకు నీళ్లు దక్కకుండా రెండు నదులనూ మళ్లించుకుపోయేందుకు ఏ ఒక్క అవకాశాన్నీ వదలడం లేదు. ఇలాంటి సమయంలో బాబు కుట్రలను తిప్పికొట్టాల్సిన తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం నోరు మెదపడం లేదు. పైగా.. ప్రజాగ్రహం వ్యక్తమైన ప్రతిసారీ సుదీర్ఘ మీడియా సమావేశం నిర్వహించి, బీఆర్ఎస్పై ఉల్టా దాడి చేయడం తప్ప చంద్రబాబు ఆగడాలను మాత్రం మాట వరుసకైనా ఖండించడం లేదు. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగానే తెలంగాణ నీటి హక్కుల కోసం మరో ఉద్యమం అనివార్యంగా మారుతున్నది.
(గుండాల కృష్ణ)
హైదారాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం వేసే ప్రతి అ డుగులోనూ కాళ్లలో కట్టె పెట్టేలా వ్యవహరించే వ్యక్తి, రాజకీయ శక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబునాయుడు మాత్రమే అని చిన్న పి ల్లగాడిని అడిగినా ఠక్కున సమాధానం చెప్తా డు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్నపుడు తెలంగాణ ప్రాంతంలో ఏ ఒక్క సాగునీటి ప్రా జెక్టును కూడా ముందుకు పోనీయలేదు. చివరికి గ్రావిటీపై కృష్ణాజలాలను తరలించుకుపో యే ఎస్సెల్బీసీలాంటి ప్రాజెక్టును కాలగర్భం లో కలిపి, దానికి ప్రత్యామ్నాయంగా ఎత్తిపోతల పథకాన్ని తెచ్చిన ఘన చరిత్ర చంద్రబాబుది. సింగూరును తాగునీటి పథకంగా మా ర్చినట్టు ఎస్సెల్బీసీ స్థానంలో తెచ్చిన మాధవరెడ్డి ప్రాజెక్టును సైతం హైదరాబాద్ తాగునీటి పథకంగానే పరిమితం చేసేందుకు ప్రయత్నించారు. అలా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగించిన చంద్రబాబు.. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా పదేపదే నీటి హ క్కులపై విషం చిమ్ముతూనే ఉన్నా రు. ఇదేదో రాజకీయ ఆరోపణ కాదు.. పొరుగు రాష్ట్ర సీఎంపై వెళ్లగక్కే అక్కసు అంతకన్నా కాదు.. ఇందుకు లిఖితపూర్వక సాక్ష్యా లు, కండ్ల ముందు కనిపించే ఆధారాలు ఉన్నాయి.
మొదటినుంచీ కండ్లల్లో నిప్పులు
2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత నాటి ప్ర భుత్వం నీటి హక్కుల కోసం అన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేస్తూనే, సాగునీటి ప్రాజెక్టులను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నది. కానీ 2014-19 మధ్య ఏపీ సీఎం ఉన్న చంద్రబాబు మాత్రం కండ్లల్లో ని ప్పులు పోసుకున్నారు. ఏడు మండలాలను ఏ పీలో కలిపితే తప్ప తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనంటూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తన పగ తీర్చుకున్నారు. ఆపై ఐదేండ్ల పాటు సాగునీటి ప్రాజెక్టులపై చేసినన్ని ఫిర్యాదులు బహుశా దేశంలోని ఏ ఇతర రాష్ర్టాల మధ్య లేవంటే అతిశయోక్తి కాదు. 2016లో కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి మేడిగడ్డ వద్ద అప్పటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసి నప్పు డు యావత్తు రాష్ట్రం సంతోషంలో మునిగింది. కానీ ఆయన మాత్రం జీర్ణించుకోలేకపోయారు. ఏకంగా మంత్రివర్గ సమావేశం నిర్వహించి, తెలంగాణ ప్రాజెక్టులపై ఫిర్యాదులు చే యాలని తీర్మానం చేశారు. తెలంగాణ ఏ సాగునీటి ప్రాజెక్టు చేపట్టినా చంద్రబాబు, ఆయన ప్రభుత్వం కేంద్రంతోపాటు కృష్ణా, గోదావరి నదీ బోర్డులకు ఫిర్యాదు చేసింది.
కక్షగట్టి గోదావరి ట్రిబ్యునల్‌కు ఎత్తుగడ
వాస్తవానికి తెలుగు రాష్ర్టాలే కాదు, కృష్ణా బేసిన్‌లోని అన్ని రాష్ర్టాల మధ్య నీటి వాటాలపై గొడవలు, న్యాయపరమైన కేసులు ఉ న్నాయి. కానీ గోదావరి బేసిన్లో మాత్రం దాదాపు అలాంటివేమీ లేవు. కానీ తొలిసారి ఉమ్మడి రాష్ట్రంలో బాబ్లీ నాటకాన్ని రక్తి కట్టించేందుకు ప్రయత్నించి ఘోరంగా విఫలమైన చంద్రబాబు, ఇప్పుడు అదే బేసిన్లోనూ కొత్త వివాదాలను రాజేశారు. ఏపీ తన హక్కుగా ఉన్న గోదావరి జలాలకు సరిపోను ప్రాజెక్టులను నిర్మించుకున్నది. అయినా అంతకంటే ఎక్కువ నీటిని వాడుకునేందుకు ప్రశాంతంగా ఉన్న బేసిన్లో వివాదాలు రేపేందుకు కొత్తగా గోదావరి ట్రిబ్యునల్‌ను ఏర్పాటుచేయాలని కేంద్రానికి లేఖ రాశా రు. 1,486 టీఎంసీల్లో 850 టీఎంసీలు ఏపీకి కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై తెలంగాణ సీఎం గానీ ఆయన ప్రభుత్వంగానీ అభ్యంతరాలు లేవనెత్తుతూ, నిలువరించే ప్ర యత్నాలేవీ చేయడం లేదు.
బనకచర్ల వ్యూహంలో..
గోదావరి ట్రిబ్యునల్‌ను ఏర్పాటుచేయాలని బాబు డిమాండ్ చేసినపుడు సాగునీటిరంగ నిపుణులు విస్మయానికి గురయ్యారు. గోదావరి బేసిన్లో ఎలాంటి వివాదాలు లేనపుడు, దశాబ్దాలుగా బచావత్ కేటాయింపులపై అభ్యంతరాలు వ్యక్తం కానపుడు కొత్త ట్రిబ్యునల్ అవసరమేందని అనుకున్నారు. కానీ చరిత్రలోనే తొలిసారి ‘సముద్రంలో కలిసే వృథా నీళ్లు’ అంటూ వింత వాదన ఎత్తుకున్నారు. 200 టీ ఎంసీలను వాడుతామని కేంద్రానికి డీపీఆర్ సమర్పించారు. దీంతో బీఆర్ఎస్, నమస్తే తెలంగాణ ఆ కుట్ర ను బట్టబయలు చేయడం, సమాజం నుంచి వ్యతిరేకత రావడంతో రేవంత్ ప్రభుత్వం నోరు తెరవాల్సి వచ్చింది.
కేంద్రంతో హస్తినలో భారీ కుట్ర
బనకచర్ల పాచిక పారకపోవడంతో చంద్రబాబు రూటు మార్చి నల్లమలసాగర్‌ను తెరపైకి తెచ్చారు. రూ.59వేల కోట్లతో పోలవరం-నల్లమలసాగర్ లింకు ప్రాజెక్టు అంటూ తెచ్చిన మరో ప్రతిపాదన గుట్టును కూడా బీఆర్ఎస్, నమస్తే తెలంగాణ రట్టు చేయడంతో కాంగ్రెస్ సర్కార్ ఇరకాటంలో పడింది. సరిగ్గా ఇదే సమయంలో చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఏకంగా అపెక్స్ కౌన్సిల్‌ను ఏర్పాటు చే యించారు. తెలంగాణ నీటి హక్కులకు సం బంధించి అనేక అంశాలను దశాబ్దానికి పైగా నానబెడుతూ, ఏనాడూ అపెక్స్ కౌన్సిల్‌ను ఏర్పాటుచేయని కేంద్రం బాబు ఒత్తిడితో ఆ సమావేశాన్ని నిర్వహించింది. ఆదిలో బనకచర్ల అలియాస్ నల్లమలసాగర్ లింకు ప్రాజెక్టు ఎజెండాగా లేదని, ఒకవేళ అలా ఉంటే అపెక్స్ కౌన్సిల్ భేటీకే హాజరుకామని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం హైదరాబాద్‌లో ప్రకటించింది. కానీ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి కేవలం ఏపీ గోదావరిజలాలపైనే చర్చించి, ఆ మేరకు కేంద్రం ప్రతిపాదించిన ఉమ్మడి కమిటీకి అంగీకరించి సంతకం చేసి వచ్చారు. తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు తాను కృష్ణా ప్రాజెక్టులపై టెలిమెట్రీ ఏర్పాటుకు కేంద్రాన్ని ఒప్పించి విజయం సాధించానని చెప్పుకొచ్చారు. దీనిపైనా బీఆర్ఎస్ పెద్ద ఎత్తున పోరాటం చేయడంతో కేంద్రం, బాబు తమ దూకుడు తగ్గించారు.
రేవంత్‌రెడ్డి రాకతో రెచ్చిపోతున్న బాబు సర్కార్
2014-19 మధ్య చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టులను అడుగడుగునా అడ్డుకున్నా, ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఉండటంతో పప్పులు ఉడకలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం వాటన్నింటినీ అధిగమించి, కుట్రలను తిప్పి కొట్టింది. అందుకే ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో పాత, కొనసాగుతున్న ప్రాజెక్టులు తప్ప, కొత్తవాటిని పెద్దగా చేపట్టిన దాఖలాలు లేవు. పట్టిసీమ లాంటి ఎత్తిపోతల పథకాలను చేపట్టినా, నీటి వినియోగంలో కేసీఆర్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆ లెక్కలను సైతం బయటకు తీసి, కృష్ణా బోర్డును ప్రశ్నించింది. 2024లో ఏపీలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వేసే ప్రతి అడుగూ తెలంగాణ నీటి హక్కులకు తీవ్ర విఘాతాన్ని కలిగిస్తుండటం గమనార్హం. ఇందుకు తెలంగాణలో రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ‘పచ్చ’ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటమే కారణమనేది బహిరంగ రాజకీయ ఆరోపణ. అంతేకాదు.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తన మద్దతు మీదనే కొనసాగుతున్నదనే అహంకారంతో చంద్రబాబు ప్రభుత్వం కృష్ణా, గోదావరి జలాలను తరలించుకుపోవడంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నది.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

