సంకీర్ణాన్ని శాసించి పథకాలెన్నో సాధించి!
- గడిచిన నాలుగు దశాబ్దాల్లో రుజువైందిదే
- ప్రాంతీయ పార్టీలకు ఎంపీల సంఖ్యే అస్త్రం
- స్వరాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టుల వరద
- రాజ్యాధికారంలోనూ ‘లోకల్’దే హవా
(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ) : సంకీర్ణ ప్రభుత్వంలో ఇంటి పార్టీ కీలక భాగస్వామిగా ఉంటే ఏమౌతుంది? స్వరాష్ట్రానికి రహదారులు క్యూకడతాయి. పిలవకుండానే రైలు కూత వినిపిస్తుంది. స్విచ్ ఆన్ చేయకుండానే కంపెనీ మెషీన్లు స్టార్ట్ అవుతాయి. పెట్టుబడులు వరదలా పారుతుంది. ఇలా ఒక్కటేమిటీ అన్నీ వరుసపెట్టి వస్తాయి. అదీ సంకీర్ణంలో చక్రం తిప్పే పార్టీకి ఉన్న పవర్. ఇప్పుడు ఆ అవకాశం మనకు మళ్లీ వచ్చింది. మూడు దఫాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పతనం ప్రారంభమైనట్టు ఇటీవల జరుగుతున్న ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే అర్థమవుతున్నది. ఇదే సమయంలో కాంగ్రెస్ పుంజుకునే పరిస్థితి కూడా ఏ కోశానా కనిపించడంలేదు. ఈ నేపథ్యంలో ఏ జాతీయ పార్టీ కూడా కేంద్రంలో సొంతంగా అధికారంలోకి వచ్చే సూచనలు కనిపించడంలేదు. దేశంలో చక్రం తిప్పేవి, కేంద్రంలో అధికారం దక్కించుకునేవి సంకీర్ణ ప్రభుత్వాలే.
80వ దశకం నుంచి దాదాపు మూడు, నాలుగు దశాబ్ధాల వరకూ కొనసాగిన సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన ప్రాంతీయ పార్టీలు తమ రాష్ర్టాలకు నిధులు, ప్రాజెక్టులు, పథకాలను కేంద్రంపై ఒత్తిడి చేసి మరీ ఎత్తుకుపోయాయి. దేశంలో 1989లోని నేషనల్ ఫ్రంట్, 1996లోని యునైటెడ్ ఫ్రంట్, 1998-2004 మధ్యకాలంలో వాజపేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం, 2004-2014 మధ్యకాలంలో యూపీఏ-1, యూపీఏ-2 ప్రభుత్వాలు, అలాగే 2024 నుంచి ఇప్పటివరకూ కొనసాగుతున్న ఎన్డీయే ప్రభుత్వం వరకు ఇలా ఏ సంకీర్ణ ప్రభుత్వాన్ని తీసుకొన్నా.. ప్రాంతీయ పార్టీలదే పైచేయిగా కనిపిస్తున్నది.
సంకీర్ణ సర్కారుల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు పార్లమెంట్లో తమకున్న సంఖ్యాబలాన్ని ఉపయోగించుకుని స్వరాష్ర్టాలకు ప్రయోజనం చేకూర్చేలా కేంద్ర మూలధన వ్యయాలు, కీలక మౌలిక సదుపాయాల కారిడార్లు, కేంద్ర మంత్రిత్వ శాఖల్లో కీలక పదవులు, అలాగే రాష్ర్టాల హక్కులకు సంబంధించిన దీర్ఘకాలిక సమాఖ్యపరమైన రక్షణ అవసరాలను సాధించాయి.ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ప్రకటించి మోదీని.. అటు బాబు, ఇటు నితీశ్ చెప్పుచేతల్లో పెట్టుకొన్నారు. తద్వారా తమ రాష్ర్టాలకు నిధులు, ప్రాజెక్టులను తోలుకుపోతున్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణ హక్కుల కోసం పోరాడుతున్న బీఆర్ఎస్కు 17 ఎంపీ స్థానాలను కట్టబెడితే, కేంద్రం మెడలు వంచి రాష్ట్ర ప్రయోజనాలకు పాటుపడే అవకాశమున్నదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

