చరిత్రలో మొదటిసారి గరిష్ఠంగాసీట్ల పెంపు
న్యూఢిల్లీ: కేంద్రం చేపడుతున్న డీలిమిటేషన్లో ఈసారే గరిష్ఠ సంఖ్యలో పార్లమెంట్/అసెంబ్లీ స్థానాలు పెరుగనున్నాయి. సీట్ల పునర్విభజన కోసం సుప్రీంకోర్టు ప్రస్తుత/మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు కానుంది. దేశంలో అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన కోసం ఇప్పటివరకూ నాలుగు డీలిమిటేషన్ కమిషన్లు పనిచేశాయి. ఇప్పుడు ఐదోది ఏర్పాటు కానుంది. 1952 డీలిమిటేషన్లో లోక్‌సభ సీట్ల సంఖ్య 494కు చేరింది. అయితే తర్వాత చేపట్టిన పునర్విభజనలో లోక్‌సభ స్థానాల సంఖ్య పదుల సంఖ్యలో మాత్రమే పెరిగాయి.
1961 జనాభా లెక్కల ప్రకారం 1963లో చేపట్టిన డీలిమిటేషన్లో సీట్ల సంఖ్య 494 నుంచి 522కు, 1971 జనగణన ప్రకారం 1973లో చేపట్టిన దానిలో 522 నుంచి 543కు సీట్లు పెరిగాయి. 1971/2001 జనాభా లెక్కల ప్రకారం 2002లో చేపట్టిన గణనలో ఎలాంటి పెరుగుదల నమోదు కాలేదు. అయితే 2011 జనాభా లెక్కల ఆధారంగా 2026లో (ప్రస్తుత ఏడాది) చేపట్టబోయే పునర్విభజనలో అనూహ్యంగా 50 శాతం సీట్ల సంఖ్య పెరిగి లోక్‌సభ సీట్ల సంఖ్య 850కు చేరవచ్చు.

Ss
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

