మహిళా కోటాను డీలిమిటేషన్‌తో ముడిపెట్టొద్దు
- 33% రిజర్వేషన్లను ప్రస్తుత సీట్లలోనే అమలు చేయాలి
- ఓబీసీ మహిళలకు ప్రత్యేక సబ్ కోటా కల్పించాలి
- ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్
హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలుపడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్‌కుమార్ స్వాగతించారు. మహిళలకు చట్టసభల్లో కల్పించనున్న 33 శాతం రిజర్వేషన్లను డీలిమిటేషన్ అంశంతో ముడిపెట్టకుండా, ప్రస్తుతం ఉన్న సీట్లలోనే తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు ప్రత్యేక సబ్ కోటా కల్పించాలని శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. సబ్ కోటా లేకుంటే వెనుకబడిన వర్గాల మహిళలకు తగిన ప్రాతినిధ్యం దకదని తెలిపారు. మహిళా సాధికారతతోపాటు అన్ని సామాజిక వర్గాలకు సమాన అవకాశాలు కల్పించినప్పుడే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
మహిళా రిజర్వేషన్ల కోసం దశాబ్దకాలంగా బీఆర్ఎస్, పార్టీ అధినేత కేసీఆర్ చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పడిన వెంటనే 2014 జూన్ 14న పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదింపజేసి కేంద్రానికి పంపిన విషయాన్ని ఆ ప్రకటనలో ప్రస్తావించారు. 2023 సెప్టెంబర్ 15న కూడా ఈ చట్టాన్ని తక్షణమే ఆమోదించాలని ప్రధానికి లేఖ రాశారని తెలిపారు. డీలిమిటేషన్ ఎప్పుడు జరుగుతుందో స్పష్టత లేనందున దానితో రిజర్వేషన్లను ముడిపెడితే అమలు మరింత ఆలస్యమయ్యే ప్రమాదం ఉన్నదని పేరొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

