బీఆర్టీఎస్..ట్రాఫిక్ చిక్కులుండవ్!
- ఐటీ కారిడార్‌లో వారం రోజుల్లో కాంట్రా ఫ్లో బీఆర్టీఎస్ ప్రారంభం
- జేఎన్టీయూ నుంచి రాయదుర్గం వరకు ప్రత్యేక బస్ సర్వీసులు
- రెండేండ్లలో 450 ఏసీ, 60 మినీ బస్సులు..టీజీఎస్ఆర్టీసీ ప్రణాళిక
ఐటీ కారిడార్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి పరిషారం చూపేందుకు సైబరాబాద్ పోలీసులు, రవాణా శాఖ కీలక చర్యలకు సిద్ధమవుతున్నాయి. కేవలం వారం రోజుల్లో కాంట్రా ఫ్లో బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (బీఆర్టీఎస్ )ను ప్రారంభించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేశ్ వెల్లడించారు. రాయదుర్గంలోని టీ హబ్‌లో జరుగుతున్న ‘సైబరాబాద్ మూవ్స్ – 2026’ రెండోరోజు కార్యక్రమంలో సీపీ ఈ ప్రకటన చేశారు. ప్రజా రవాణాను ప్రోత్సహించడం, రద్దీ సమయాల్లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడమే లక్ష్యంగా ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు వివరించారు.
సిటీబ్యూరో, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): టీజీఎస్ఆర్టీసీ జేఎన్టీయూ నుంచి రాయదుర్గం వరకు కాంట్రా ఫ్లో బీఆర్టీఎస్ సర్వీసులను ప్రవేశపెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సీపీ తెలిపారు. సాధారణంగా ఒక దిశలో అధికంగా ఉండే ట్రాఫిక్‌కు ప్రత్యామ్నాయంగా, వ్యతిరేక దిశలో అందుబాటులో ఉన్న రహదారి సామర్థ్యాన్ని వినియోగించుకోవడం ఈ విధానం ముఖ్య ఉద్దేశమని, ముఖ్యంగా పీక్ అవర్స్‌లో ఐటీ కారిడార్‌లో ఏర్పడే వాహనాల రద్దీని అధిగమించేందుకు ఈ సర్వీసులు దోహదపడతాయన్నారు. ఈ ప్రత్యేక బస్సుల ద్వారా కేపీహెచ్‌బీ, హైటెక్ సిటీ, రాయదుర్గం మెట్రో స్టేషన్ల ప్రయాణికులకు మెరుగైన అనుసంధానం కల్పించనున్నట్లు వివరించారు.
ఉద్యోగులు, విద్యార్థులు వ్యక్తిగత వాహనాలపై ఆధారపడకుండా ప్రజా రవాణాను వినియోగించుకునేలా ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. సైబరాబాద్ ప్రాంతంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు రాబోయే రెండేండ్లలో అదనంగా 510 బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని టీజీఎస్ఆర్టీసీ ప్రణాళిక రూపొందించినట్లు అధికారులు తెలిపారు. వీటిలో 450 ఏసీ బస్సులు, 60 మినీ బస్సులు ఉండనున్నట్లు తెలిపారు. ఐటీ ఉద్యోగుల కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులను కూడా నడపాలని ప్రతిపాదించారు. దీంతో ఐటీ కారిడార్‌లో ఉద్యోగుల రాకపోకలకు మరింత సౌకర్యవంతమైన ప్రజా రవాణా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
మల్టీమోడల్ రవాణాకు డేటా అనుసంధానం
రవాణా వ్యవస్థలో వివిధ మార్గాల మధ్య సమన్వయం పెంచేందుకు ఎంఎంటీఎస్ తన డేటాను ఓపెన్ డేటా తెలంగాణతో పంచుకోనున్నట్లు ఈఎస్డీ, ఐటీఈ అండ్ సీ కమిషనర్ రవి కిరణ్ తెలిపారు. దీనివల్ల బస్సులు, మెట్రో, ఎంఎంటీఎస్ వంటి ప్రజా రవాణా వ్యవస్థల మధ్య అనుసంధానం మెరుగుపడుతుందని ఆయన అన్నారు. డేటా పంచుకోవడం వల్ల ప్రయాణికులకు సమగ్ర రవాణా సమాచారం అందించడంతో పాటు ప్రయాణ ప్రణాళిక సులభతరం కానుంది.
విద్యార్థులతో అధికారుల ముఖాముఖి
‘సేఫ్ యాక్సెస్ టు సూల్స్ అండ్ స్టూడెంట్ మొబిలిటీ ప్రోగ్రామ్ ’లో భాగంగా సైబరాబాద్ పరిధిలోని వివిధ పాఠశాలల విద్యార్థులతో అధికారులు సమావేశమయ్యారు. పోలీసు కమిషనర్ డాక్టర్ ఎం.రమేశ్ , సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ డాక్టర్ సృజన, అదనపు డిప్యూటీ కమిషనర్ జి.హనుమంతరావు విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు కార్ పూలింగ్ను ప్రోత్సహించాలని, సురక్షిత డ్రైవింగ్ విధానాలను అమలు చేయాలని, వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి ప్రజా రవాణాకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. విద్యార్థులు లేవనెత్తిన సమస్యలను పరిషరించేందుకు ప్రభుత్వం చురుకుగా చర్యలు తీసుకుంటుందని అధికారులు హామీ ఇచ్చారు.
రోడ్డు అభివృద్ధి ప్రణాళిక అవసరం
సైబరాబాద్ భవిష్యత్ రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని డేటా ఆధారిత పదేండ్ల రోడ్ నెట్ వర్ ప్రణాళిక రూపొందించాలని డబ్ల్యూఆర్ ఐ ఇండియా సీఈవో మాధవ్ సూచించారు. 10 నుంచి 30 మీటర్ల వెడల్పుతో ద్వితీయ, తృతీయ స్థాయి రహదారులను అభివృద్ధి చేయడం ద్వారా ప్రజా రవాణా, ఉద్యోగ కేంద్రాలు, విద్యాసంస్థలకు మెరుగైన అనుసంధానం కల్పించవచ్చన్నారు. మరోవైపు ట్రాఫిక్, వాయు కాలుష్యం చిన్నారులు, ఇతర బలహీన వర్గాల శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని వైద్యు లు, ప్రజారోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశా రు. సురక్షిత రహదారుల నిర్మాణం, పాఠశాలల పరిసరాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు, మెరుగైన చివ రి మైలు కనెక్టివిటీ, గాలి నాణ్యతపై ప్రజలకు అందుబాటులో ఉండే సమాచారం అవసరమన్నారు.
ట్రాఫిక్ క్రమశిక్షణలో మీడియా పాత్ర కీలకం : కమిషనర్ డా.రమేశ్
రోడ్డు భద్రత, పట్టణ రవాణా సమస్యల పరిషారంలో ప్రజల ప్రవర్తనలో మార్పు రావడం అత్యంత అవసరమని సీపీ డాక్టర్ ఎం. రమేశ్ అన్నారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించడం, బాధ్యతాయుతంగా వాహనాలు నడపడం, ప్రజా రవాణాను వినియోగించుకోవడం వంటి అంశాలపై మీడియా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. రోడ్డు భద్రత కోసం పనిచేస్తున్న ప్రభుత్వ విభాగాలపై ప్రజల్లో నమ్మకం పెంచడంలో మీడియా కథనాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

