జడ్జీల నియామకాల్లో కుల వివక్ష!
- ఒక సామాజిక వర్గం వారికేఅధిక ప్రాధాన్యం లభిస్తున్నది
- రాష్ట్రపతికి మాజీ సీజేఐజస్టిస్ బీఆర్ గవాయ్ లేఖ
న్యూఢిల్లీ: న్యాయమూర్తుల నియామకాలు, బదిలీల విషయంలో సామాజిక వైవిధ్యం, సమ్మిళితత్వం, ప్రతిభకు ప్రాధాన్యం తగ్గుతున్నదని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ఆందోళన వ్యక్తంచేశారు. జడ్జీల నియామకాల్లో ఒక ప్రత్యేక సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ, అణగారిన వర్గాలు, మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం లేదని ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆయన ఒక లేఖ రాసినట్టు లైవ్‌లా కథనం వెల్లడించింది. ఇటీవలి కాలంలో న్యాయమూర్తుల నియామకాల కోసం కొలీజియం చేస్తున్న సిఫార్సుల్లో ఒక వర్గానికి చెందిన అభ్యర్థులకే ప్రాధాన్యం లభిస్తున్నదని గవాయ్ పేర్కొన్నారు. ఇతర సామాజిక వర్గాలు, ముఖ్యంగా అణగారిన వర్గాలకు అవకాశాలు తగ్గుతున్నాయని అభిప్రాయపడ్డారు. ‘ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రతిభ, సమ్మిళితత్వం వంటి సూత్రాలను పూర్తిగా విస్మరిస్తున్నారు. ఒక ప్రత్యేక వర్గానికి చెందిన అభ్యర్థులనే సిఫార్సు, పదోన్నతుల కోసం ఎంపిక చేస్తూ, అణగారినవర్గాలతో సహా మిగిలిన వారందరినీ పక్కన పెడుతున్నారు’ అని వివరించారు.
జనాభాలో ఐదు శాతం కంటే తక్కువ.. సుప్రీంకోర్టులో 40 శాతానికి పైగా ప్రాతినిధ్యం!
దేశ జనాభాలో ఐదు శాతం కంటే తక్కువగా ఉన్న ఒక సామాజికవర్గానికి ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టులో 40 శాతానికి పైగా ప్రాతినిధ్యం లభించిందని గవాయ్ తన లేఖలో ప్రస్తావించారు. తన హయాంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చానని, ఇటీవల ఒక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని గవాయ్ చెప్పారు.
కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రస్తావన
2018 నుంచి నియమితులైన 715 మంది హైకోర్టు న్యాయమూర్తుల్లో షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారు 22 మంది, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారు 16 మంది, ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన వారు 89 మంది, మైనారిటీ వర్గాలకు చెందిన వారు 37 మంది ఉన్నారని కేంద్ర చెబుత్నుది. వీటిని బట్టి 2021 జనవరి నుంచి 2026 జనవరి వరకు నియామకాల్లో అగ్రవర్ణాలకు చెందిన వారే ఉన్నారని తెలుస్తున్నది. ఈ నియామకాలపై రాష్ట్రపతి చొరవ తీసుకోవాలని, తనకున్న ప్రత్యేక అధికారాలతో సామాజిక న్యాయం పాటించేలా చూడాలని గవాయ్ కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

