మండేలా బాటలో స్వరాష్ట్ర పోరు
ప్రపంచ చరిత్రలో కొన్ని పోరాటాలు కేవలం రాజకీయ పరిణామాలుగా మిగిలిపోవు. అవి తరతరాలకు స్ఫూర్తినిచ్చే చారిత్రక ఘట్టాలుగా నిలిచిపోతాయి. దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలా సాగించిన వర్ణవివక్ష వ్యతిరేక పోరాటం అక్కడి ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్య హక్కుల దిశగా మార్గం చూపితే, భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేపట్టిన ఆమరణనిరాహార దీక్ష ఒక ప్రాంత ప్రజల దశాబ్దాల స్వరాష్ట్ర ఆకాంక్షకు చారిత్రక మలుపుగా నిలిచింది.
ఒకటి; దక్షిణాఫ్రికా ప్రజలపై కొనసాగిన వర్ణవివక్ష సంకెళ్లను తెంచేందుకు సాగిన సుదీర్ఘ పోరాటం. మరొకటి; తెలంగాణ ప్రజల ప్రాంతీయ ఆకాంక్షలు, ఆత్మగౌరవం, స్వీయ పాలన కోసం సాగిన ఉద్యమం. ఈ రెండు ప్రాంతాలో పోరాటాల నేపథ్యాలు వేరు, చారిత్రక పరిస్థితులు వేరు, మార్గాలు వేరు. కానీ ప్రజల హక్కుల కోసం, వారి గౌరవం కోసం, వారి భవిష్యత్తు కోసం నాయకత్వం వహించిన స్ఫూర్తి ఈ రెండు ఉద్యమాలను చరిత్రలో ప్రత్యేకంగా నిలిపింది. దక్షిణాఫ్రికాలో దశాబ్దాల పాటు కొనసాగిన వర్ణవివక్ష పాలనలో నల్లజాతి ప్రజలు ఎన్నో వివక్షలు, అణచివేతలు, అన్యాయాలను ఎదుర్కొన్నారు.
ఈ అన్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా మండేలా తన జీవితాన్నే పోరాటానికి అంకితం చేశారు. తెలంగాణ ప్రాంత ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కూడా ఒక్కరోజులో పుట్టుకొచ్చింది కాదు. 1969 ఉద్యమం నుంచి అనేక తరాలు ప్రత్యేక ప్రత్యేక రాష్ట్రం కోసం తమ ఆకాంక్షను వ్యక్తం చేశాయి. ఈ చారిత్రక ఆకాంక్షకు రాజకీయ వేదిక కల్పిస్తూ 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని స్థాపించారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ప్రధాన లక్ష్యంగా చేసుకుని గ్రామాల నుంచి పట్టణాల వరకు ప్రజలను ఉద్యమంలో భాగస్వాములను చేశారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. 2009 డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని ప్రకటించింది. అనేక ఆటంకాలు, పరిణామాల తర్వాత 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది.
నెల్సన్ మండేలా పోరాటం దక్షిణాఫ్రికాలో వర్ణవివక్ష వ్యవస్థ ముగింపునకు, ప్రజాస్వామ్య దక్షిణాఫ్రికా ఆవిర్భావానికి మార్గం వేసింది. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షను దేశవ్యాప్త చర్చలో కీలక స్థాయికి తీసుకెళ్లి, ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ ప్రక్రియలో నిర్ణయాత్మక మలుపుగా నిలిచింది. మండేలా 27 సంవత్సరాల జైలు జీవితాన్ని ఎదుర్కొని తన ప్రజల సమాన హక్కుల కోసం పోరాడారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. ప్రజల ఆకాంక్షలను చరిత్రలో నిలిపిన నాయకత్వ ప్రస్థానాలుగా రెండు ఉద్యమాలను గుర్తించవచ్చు. మండేలా పోరాటం దక్షిణాఫ్రికా ప్రజాస్వామ్య చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. కేసీఆర్ దీక్ష తెలంగాణ రాజకీయ చరిత్రలో ఒక కొత్త రాష్ట్ర ఆవిర్భావానికి దారితీసిన కీలక ఘట్టంగా నిలిచింది.
నవంబర్ 29 అనేది కేవలం కేసీఆర్ నిరాహార దీక్ష ప్రారంభించిన తేదీ మాత్రమే కాదు. తెలంగాణ ప్రజల స్వీయ పాలన ఆకాంక్షను గుర్తుచేసే చారిత్రక సందర్భం. ప్రపంచ చరిత్రలో మండేలా పేరు దక్షిణాఫ్రికా ప్రజల స్వేచ్ఛా పోరాటంతో చిరస్థాయిగా నిలిచినట్లే, తెలంగాణ చరిత్రలో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష రాష్ట్ర సాధన ఉద్యమంలోని ఒక కీలక మైలురాయిగా నిలిచిపోతుంది. ఒక పోరాటం వర్ణవివక్ష సంకెళ్ల నుంచి ప్రజాస్వామ్య దక్షిణాఫ్రికా నిర్మాణానికి బాట వేసింది. మరో దీక్ష దశాబ్దాల తెలంగాణ ఆకాంక్షను స్వరాష్ట్ర సాధన దిశగా నడిపించింది. ప్రజల ఆకాంక్షకు నాయకత్వం తోడైతే చరిత్ర ఎలా మలుపు తిరుగుతుందో ఈ రెండు ఉద్యమాలు ప్రపంచానికి గుర్తుచేస్తాయి.
నెల్సన్ మండేలా పోరాట స్ఫూర్తికి జోహార్లు! తెలంగాణ అమరవీరుల త్యాగాలకు శతకోటి వందనాలు!తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో కీలక మలుపుగా నిలిచిన కేసీఆర్ దీక్షా దివస్‌కు ఘన నివాళులు!
వ్యాసకర్త: బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్
దక్షిణాఫ్రికా అధ్యక్షుడు
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

