కత్తిపట్టని విలియం వాలెస్.. కేసీఆర్
చరిత్ర ఎప్పుడూ విజయగాథలతోనే నిర్మితం కాదు. కొన్నిసార్లు కన్నీటి చుక్కలతో, మరికొన్నిసార్లు రక్తపు మరకల త్యాగాలతో, ఇంకొన్నిసార్లు ఒక మనిషి చేసిన త్యాగంతో చరిత్రలో కొత్త అధ్యాయం మొదలవుతుంది. అన్యాయం రాజ్యమేలుతున్నప్పుడు ప్రశ్నించే ఆలోచన ఉత్పన్నమవుతుంది.ఆ ఆలోచనకు రాజకీయ రూపం లభించినప్పుడు చరిత్ర తన గమనాన్నిమార్చుకుంటుంది. తెలంగాణ చరిత్రలో నవంబర్ 29 అటువంటి మలుపు. అది కేవలం ఒక తారీఖు కాదు..తెలంగాణ ఆత్మగౌరవం అక్షరరూపం దాల్చిన రోజు. అది ఒక దీక్ష కాదు..ఒక జాతి దశాబ్దాల ఆకాంక్షను ప్రపంచానికి చాటిన పోరాటం. ఆకలితో మొదలైన పోరాటం..నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంతో కూడిన స్వరాష్ట్ర ఆవిర్భావానికి పునాది.
ప్రతి ప్రాంతీయ అస్తిత్వం వెనుక ఒక ఆవేదన వినిపిస్తుంది.చరిత్ర పుటలను తిరగేస్తే ప్రతి జాతి విముక్తి వెనుక ఒక పోరాటం కనిపిస్తుంది. ఆధిపత్య శక్తుల సంకెళ్లను తెంచుకొని స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవాలని తపించిన సమాజాలు కాలానుగుణంగా భిన్నమైన పోరాట మార్గాలను ఎంచుకున్నాయి. రెండు భిన్నమైన కాలాలకు, రెండు భిన్నమైన భౌగోళిక ప్రాంతాలకు చెందిన ఇద్దరు నాయకులు ప్రత్యేకంగా నిలుస్తారు. ఒకరు 13వ శతాబ్దపు స్కాట్లాండ్ వీరుడు సర్ విలియం వాలెస్. మరొకరు 21వ శతాబ్దపు తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. వీరిద్దరు ఎదుర్కొన్న ఆధిపత్య శక్తుల స్వరూపం వేరు. కానీ ఇద్దరి హృదయాల్లోనూ తమ ప్రాంత ప్రజలకు స్వయం నిర్ణయాధికారం కల్పించాలనే బలమైన ఆకాంక్ష ఉన్నది. విలియం వాలెస్ చేతిలో కత్తి ఆయుధమైతే, కేసీఆర్ చేతిలో ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగం, ప్రజా ఉద్యమం ఆయుధాలయ్యాయి.
13వ శతాబ్దపు స్కాట్లాండ్లో సర్ విలియం వాలెస్, 21వ శతాబ్దపు తెలంగాణలో కేసీఆర్-వీరిద్దరి పోరాటాల మధ్య కాలాంతరాల దూరం అపారం. కానీ తమ ప్రాంత ప్రజల అస్తిత్వం స్వయంప్రతిపత్తి ఆకాంక్షను రాజకీయ పోరాటంగా మలిచిన నాయకులుగా చరిత్రలో వీరి ప్రస్తావన ఆసక్తికరమైన పోలికగా చూడవచ్చు. 1297లో స్టర్లింగ్ బ్రిడ్జ్ యుద్ధంలో సాధించిన విజయం ఇంగ్లాండ్ సైనిక ఆధిపత్యానికి సవాల్ విసిరింది. అనంతరం ఫాల్కిర్క్ యుద్ధంలో ఎదురైన ఓటమి, అంతర్గత రాజకీయ విభేదాలు ఆయన పోరాటాన్ని బలహీనపరిచాయి. చివరికి 1305లో ఆయన మరణశిక్షకు గురయ్యారు. కానీ ఒక వీరుడి శరీరాన్ని అంతం చేయగలిగినా, ఆయన రగిలించిన స్వాతంత్య్ర ఆకాంక్షను అంతం చేయలేకపోయారు. వాలెస్ పోరాటం స్కాట్లాండ్ స్వాతంత్య్ర చరిత్రలో శాశ్వత స్ఫూర్తిగా నిలిచింది.
1956లో ఆంధ్ర రాష్ట్రంతో తెలంగాణను విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసిన అనంతరం నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తమకు అన్యాయం జరుగుతున్నదనే ప్రాంతీయ అసంతృప్తి పెరిగింది. 1969లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. వేలాది మంది విద్యార్థులు, యువకులు వీధుల్లోకి వచ్చారు. వందలాది మంది ప్రాణత్యాగాలు చేశారు.
తొలిదశ ఉద్యమ ఆకాంక్ష తక్షణ రాజకీయ ఫలితాన్ని సాధించలేకపోయింది. ఆ చారిత్రక నేపథ్యాన్ని అర్థం చేసుకున్న కేసీఆర్ 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి, ప్రత్యేక రాష్ట్ర సాధనకు రాజకీయ వేదికను నిర్మించారు. విలియం వాలెస్, కేసీఆర్ మధ్య పోలికను వారి పోరాటలను అర్థం చేసుకోవాలి. ఒకరు సాయుధ ప్రతిఘటన ద్వారా బ్రిటిష్ ఆక్రమణను సవాల్ చేశారు. మరొకరు ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ, సాంస్కృతిక, సామూహిక ఉద్యమ రూపాలను ఉపయోగించి ఆంధ్ర ఆక్రమణదారుల చెర నుంచి తెలంగాణ రాష్ట్ర విముక్తి సాధన కోసం పోరాడారు. విలియం వాలెస్ పోరాటం స్కాట్లాండ్ స్వేచ్ఛా చరిత్రలో నిలిచిపోతే.. కేసీఆర్ దీక్ష తెలంగాణ రాష్ట్ర సాధన చరిత్రలో ఒక మరపురాని మైలురాయిగా నిలిచిపోయింది. దశాబ్దాలుగా ప్రజల మదిలోని ఆకాంక్షలను సాకారం చేసిన వీరోచిత పోరాటంగా చరిత్ర పుటలపై లిఖితమైంది.
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

