Mallu Bhatti Vikramarka | హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): ప్రజలపైన ఎలాంటి పన్నుల భారం వేయకుండా ప్రభుత్వ అవసరాలను, ఆలోచనలను దృష్టి లో ఉంచుకొని అన్ని శాఖల్లో ప్రత్యామ్నాయ ఆదాయం పెంపుపై అధికారులు దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార సూ చించారు. ఖజానాను నింపేందుకు ఆదా యం పెంపు మార్గాలపై కీలక శాఖలతో శుక్రవారం బీఆర్ అంబేదర్ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రతి నెల సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో ఆదాయం పెంపుపై జరిగే సమావేశానికి కొత్త ఆలోచనలతో కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని రావాలని సూచించారు. ఖజానాను నింపేందుకు ఆయా శాఖల్లో స్వేచ్ఛ గా నిర్ణయాలు తీసుకొని ఫలితాలు సాధించాలని చెప్పారు. అందరికీ ఇసుకను అం దుబాటులోకి తెచ్చేందుకు పట్టణాలకు స మీపంలో సబ్ యార్డులు, అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మారెట్ యార్డుల్లో ఇసుక నిల్వలు అందుబాటులో ఉంచాలని మై నింగ్శాఖ అధికారులకు సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులు.. ఇప్పటివరకు సమకూరిన ఆదాయం.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎల్ఆర్ఎస్ ద్వారా ఏ మేరకు రాబడిని అంచనా వేయవచ్చు అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ల్యాండ్ పూలింగ్ ప్రణాళికలు, అసైన్డ్ భూము లు, కోర్టు వివాదాలను సమీక్షించారు. రాష్ట్ర ప్రధాన ఆదాయ వనరుల్లో జీఎస్టీ ఒక టి… లీకేజీలను అరికట్టి ఆదాయం పెంచేందుకు యాక్షన్‌ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. సమావేశంలో స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు, ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్, కమర్షియల్ ట్యాక్స్, రెవెన్యూ కమిషనర్ రిజ్వీ, ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, స్పెషల్ సెక్రటరీ కృష్ణభాసర్, రవాణాశాఖ కమిషనర్ బుద్ధప్రకాశ్, హౌసింగ్ స్పెషల్ సెక్రటరీ గౌతం, మైనింగ్‌శాఖ సెక్రటరీ సురేంద్రమోహన్, డైరెక్టర్ సుశీల్, పరిశ్రమలశాఖ స్పెషల్ సెక్రటరీ విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.