అమరావతి : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ( Botsa Satyanarayana) శుక్రవారం ఉదయం బ్రెయిన్ స్ట్రోక్ ( Brain stroke ) కు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం సిటీన్యూరో సెంటర్లో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
పరీక్షించిన వైద్యులు మైల్డ్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని వివరించారు. ప్రస్తుతం బొత్స సత్యనారాయణ ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించారు. బొత్సను రెండురోజుల్లో డిశ్చార్జ్ చేసే అవకాశముందని వైద్యులు పేర్కొన్నారు.