ముంబై: బీజేపీ కార్యకర్త ఒకరు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా తన విద్యార్హతల వివరాలను కోరడంపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందించారు. బీజేపీ నేతలు కూడా కూడా తమ విద్యకు సంబంధించిన డిగ్రీలను బహిరంగపరచాలని సవాల్ చేశారు. (Abhijeet Dipke) ‘నా స్కాలర్షిప్ లేఖ, విద్యా రుణ లేఖను వెల్లడించడానికి నేను సిద్ధంగా ఉన్నా. చక్రవర్తి తన డిగ్రీని చూపిస్తారా?’ అని అభిజిత్ ప్రశ్నించారు. ప్రధాని మోదీ విద్యార్హతను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా, బీజేపీ నాయకులు కూడా తమ విద్యార్హతలను బహిరంగపరుస్తారా? అని అభిజిత్ దీప్కే ప్రశ్నించారు. ‘ఒక బీజేపీ కార్యకర్త నాపై ఆర్టిఐ దాఖలు చేసి, నా చదువు ఎలా పూర్తి చేశానో తెలుసుకోవాలనుకుంటున్నట్లు ఇప్పుడే చూశాను. మీ నాయకులు వారి డిగ్రీని చూపిస్తారా అని ఆయనను నేను అడగాలనుకుంటున్నా’ అని అన్నారు.
మరోవైపు తన విద్యా నేపథ్యం ఎందుకు ఒక సమస్యగా మారింది? అని అభిజిత్ ప్రశ్నించారు. ‘ఒక సాధారణ యువకుడు బోస్టన్ యూనివర్సిటీలో చదివితే వారికేం బాధ? విద్య పట్ల మీకెందుకంత వ్యతిరేకత? అని నిలదీశారు. బోస్టన్ యూనివర్సిటీ స్కాలర్షిప్, విద్యా రుణంతో తన చదువు కోసం ఆర్థిక సహాయం పొందినట్లు ఆయన వివరించారు. విద్యా రుణం తిరిగి చెల్లించాల్సి ఉందన్నారు. ప్రతి ఒక్కరూ దీనిపై విచారణ జరుపవచ్చని దీప్కే అన్నారు. నీట్ లీక్ వివాదంపై నిరసన ఉద్యమానికి నేతృత్వం వహించడానికి జూన్లో భారత్కు ఆయన తిరిగి వచ్చారు.
I am ready to reveal my scholarship letter & education loan letter.
Will the emperor show his degree? pic.twitter.com/cVUqbz3O9n
— Abhijeet Dipke (@abhijeet_dipke) August 3, 2026