నగోయా: ఏషియన్ గేమ్స్‌లో భారత మహిళల రికర్వ్ జట్టు చరిత్ర సృష్టించింది. ఆర్చరీ టీమ్ ఈవెంట్లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నది. తీవ్ర వత్తిడిలో భారత మహిళల రికర్వ్ బృందం అత్యద్భుత ప్రదర్శన ఇచ్చారు. 10 సార్లు ఒలింపిక్ చాంపియన్ దక్షిణ కొరియాపై 5-3 తేడాతో విజయం సాధించి గోల్డ్ మెడల్‌ను సొంతం చేసుకున్నారు. ఏషియన్ గేమ్స్ చరిత్రలో భారత మహిళల రికర్వ్ ఆర్చరీ జట్టుకు స్వర్ణ పతకం రావడం ఇదే మొదటిసారి. భారత ఆర్చర్లు అంకిత భక్త్, కీర్తి శర్మ, కుమ్కుమ్ మోహద్ .. అత్యంత ప్రతికూల వాతావరణంలోనూ తమ సత్తాను చాటారు.
గాలి తీవ్రంగా ఉన్న వాతావరణంలో.. డిఫెండింగ్ చాంపియన్స్‌ను ఓడించి భారత అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. ఆర్చరీలో మాజీ వరల్డ్ నెంబర్ వన్ ప్లేయర్ దీప్తి కుమారి సెలెక్షన్ ట్రయల్స్‌లో విఫలం కావడంతో ఏషియన్ గేమ్స్‌కు ఎంపిక కాలేదు. అయితే ఆమె స్థానంలో వచ్చిన కీర్తి శర్మ అద్భుతంగా పర్ఫార్మ్ చేసింది. ఓపెనింగ్ రెండు సెట్లలో భారత్, కొరియా జట్లు సమంగా పాయింట్లు సాధించాయి. అయితే మూడో సెట్లో కొరియా తప్పిదాన్ని అవకాశంగా వాడుకున్న ఇండియన్ బృందం రాణించింది. ఆ సెట్లో కీలకమైన పాయింట్లు సాధించి 4-2 ఆధిక్యాన్ని పొందింది.
ఇక వత్తిడిలో పడిన దక్షిణ కొరియా నాలుగో సెట్లో 54 పాయింట్లు సాధించింది. భారత బృందం కూడా 54 స్కోరు చేయడంతో పాయింట్ల ఆధారంగా ఇండియా అగ్రస్థానంలో నిలిచింది. సెమీస్‌లో చైనాపై 5-1 తేడాతో ఇండియా గెలిచింది. మహిళల రికర్వ్ పతకంతో ఆర్చరీలో ఇండియాకు నాలుగో స్వర్ణం కన్ఫర్మ్ అయ్యింది. 2023 హంగ్జూలో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో భారత మహిళల రికర్వ్ జట్టుకు కాంస్యం దక్కింది.
History made in Archery!
Heartiest congratulations to Ankita Bhakat, Kumkum Anil Mohod & Kirti on winning India’s first-ever Gold Medal in the Recurve Women’s Team event at the #AsianGames2026.
The first Asian Games Gold for India’s women’s recurve team, a landmark moment for… pic.twitter.com/YOhw7YWuMI
— Kiren Rijiju (@KirenRijiju) October 2, 2026