అడుగుల మధ్య బరువు సమన్వయం.. ఆరోగ్యానికి ప్రధానం
వేగంగా గమ్యాన్ని చేరుకోవాలనే తొందర ఉండదు. అడుగుల మధ్య పోటీ అసలే ఉండదు. శరీరాన్ని కదిలిస్తూనే మనసును సమన్వయం చేసే కసరత్తు ఉంటుంది. అదే థాయ్ చీ వాకింగ్. నడకను శారీరక వ్యాయామంలా కాకుండా, కదులుతున్న ధ్యానంలా మార్చే వినూత్న పద్ధతి ఇది. నడకతో పోలిస్తే ఎన్నో రెట్లు లాభాన్నిచ్చే ఈ విధానం ఓ యుద్ధ విద్య.
థాయ్ చీ… అడుగుల్లో ఆరోగ్యం!
అడుగు ముందుకు వేయడం అన్నది పసితనంలోనే నేర్చుకుంటాం. కానీ, ఆ అడుగులో ఒంటి బరువును ఎలా మోయాలి? పాదం నేలను ఎలా తాకాలి? శ్వాసకు, కదలికలకు మధ్య ఎలాంటి సమన్వయం ఉండాలి?… లాంటి చిన్న చిన్న అంశాలే ఒక సాధారణ నడకను ఆరోగ్య సాధనంగా మారుస్తాయి. ఈ విషయాన్నే చెబుతుంది థాయ్ చీ వాకింగ్. ఇందులో అడుగుల మధ్య బరువును సమన్వయం చేసుకోవడం ప్రధానం. దీనివల్ల బరువు, కీళ్ల నొప్పులు తగ్గడంతో పాటు ఒత్తిడి అదుపు చేయడంలాంటి ఎన్నో మానసికపరమైన లాభాలూ ఉన్నాయట. అందుకే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఈ రకమైన నడక మీద ఆసక్తి పెరుగుతున్నది.
థాయ్ చీ మూలాలు చైనా సంప్రదాయ యుద్ధ కళల్లో ఉన్నాయి. నెమ్మదైన శరీర కదలికలు, నియంత్రిత శ్వాస, ఏకాగ్రతతో కూడిన ఈ సాధన తర్వాతి కాలంలో క్రమంగా ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడే వ్యాయామంగా ప్రాచుర్యం పొందింది. సాధారణ నడకలో అడుగుల వేగం దూరం ప్రధానం కాగా థాయ్ చీలో ప్రతి అడుగు వెనక ఉన్న కదలికల నియంత్రణ కీలకం.
ఎలా చేస్తారు?!
ఈ వాకింగ్లో శరీరాన్ని నిటారుగా ఉంచి, భుజాలు వదులుగా ఉంచాలి. మోకాళ్లను స్వల్పంగా వంచి ఒక కాలుపై శరీర బరువును నిలిపి, మరో పాదాన్ని నెమ్మదిగా ముందుకు తీసుకెళ్లాలి. ముందుగా మడమ నేలను తాకాలి. ఆ తర్వాత పాదం మొత్తం నేలపై ఆనాలి. శరీర బరువును ఒక్కసారిగా కాకుండా క్రమంగా ముందుకు మార్చాలి. ఇదే ప్రక్రియను మరో కాలుతో కొనసాగించాలి. ఈ సమయంలో చేతుల కదలికలు సహజంగా ఉండాలి. శ్వాసను బలవంతంగా నియంత్రించకుండా సహజంగా సాగనివ్వాలి. పాదం నేలను తాకే తీరు నుంచి శరీరం బరువు మారే విధానం వరకు ప్రతి అంశాన్నీ గమనించడమే ఈ సాధనలో ప్రత్యేకత. అలా సాగుతూ చేతులు కాళ్లని వివిధ భంగిమల్లో ఉంచుతారిందులో.

Thai Chi Walking
సమతుల్యతే ప్రధానం
మనిషి నడకలో సమతుల్యత ఎంతో కీలకం. ముఖ్యంగా వయసు పెరిగేకొద్దీ కండరాల బలం, కదలికలపై నియంత్రణ తగ్గే అవకాశం ఉంటుంది. థాయ్చీ వాకింగ్లో ఒక్కో కాలుపై బరువును నిలిపి, నెమ్మదిగా మరో కాలుకు మార్చడం వల్ల కాళ్లు, చీల మండలం, పాదాల కండరాలు చురుగ్గా పనిచేస్తాయి. శరీర స్థిరత్వం, కదలికల సమన్వయాన్ని మెరుగు పరచుకోవడానికి ఇది తోడ్పడుతుంది. వృద్ధుల్లో థాయ్చీ సాధన సమతుల్యాన్ని పెంచి, పడిపోయే ప్రమాదాన్ని తగ్గించడంలో సాయ పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ తరహా వాకింగ్లో శరీరాన్ని కదుపుతున్నప్పుడు శ్వాసను కూడా నియంత్రించాల్సి ఉంటుంది. దానివల్ల మనసు ప్రస్తుతంలో, ముఖ్యంగా ఈ క్షణంలో ఉంటుంది. దీంతో అది ధ్యానంలా పనిచేసి ఒత్తిడి తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ కదులుతూ ఉండటం వల్ల ఎండార్ఫిన్లు ఉత్పత్తి అయ్యి మనసు హాయిగా ఉంటుంది. అంతేకాదు, ఈ నడక బరువు తగ్గేందుకు అద్భుతంగా పనిచేస్తుందట. కష్టతరమైన వ్యాయామం కాకపోయినా ఇందులోని కదలికలు అధిక క్యాలరీలను బర్న్ చేసి, జీవక్రియా వేగాన్ని పెంచి కొవ్వు కరిగేందుకు తోడ్పడతాయట. ఇలా ఎన్నో శారీరక మానసికపరమైన ఉపయోగాలు ఉండటం వల్లే ఇది ఈ మధ్య కాలంలో తెగ ఫేమస్ అవుతున్నదన్నమాట!

Thai Chi Walking 2
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

