గోపాలకృష్ణుడు నందబాలుడు
గ్రామీణ తెలంగాణ నేపథ్య కథాంశంతో రూపొందిస్తున్న చిత్రం ‘ఇడుపు కాయితం’.
గ్రామీణ తెలంగాణ నేపథ్య కథాంశంతో రూపొందిస్తున్న చిత్రం ‘ఇడుపు కాయితం’. ప్రియదర్శి, నాగదుర్గ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని బన్నీ వాస్, తబిత సుకుమార్ నిర్మిస్తున్నారు. వంశీ రెడ్డి దొండపాటి దర్శకుడు. డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకురానుంది. శనివారం ఈ సినిమా నుంచి ‘గోగులు గోగులు’ అనే పాటను విడుదల చేశారు. సురేష్ బొబ్బిలి స్వరపరచిన ఈ పాటకు కొంగరి కృష్ణ సాహిత్యాన్ని అందించారు.
అభిక్య తనికెళ్ల, రచిత రాయప్రోలు, జయశ్రీ పల్లెం, స్నిగ్ధ శర్మ ఆలపించారు. ‘గోగులు గోగులు గోపాలకృష్ణుడు సేలి.. గోపాలకృష్ణుడు ఆనంద బాలుడు.. నందకుమారుడు రమ్మనరే రమ్మనరే నలుగుకు నా ముద్దు గోపాలకృష్ణున్ని’ అంటూ నాయకానాయికల వివాహ వేడుక నేపథ్యంలో ఈ పాటను చిత్రీకరించారు. పెళ్లి తాలూకు సంబరాన్ని అందంగా ఆవిష్కరిస్తూ కలర్‌ఫుల్ విజువల్స్‌తో ఈ పాట సాగింది. ఈ చిత్రానికి సంగీతం: సురేష్ బొబ్బిలి, రచన-దర్శకత్వం: వంశీరెడ్డి దొండపాటి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

