భూముల వేలం ఆపకుంటే.. ఏ త్యాగానికైనా సిద్ధం
కూకట్పల్లి ట్రక్‌పార్క్, హౌసింగ్ బోర్డు భూముల వేలం పాటలను ఆపకపోతే ఎలాంటి త్యాగానికైన సిద్ధమని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
- ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
- కూకట్‌పల్లిలో స్థలాల వేలం పాటను నిరసిస్తూ… నేడు, రేపు శాంతియుత నిరాహార దీక్షా
కేపీహెచ్‌బీకాలనీ, నవంబర్ 21: కూకట్పల్లి ట్రక్‌పార్క్, హౌసింగ్ బోర్డు భూముల వేలం పాటలను ఆపకపోతే ఎలాంటి త్యాగానికైన సిద్ధమని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శనివారం క్యాంప్ ఆఫీస్‌లో భూముల పరిరక్షణే లక్ష్యంగా నేడు, రేపు చేపట్టనున్న శాంతియుత నిరాహార దీక్షపై వామపక్ష నేతలు, ప్రజా సంఘాల నాయకులు, కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూకట్‌పల్లిలోని హుడా ట్రక్పార్కుకు చెందిన 3.18 ఎకరాల స్థలాన్ని విక్రయించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల 27న వేలం పాట నిర్వహించేందుకు సిద్ధమైందన్నారు.
ప్రజలకు ఉపయోగపడే భూములను అమ్మడం వల్ల భవిష్యత్‌లో ప్రజా అవసరాలకు స్థలం లేకుండా పోతుందని, కాలనీలు, బస్తీల్లో నివసించే ప్రజలందరికీ నష్టం జరుగుతుందన్నారు. సర్కార్ స్థలాన్ని అమ్మకుండా ప్రభుత్వంపై పోరాడేందుకు ప్రజలంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. భూ ముల పరిరక్షణే లక్ష్యంగా ఈ నెల 22,23 తేదీల్లో శాంతియుత నిరాహార దీక్ష చేయనున్నట్లు తెలిపారు. ఈ దీక్షకు వామపక్ష నేతలు సైతం మద్దతు తెలపడం సంతోషకరమని, స్థానిక ప్రజలందరూ దీక్షలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
దీక్షకు ప్రభుత్వం, పోలీసుల నుంచి ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే, ప్రజా ప్రయోజనాల కోసం ఎలాంటి త్యాగలాకైనా సిద్ధమని, ఎట్టి పరిస్థితులలో ఈ స్థలాన్ని అమ్మనివ్వమని స్పష్టం చేశారు. స్థానిక ప్రజలంతా వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరించడం సరికాదని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన విధంగా గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.
భవిష్యత్ తరాలకు భూములేవి?
కూకట్‌పల్లిలో హుడా ట్రక్‌పార్కు భూములు, కేపీహెచ్‌బీ కాలనీలో హౌసింగ్ బోర్డు భూములను కాంగ్రెస్ సర్కార్ అమ్ముకుంటూ పోతే…. భవిష్యత్ ప్రజా ప్రయోజనాలకు స్థలాలు ఏవని వామపక్ష నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిన రేవంత్‌రెడ్డి సర్కార్ పాలన మూడు సంవత్సారాలు పూర్తైనా ప్రజలకు ఉపయోగపడే ఒక్కపని కూడా చేయలేదని విమర్శించారు. ప్రజలకు కేటాయించాల్సిన భూములను ప్రభుత్వం అమ్ముకోవడం సరికాదన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ట్రక్‌పార్క్ భూములను అమ్మనివ్వకుండా పోరాడుతామని స్పష్టం చేశారు.
సమావేశంలో నియోజకవర్గం కోఆర్డినేటర్ సతీష్ఆరోరా, మాజీ కార్పొరేటర్లు జూపల్లి సత్యనారాయణ, మందడి శ్రీనివాస్‌రావు, బాబురావు, ముద్దం నర్సింహాయాదవ్, పండాల సతీష్‌గౌడ్, మహేశ్వరి శ్రీహరి, ఆవుల రవీందర్‌రెడ్డి, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు గౌసుద్ధీన్, సీ పీఎం మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఐలాపురం రాజశేఖర్, సీపీఐ రాష్ట్ర నాయకులు ఏసురత్నం, సీపీఐ(ఎంల్) ఎన్డీ హైదరాబాద్ కార్యదర్శి అనురాధ, సీపీఐ నాయకులు జి.కృష్ణ, సీనియర్ నాయకులు కొండల్రావు, వెంకట్‌రెడ్డి, చారీ పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

