న్యూఢిల్లీ: బీపీ టెస్ట్ కోసం పది నిమిషాలు వేచి ఉండమని డాక్టర్ అన్నారు. అయితే ఆ వ్యక్తి సహనం కోల్పోయాడు. ఒక స్టూల్‌తో డాక్టర్‌పై దాడి చేశాడు. (BP patient Attacks Doctor) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో బీపీ టెస్ట్ చేయకుండానే అతడి బీపీ బయటపడిందంటూ కామెంట్లు వెల్లువెత్తాయి. ఒక రోగి వైద్య పరీక్షల కోసం డాక్టర్ వద్దకు వెళ్లాడు. అయితే అతడి బీపీ చెక్ చేయడానికి పది నిమిషాలు వేచి ఉండమని ఆ డాక్టర్ చెప్పారు.
కాగా, ఆ వ్యక్తి ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యాడు. కుర్చీ నుంచి లేచి నిలబడి పక్కనే ఉన్న బరువైన చెక్క స్టూల్ తీసుకుని వైద్యుడి తలపై బలంగా కొట్టాడు. దెబ్బ తగలడంతో ఆ డాక్టర్ బాధతో అల్లాడిపోయారు. ఆ రోగి దాడి నుంచి తప్పించుకునేందుకు స్టూల్‌ను గట్టిగా పట్టుకున్నారు. అయితే ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో అన్నది తెలియలేదు.
మరోవైపు డాక్టర్ రూమ్‌లోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో దీనిపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ఆ రోగి తీరుపై నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైద్యులపై పెరుగుతున్న అసహనం, హింసకు ఇది ఒక నిదర్శనమని ఆరోపించారు. డాక్టర్‌పై రోగి దాడిని చాలా మంది ఖండించారు. అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరి కొందరు నెటిజన్లు మాత్రం హాస్యంగా స్పందించారు. ఆ రోగి కోపమే అతడి బీపీ ఎక్కువగా ఉందని నిరూపించిందని చాలా మంది కామెంట్లు చేశారు. ‘బీపీ ఎక్కువగా ఉందో లేదో తెలుసుకోవడానికి ఇది ఒక మార్గం’ అని ఒకరు చమత్కరించారు. ‘ఇకపై అతడి బీపీ చెక్ చేయాల్సిన అవసరం లేదు. అది ఎంత ఎక్కువగా ఉందో అతనే నిరూపించాడు’ అని మరొకరు కామెంట్ చేశారు. ‘డాక్టర్ బీపీని అతడు పెంచాడు, కానీ అతడి బీపీ మాత్రం సాధారణ స్థితికి వచ్చి ఉంటుంది’ అని మరొకరు సరదాగా వ్యాఖ్యానించారు
इसका तो बिना किसी मशीन के बीपी चेक हो गया…😃🔥
यह व्यक्ति डॉक्टर के पास अपना बीपी चेक कराने पंहुचा था
लेकिन,
डॉक्टर ने इनसे 10 मिनट रुकने को कहा।
इतने में तो भाई साहब का बीपी हाई लेवल पर पहुंच गया और वहीं डॉक्टर पर हमला करना शुरू कर दिया। pic.twitter.com/Yd48aHY733
— Amit sehra (@darsan44562) August 1, 2026