న్యూఢిల్లీ: అయోధ్యలోని రామమందిరంలో విరాళాల చోరీపై ప్రతిపక్ష ఎంపీలు వినూత్నంగా నిరసన తెలిపారు. శుక్రవారం పార్లమెంట్ ఆవరణలో ఒక వీధి నాటకాన్ని ప్రదర్శించారు. (Opposition protest) బీహార్‌లోని పూర్నియా కాంగ్రెస్ ఎంపీ పప్పు యాదవ్ ఒక హిందూ సన్యాసి వేషంలో కనిపించారు. సమాజ్‌వాదీ పార్టీ మహిళా ఎంపీ ఒక భక్తురాలి పాత్రను పోషించారు. ఆ భక్తురాలు గుడి పేరు మీద డబ్బు సమర్పించగా, ఆ సన్యాసి ‘దొంగతనం మా రక్తంలోనే ఉంది’ అని చెబుతూ ఆ విరాళాన్ని తన జేబులో వేసుకున్నారు.
కాగా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. నిరసన ప్రదేశంలో ఉంచిన విరాళాల పెట్టెలో ప్రతీకాత్మక కానుకగా ఆయన డబ్బులు వేశారు. కొందరు ఎంపీలు కూడా విరాళాలు సమర్పించారు. ఆ తర్వాత యాదవ్ పాత్ర ఎంపీ ఆ విరాళాల పెట్టెను తీసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అక్కడ గుమిగూడిన ప్రతిపక్ష ఎంపీలు హర్షధ్వానాలు, నవ్వులతో హోరెత్తించారు. కానుకలు, అధికారాన్ని అపహరించారంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మరోవైపు నీట్ వివాదంపై సీజేపీ నేతృత్వంలో జంతర్‌మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులపై బలప్రయోగంపైనా ప్రతిపక్ష ఎంపీలు నిరసన తెలిపారు. ‘కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు ఎందుకు రావడం లేదు? ఈ ఆదేశం ఎవరు ఇచ్చారు?’ అని రాసి ఉన్న పెద్ద బ్యానర్‌ను ప్రదర్శించారు.
#WATCH | Delhi | Monsoon Session of the Parliament | Opposition MPs stage a protest over the issue of alleged Ayodhya Ram Mandir donations embezzlement pic.twitter.com/W3netnDNPI
— ANI (@ANI) July 31, 2026