రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : ‘ఇందిరమ్మ చీర కట్టుకోవాలె.. సీఎం రేవంత్‌రెడ్డి సభకు రావాలె. లేకుంటే రూ.500 ఫైన్’ అంటూ సిరిసిల్లలోని ఓ రిసోర్స్ పర్సన్ (ఆర్పీ).. మహిళా సంఘాల లీడర్లకు పంపిన వాయిస్ మెసేజ్ చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభ సక్సెస్ కోసం మహిళా సంఘాలకు టార్గెట్ నిర్దేశించినట్టు తెలుస్తుండగా, మహిళా సంఘాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
ఇందిరమ్మ చీరలు కట్టుకొని రావాలని ఆర్డర్లు జారీ చేయడం, సభకు రాని మహిళా సంఘాల సభ్యుల పేర్లు నోట్ చేసుకొని, రూ.500 ఫైన్ వేయాలని ఆదేశాలు ఇవ్వడం.. వాయిస్‌లో క్లుప్తంగా వివరించింది. కచ్చితంగా పోగ్రాం సక్సెస్ కావాలె. వచ్చేటప్పుడు ఇందిరమ్మ చీరలు కట్టుకొని రావాలి. గ్రూప్ వైస్ అటెండెన్స్ తీసుకుంటం. గ్రూపుల వారీగా ఫొటోతీసి పెట్టండి. రాని వారికి రూ.500 వరకు ఫైన్ వేస్తున్నారు. తర్వాత మమ్మల్ని అనవద్దు.అని వాయిస్ మెసేజ్‌లో కోరారు.