దీక్షా దివస్ యాదిలో..
2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను ఆదివారం యావత్ తెలంగాణ సమాజం మరోసారి గుర్తుచేసుకున్నది. కేసీఆర్ దీక్ష.. అరెస్ట్ తరువాత ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమం.. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేంద్రం మెడలు వంచిన విధానం.. తదితర ఘట్టాలను ప్రజానీకం యాది చేసుకున్నది.
2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను ఆదివారం యావత్ తెలంగాణ సమాజం మరోసారి గుర్తుచేసుకున్నది. కేసీఆర్ దీక్ష.. అరెస్ట్ తరువాత ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమం.. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేంద్రం మెడలు వంచిన విధానం.. తదితర ఘట్టాలను ప్రజానీకం యాది చేసుకున్నది. పలుచోట్ల ర్యాలీలు నిర్వహించారు. తెలంగాణ తల్లి, జయశంకర్, అంబేద్కర్ విగ్రహాలకు నివాళులర్పించారు. అమరుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ వారికి నీరాజనాలు అర్పించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు నివాళులర్పించారు.
అనంతరం డాక్యుమెంటరీని ప్రదర్శించారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఎమ్మెల్సీలు డాక్టర్ దాసోజు శ్రవణ్, నవీన్‌కుమార్‌రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్, పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్‌రెడ్డి, నాయకులు దేవర మల్లప్ప, ఉపేంద్రాచారి, మన్నె గోవర్ధన్‌రెడ్డి, కే విప్లవ్‌కుమార్, గోసుల శ్రీనివాస్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేటలో నిర్వహించిన దీక్షా దివస్‌లో బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పాల్గొన్నారు. రంగధాంపల్లి అమరవీరుల స్తూపానికి కూడా వారు నివాళులర్పించారు.
కాగా జనగామ సభలో హరీశ్‌రావుతోపాటు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌లో మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఖమ్మంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు తాతా మధు, తక్కెళ్లపల్లి రవీందర్రావు, వనపర్తిలో మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌లో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, సూర్యాపేటలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పాల్గొన్నారు.
హైదరాబాద్‌లోని బాలాపూర్ చౌరస్తాలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవి, మహబూబాబాద్‌లో అంబేద్కర్ విగ్రహానికి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మెదక్‌లో అమరుల స్తూపం వద్ద మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి నివాళులర్పించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో చేపట్టిన దీక్షలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి కూర్చున్నారు. కాగా దుబాయ్, అమెరికాలోని ఆస్టిన్ నగరంలోనూ అక్కడి నేతలు దీక్షా దివస్ నిర్వహించారు. నమస్తే తెలంగాణ నెట్వర్క్

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన దీక్షా దివస్‌లో భాగంగా జయశంకర్ సార్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, నవీన్‌కుమార్‌రెడ్డి, నేతలు దేవీప్రసాద్, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కే విప్లవ్‌కుమార్, మన్నె గోవర్ధన్‌రెడ్డి, రాంబాబు యాదవ్, కే విజయ్‌కుమార్ తదితరులు.

ఆదివారం సిద్దిపేట శివారు రంగధాంపల్లి చౌరస్తాలోని అమరవీరుల స్తూపానికి నివాళులర్పిస్తున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తదితరులు
కేసీఆర్‌కు వందనం
వనపర్తిలో నిర్వహించిన దీక్షా దివస్ సభ వద్ద ప్రచార రథంపై ఉన్న కేసీఆర్ చిత్రానికి నమస్కరిస్తున్న వృద్ధురాలు. పెద్ద కొడుకులా వృద్ధులకు పింఛన్లు ఇచ్చి ఆదుకున్నాడని కొనియాడింది.

హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో నిర్వహించిన దీక్షా దివస్ సభలో మాట్లాడుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్. చిత్రంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తదితరులు

కరీంనగర్ జిల్లా అలుగునూర్ దీక్షా దివస్ సందర్భంగా డప్పు చాటింపు వేస్తున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. చిత్రంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్

మహబూబ్‌నగర్‌లోని అమరవీరుల స్తూపం వద్ద మాట్లాడుతున్న మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్

నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌లో మాట్లాడుతున్న మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి

జనగామలో అమరులకు నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్‌లోని బాలాపూర్ చౌరస్తాలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అయాచితం శ్రీధర్

జనగామ జిల్లా పాలకుర్తిలో తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పిస్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు

ఖమ్మంలో నిర్వహించిన దీక్షా దివస్‌లో కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసి ‘జై తెలంగాణ’ నినాదాలు చేస్తున్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు తదితరులు

మెదక్‌లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తున్న మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శేరి సుభాష్‌రెడ్డి తదితరులు

మేడ్చల్‌లో నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి

దుబాయ్‌లో నిర్వహించిన దీక్షా దివస్‌లో పాల్గొన్న ఎన్నారై బీఆర్ఎస్ నేతలు ఆకుల సురేందర్, యజ్వేందర్, రాజేశ్వర్, శ్రీకాంత్, అభినవ్, రాజేశ్ తదితరులు

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్ నగరంలో నిర్వహించిన దీక్షా దివస్‌లో కేసీఆర్ చిత్రపటాలతో పాల్గొన్న బీఆర్ఎస్ ఎన్నారై నేతలు

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి. చిత్రంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి తదితరులు

మహబూబాబాద్‌లో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి నినదిస్తున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, జడ్పీ మాజీ చైర్పర్సన్ బిందు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

