Kangana Ranaut: ఇస్లామిస్టులతో కలిశాక లెఫ్టిస్టులు అవుతున్నారు: కంగనా రనౌత్
Kangana Ranaut : బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తన ఫీలింగ్ వ్యక్తం చేశారు. ఇప్పుడు తానొక మేల్కొన్న హిందువు మహిళను అని వెల్లడించారు. ఎక్స్‌లో ఇవాళ ఆమె ఓ వీడియోను పోస్టు చేశారు. చాలా మంది మహిళలు ఇస్లామిస్టులతో కలిశాక లెఫ్టిస్టుల్లా మారుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ కంగనా రనౌత్(Kangana Ranaut) ఇవాళ తన ఎక్స్ అకౌంట్లో ఓ వీడియోను పోస్టు చేశారు. దాంట్లో ఆమె తన ఫీలింగ్ వ్యక్తం చేశారు. తానొక జాగృతి చెందిన హిందువు మహిళను అని ఆమె పేర్కొన్నారు. అయితే ఇస్లామిస్టులతో కలిసిన తర్వాత హిందూ మహిళలు కరుడుకట్టిన వామపక్షవాదుల తరహా మారుతున్నట్లు ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యస్త హిందువు మహిళగా ఉన్న తాను జాగృతి చెందిన హిందువుగా మారినట్లు పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితం కాక్రోచ్ జనతా పార్టీపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారామె. సీజేపీ ఓ మురికికాలువ అంటూ ఆమె తన ఎక్స్‌లో వివాదాస్పద పోస్టు చేశారు. తాజా వీడియో మెసేజ్‌లో కంగనా రనౌత్ మాట్లాడుతూ.. ఒక ఫీలింగ్ షేర్ చేసుకోవాలని ఉందన్నారు. పార్లమెంట్‌కు వెళ్లడం ఆలస్యం అవుతున్నా, తన ఫీలింగ్‌ను పంచుకోవడం ముఖ్యమన్నారు.
ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళల గురించి ఆమె తన వీడియోలో ప్రస్తావించారు. అనేక మంది హిందువు మహిళలతో తనకు పరిచంయ ఉందని, కానీ ఎవరికీ రాజకీయంగా కానీ, మతపరంగా కానీ చాలా వరకు మహిళల్లో అవగాహన ఉండేదికాదన్నారు. సాధారణంగా యువతలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటాయని, వాళ్లు తటస్థంటా ఉంటారన్నారు. కానీ ఇస్లామిస్టులతో పరిచయం ఏర్పడిన తర్వాత.. ఆ మహిళల్లో మార్పులు వస్తుంటాయని కంగనా అన్నారు. ఇస్లామిస్టులతో కలిసిన తర్వాత లెఫ్టిస్టులు అవుతారని, దీంట్లో ఎటువంటి నష్టం లేదని, ఎందుకంటే రాజ్యాంగం వాళ్లకు ఆ స్వేచ్ఛ ఇచ్చిందని, మనకు కావాల్సిన ఏదైనా మతాన్ని కానీ, ఐడియాలజీని కానీ స్వీకరించవచ్చు అన్నారు.
అయితే తాను ఇప్పుడు మధ్యస్థ హిందువును కాదు అన్నారు. అయితే ఇప్పుడు తనను వేధిస్తున్నారని, సంఘ్‌పరివార్‌లో ఎప్పుడు చేరానని అడుతున్నారని, ఇప్పుడు నేనొక జాగృతి పొందిన హిందువును అని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ తరహా లాంటి హిందువును అని, మార్పిడి జరగాలని కోరుతున్నానని, తానెందుకు మార్పిడి కావొద్దన్నారు. హిందువు మహిళలు ఓ నిర్దిష్ట ఐడియాలజీ ఐడెంటిటీ కోసం పోరాటం చేయాలన్నారు. మార్పిడితో చైతన్యం పొందాలని, మరి ఆ దారిని ఎందుకు మూసివేస్తున్నారని ఆమె అడిగారు.
Aaj ek vichar nahi ek feeling share kar rahi hoon, aap bhi batana aapki kya feeling hai iss vishay ke baare mein 🙂 pic.twitter.com/kNCRUBVIru
— Kangana Ranaut (@KanganaTeam) August 3, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

