Xi Jinping | అమెరికాలో పర్యటించనున్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. ట్రంప్‌తో ద్వైపాక్షిక చర్చలు
Xi Jinping : చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అమెరికాలో పర్యటించబోతున్నారు. ఈ సందర్బంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ విషయాన్ని చైనా అధికారికంగా వెల్లడించింది.
Xi Jinping : చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అమెరికాలో పర్యటించబోతున్నారు. ఈ సందర్బంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ విషయాన్ని చైనా అధికారికంగా వెల్లడించింది. చైనా విదేశాంగా శాఖ ప్రతినిధి గువో జైకున్ వెల్లడించిన వివరాలివి. జిన్‌పింగ్ సెప్టెంబర్ 23-25 వరకు అమెరికాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతోపాటు వ్యాపారం, వాణిజ్యం సహా కీలక అంశాలపై చర్చలు జరుగుతాయి.
అలాగే, ప్రపంచ శాంతి, అభివృద్ధి లక్ష్యంగా ఈ చర్చలు ఉంటాయి. చైనా-అమెరికా మధ్య నిర్మాణాత్మక, వ్యూహాత్మక సంబంధాలు, స్థిరత్వం, సహకారం వంటి అంశాలపై చర్చలు జరుగుతాయని గువో అన్నారు. అలాగే, విబేధాల పరిష్కారానికి ప్రయత్నిస్తూ, ఇరు దేశాల ప్రయోజనాల కోసం ఈ పర్యటన ఉంటుందని వివరించారు. ప్రపంచ శాంతి, స్థిరత్వం, ప్రగతి లక్ష్యంగా చర్చలు జరుపుతామన్నారు. మరోవైపు అమెరికాలో అడుగుపెట్టనున్న జిన్‌పింగ్‌కు నేరుగా ట్రంప్ స్వాగతం పలుకుతారని అమెరికా ప్రకటించింది.
జిన్‌పింగ్‌తో అన్ని అంశాలపై తాను చర్చిస్తానని ట్రంప్ ఇటీవల మీడియాకు చెప్పారు. ట్రంప్, జిన్‌పింగ్ మధ్య తాజాగా అమెరికా విధించిన టారిఫ్‌లు, ఏఐ, టెక్నాలజీ, రక్షణ రంగంతోపాటు ఇరాన్‌తో అమెరికా యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, తైవాన్ సమస్, అంతరిక్ష ఆయుధాలు వంటివి కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. చైనా అధ్యక్షుడి పర్యటనకు సంబంధించి ఇటీవలే చైనా ఉపాధ్యక్షుడు హీ లిఫెంగ్ అమెరికాలో పర్యటించి, చర్చలు జరిపారు. చైనా, అమెరికా మధ్య అనేక అంశాల్లో విబేధాలున్న సంగతి తెలిసిందే.
చైనా ఉత్పత్తులపై విధించే టారిఫ్‌లను జిన్‌పింగ్ వ్యతిరేకిస్తున్నారు. ఇదే సమయంలో ఇటీవల రష్యా, ఇరాన్ నుంచి చమురు కొనే దేశాలపై ట్రంప్ విధించిన సుంకాలను కూడా చైనా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో చైనా-అమెరికా మధ్య జరగబోయే చర్చలపై ఆసక్తి నెలకొంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- china
- Donald Trump
- US
- Xi Jinping
RELATED ARTICLES
తాజా వార్తలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
డీజే ట్రాలీలో పేలిన టపాసులు.. నలుగురికి గాయాలు
Rahul Gandhi | పోలీసుల దాడిలో వినికిడి శక్తి కోల్పోయిన విద్యార్థిని.. ఢిల్లీ పోలీసులపై రాహుల్ గాంధీ ఆగ్రహం
Puri Jagannadh | ‘జార్జ్ క్రిష్’ సెట్స్‌లో పూరి జగన్నాథ్ సందడి.. శ్రీను వైట్లకు అదిరిపోయే సర్ప్రైజ్!
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్ఓ డా.రాహుల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

