కరువు నివారణ చర్యల్లో ప్రభుత్వాలు విఫలం
రాష్ట్రంలో కరువు నివారణ చర్యల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీ పీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ విమర్శించారు.
- ఖమ్మం సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
ఖమ్మం కమాన్‌బజార్, నవంబర్ 22 : రాష్ట్రంలో కరువు నివారణ చర్యల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీ పీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ విమర్శించారు. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో 360కి పైగా మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వమే ప్రకటించినా నివారణ చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఖమ్మంలోని సుందరయ్య భవన్లో ఆదివారం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 24 లక్షలకుపై ఎకరాల్లో రైతులు తమ పంటలను నష్టపోయారని ప్రభుత్వ లెకలు చెబుతున్నాయని, వాస్తవంగా మరో ఐదారు లక్షల ఎకరాల్లో అదనంగా పంట నష్టం జరిగిందని పేరొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వరి పంటకు ఎకరాకు రూ.30 వేలు, వాణిజ్య పంటలకు ఎకరాకు రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించాలని, కేంద్ర ప్రభుత్వం కనీసం రూ.50 వేల కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రేషన్‌కార్డుపై ఒక్కొక్కరికీ 10 కేజీల బియ్యం, పప్పు, మంచినూనె సహా 14 రకాల నిత్యావసర సరుకులను అందించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

