ప్రాణాలైనా అర్పిస్తాం.. చుక్క నీరు పోనివ్వం
‘ఏపీ జలదోపిడీని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆపకపోతే రైతాంగం, ప్రజలతో కలిసి నాగార్జున సాగర్ వద్ద జరిగే నిర్మాణ పనులు ఆపేంతవరకూ బీఆర్ఎస్ పోరాడుతుంది. ప్రాణాలైనా అర్పిస్తాం గానీ సాగర్ నుంచి ఏపీకి చుక్క నీరు పోనివ్వబోము’ అని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హెచ్చరించారు.
- ఏపీ జలదోపిడీ ఆపకపోతే బీఆర్ఎస్ ఉద్యమిస్తుంది
- హైదరబాద్‌కు నీరివ్వకపోతే మంత్రుల ఇండ్ల ముట్టడే
- మంత్రులను, ఎమ్మెల్యేలను తరిమికొట్టే రోజులొస్తయ్
- నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నకిరేకల్, నవంబర్ 22: ‘ఏపీ జలదోపిడీని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆపకపోతే రైతాంగం, ప్రజలతో కలిసి నాగార్జున సాగర్ వద్ద జరిగే నిర్మాణ పనులు ఆపేంతవరకూ బీఆర్ఎస్ పోరాడుతుంది. ప్రాణాలైనా అర్పిస్తాం గానీ సాగర్ నుంచి ఏపీకి చుక్క నీరు పోనివ్వబోము’ అని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హెచ్చరించారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని సువర్ణ గార్డెన్ ఫంక్షన్ హాలులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో ఇప్పటికే 3,000 ట్యాంకర్లతో నీటి కొనుగోళ్లు జరుగుతున్నాయని, హైదరాబాద్‌కు సరిపడా తాగునీరు ఇవ్వకపోతే సీఎం, మంత్రుల, విప్ల, ఎమ్మెల్యేల ఇండ్లను ప్రజలు ముట్టడిస్తారని స్పష్టంచేశారు.
జలదోపిడీపై వారిని తన్ని తరిమే రోజులు వస్తాయని చెప్పారు. ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి పనులు చేపడితే తెలంగాణ ప్రభుత్వం, అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సాగర్ వద్ద జరిగే భారీ నిర్మాణ పనులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు కనిపించడం లేదని నిలదీశారు. గత ఏడాదికాలంగా సర్వే, మొబిలైజేషన్ పనులు జరుగుతున్నా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తున్నదని, కుడివైపున పనులు శరవేగంగా జరుగుతున్నా తెలంగాణ ఇరిగేషన్ శాఖకు గానీ, ప్రభుత్వ పెద్దలకు గానీ సమాచారం లేకపోవడం ప్రభుత్వ వైఫల్యం కాదా? అని ప్రశ్నించారు. నల్లగొండ జిల్లాకే చెందిన నీటిపారుదశల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మౌనంగా ఉండటంలో ఆంతర్యమేందని నిలదీశారు.
ఉమ్మడి జిల్లా ప్రయోజనాలకు, అక్కడి సాగు, తాగునీటికి నష్టం కలిగించేలా ఏపీ ప్రాజెక్టులు కడుతుంటే సీఎం రేవంత్‌రెడ్డి, స్థానిక మంత్రులు ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణలో సాగర్ ఆయకట్టు ఎడారిగా మారితే బాధ్యులెవరని? కృష్ణా ట్రెబ్యునల్ ముందు తెలంగాణ వాదనలలను ఎందుకు గట్టిగా వినిపించడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సాగర్‌లో జరుగుతున్న ఇన్‌టేక్ వెల్ నిర్మాణ పనులను అడ్డుకోవాలని, ఏపీ జలదోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రగడపు నవీన్‌రావు, నాయకులు పల్లె విజయ్, రాచకొండ వెంకట్, దైద పరమేశం, కొండ వినయ్, అవిరెండ్ల జనార్దన్, చిట్యాల అశోక్, ముక్కాముల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

